బిగ్‌బాస్ ఫేం, నటి వితికా షెరు గుడ్‌న్యూస్ చెప్పింది. పెద్దమ్మగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించింది. వితికా చెల్లెలు కృతికా తాజాగా పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. బాబు పుట్టిన శుభవార్తను అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
హీరోయిన్‌గా కెరీర్
తెలుగమ్మాయి వితిక హీరోయిన్‌గా టాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టింది. సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరో వరుణ్ సందేశ్‌తో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జంటగా బిగ్‌బాస్ షో మూడో సీజన్‌కు సైతం వెళ్లొచ్చారు. పెళ్లయిన తర్వాత కూడా చెల్లి కృతికకు పెళ్లి చేసే బాధ్యతను తనే తీసుకుంది వితికా.

చెల్లి పెళ్లి చేసిన వితికా
అక్కగా దగ్గరుండి 2022లో చెల్లి పెళ్లి చేసింది. కొద్ది నెలల క్రితమే కృతిక గర్భం దాల్చగా ఇటీవల తనే ఘనంగా సీమంతం కూడా చేసింది. ఇది చూసినవాళ్లంతా ఇలాంటి అక్క ప్రతి ఇంట్లో ఉండాలని వితికాపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే కృతిక - కృష్ణ దంపతులకు మంగళవారం (డిసెంబర్ 23న) బాబు పుట్టగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


