విశ్వక్‌ సేన్‌కు భవిష్యత్‌ ఉంది.. గొడవకు 'అర్జున్‌' ఫుల్‌స్టాప్‌ | Actor Arjun Sarja Breaks Silence On Vishwak Sen Controversy, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

విశ్వక్‌ సేన్‌పై ద్వేషం లేదు.. వారి అమ్మగారి చేతి భోజనం తిన్నాను: అర్జున్‌

Feb 8 2026 8:35 PM | Updated on Feb 9 2026 12:09 PM

Arjun Sarja Breaks Silence on Vishwak Sen controversy

ప్రముఖ నటుడు అర్జున్‌ చాలా ఏళ్ల తర్వాత దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా 'సీతాపయనం'.. ఇదే మూవీతో తన కూతురు ఐశ్వర్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో నిరంజన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మొదట విశ్వక్‌ సేన్‌ హీరోగా ప్రకటించారు. కానీ, పలు విభేదాల కారణంగా అతను వాకౌట్‌ చేశాడు. అయితే, యాదృచ్చికంగా, విశ్వక్ చిత్రం ఫంకీతో పాటు 'సీతాపయనం' కూడా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదలవుతోంది. తాజాగా తమ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో విశ్వక్‌ సేన్‌ గురించి అర్జున్‌ పలు వ్యాఖ్యలు చేశారు.

గతంలో విశ్వక​్‌తో జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ అడిగిన ప్రశ్నకు అర్జున్‌ ఇలా సమాధానం ఇచ్చారు. మా సినిమా సీతాపయనంతో పాటు విశ్వక్‌ సేన్‌ మూవీ ఫంకీ కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అతనొక యువకుడు.. తనకు చాలా భవిష్యత్‌ ఉంది. ఏదో మనకు కుదరలేదని అతనిపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. వారి అమ్మగారి చేతి భోజనం తిన్నాను. వాళ్లు బాగుండాలని కోరుకుంటాను. కాలంతో పాటు కొన్ని మరిచిపోతూ సంతోషంగా ముందుకు సాగాలి. మా రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను అని అర్జున్‌ అన్నారు.

విశ్వక్‌పై అర్జున్‌ చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్‌ నుంచి అభినందనలు వస్తున్నాయి. పెద్దరికం ఎలా ఉంటుందో చూపించావ్‌ అంటూ అర్జున​్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అర్జున్‌ కూతురు హీరోయిన్‌గా విశ్వక్‌ సేన్‌తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే, షూటింగ్‌ కొంత జరిగిన తర్వాత పలు కారణాలతో విశ్వక్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్‌, విశ్వక్‌ మధ్య మాటల గొడవ జరిగిన విషయం తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement