నటితో విడాకులు.. చాలా హ్యాపీగా అనిపించింది: డైరెక్టర్ కామెంట్స్ | Kollywood Director Parthiban comments about Divorce with actress seetha | Sakshi
Sakshi News home page

Parthiban: నటి సీతతో విడాకులు.. చాలా సంతోషంగా ఉన్నా: పార్తీబన్ కామెంట్స్

Feb 11 2026 3:52 PM | Updated on Feb 11 2026 4:45 PM

Kollywood Director Parthiban comments about Divorce with actress seetha

కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ పార్తీబన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత లైఫ్ గురించి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నటి సీతను పెళ్లాడిన ఆయన.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. ఈ సందర్భంగా తమ వైవాహిక బంధం, విడాకుల గురించి చెప్పుకొచ్చారు. 

సీతతో విడిపోయినందుకు తానెప్పుడు బాధపడలేదని అన్నారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే తనతో ఉన్న 12 సంవత్సరాల నా జీవితం అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని వెల్లడించారు. ఎందుకంటే ఈ రోజుల్లో పురుషులు, మహిళలు వివాహం కంటే స్వతంత్రంగా ఉండటాన్నే ఇష్టపడతారని పార్థీబన్‌ అన్నారు. ఏ స్త్రీ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారని ఆర్ పార్థీబన్‌ పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌

ఆర్ పార్తీబన్‌ కెరీర్‌..

కాగా.. ఆర్ పార్తీ బన్‌ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్‌- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పార్తీబన్ ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులు తీసుకుంది. ఇక ఆర్ పార్తీబన్ సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌ 1, పొన్నియన్‌ సెల్వన్‌ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాకుండా సుడల్‌ 1 వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేశాడు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement