Seetha Payanam Movie
-
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2' హవా కొనసాగుతోంది. దీని దెబ్బకు పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని అభిమానులు తప్పితే మరెవరు పట్టించుకోవట్లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ చూసేందుకు ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. వీటిలో తెలుగు, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విష్ణు విన్యాసం, అమరావతికి ఆహ్వానం, బోర్డర్ 2, సీతా పయనం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు-వెబ్ సిరీస్‌లు (మార్చి 20)అమెజాన్ ప్రైమ్విష్ణు విన్యాసం - తెలుగు సినిమాడెడ్లోచ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్లగ్నచ షాట్ - మరాఠీ సినిమా (రెంట్)లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ డెన్మార్క్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఆంఖోంఖి గుస్తాకియాన్ - హిందీ మూవీమై లార్డ్ - తమిళ సినిమాద హౌస్ మెయిడ్ - ఇంగ్లీష్ మూవీఅమోర్ యానిమల్ సీజన్ 1 - స్పానిష్ సిరీస్కంపెనీ రిట్రీట్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్వైల్డ్ క్యాట్ - ఇంగ్లీష్ సినిమాస్ట్రే కిడ్స్ - ఇంగ్లీష్ కన్సర్ట్ మూవీనెట్ఫ్లిక్స్బోర్డర్ 2 - హిందీ సినిమాపీకీ బ్లండర్స్: ద ఇమ్మొర్టల్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీద రైజ్ ఆఫ్ ద రెడ్ హాట్ చిల్లీ పెప్పర్స్ - ఇంగ్లీష్ సినిమాఏ డిఫరెంట్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీహాట్స్టార్చిరైయా - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5కాసర్గోడ్ ఎంబసీ సీజన్ 1 - మలయాళ సిరీస్ల్యాండ్ లార్డ్ - కన్నడఅగ అగ సునాబై! కాయ్ మహంతాయ్ ససుబాయ్ - మరాఠీ సినిమాసన్ నెక్స్ట్వలవార - కన్నడ చిత్రంసీతాపయనం - తెలుగు మూవీఫోర్త్ ఫ్లోర్ - తమిళ సినిమాఆపిల్ టీవీ ప్లస్వండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాఅమరావతికి ఆహ్వానం - తెలుగు సినిమామనోరమ మ్యాక్స్రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ - మలయాళ మూవీసోనీ లివ్ద జాజ్ సిటీ - తెలుగు సిరీస్(ఇదీ చదవండి: పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి) -
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా
తెలుగు, తమిళ, కన్నడలో చాలా సినిమాలు చేసిన నటుడు అర్జున్ సర్జా.. ప్రస్తుతం వేగం తగ్గించేశాడు. కొన్నాళ్ల క్రితం కూతురు ఐశ్వర్యని హీరోయిన్గా పెట్టి ఓ మూవీ మొదలుపెట్టాడు. తెలుగు హీరో విశ్వక్ సేన్‌ని హీరోగా తీసుకున్నాడు. అనుకోని కారణాలతో విశ్వక్.. ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. తర్వాత మరో హీరోతో చిత్రాన్ని పూర్తి చేశారు. గత నెలలోనే థియేటర్లలోకి కూడా తీసుకొచ్చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'సీతా పయనం'. ఇతడి కుమార్తె ఐశ్వర్య హీరోయిన్. కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్.. ఈ చిత్రంలో హీరో. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఉగాది కానుకగా ఈ గురువారం (మార్చి 19) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.'సీతా పయనం' విషయానికొస్తే.. సీత (ఐశ్వర్య)చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. దీంతో తండ్రి(సత్యరాజ్)లోనే తల్లిని చూసుకుంటూ ఉంటుంది. తాను లేకపోతే తండ్రి ఏమైపోతడోనని పెళ్లి కూడా చేసుకోదు. ఓసారి ఒంటరిగా కారులో హైదరాబాద్‌కి ప్రయాణమవుతుంది. దారి మధ్యలో అభి(నిరంజన్) లిఫ్ట్ అడిగితే.. కండీషన్స్ పెట్టి ఊరి దగ్గర దించేస్తుంది. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఎవరెవరు ఎదురయ్యారు? సీత.. మళ్లీ అభిని ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈ ప్రయాణం సీత జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా) -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్‌లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్ బాక్సాఫీస్‌ను షేర్ చేయగా సీక్వెల్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్లో మాత్రమే కాస్తా బజ్ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20ది రైజ్ ఆఫ్ ది రెడ్‌హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20 ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20అమెజాన్ ప్రైమ్..ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18ది హౌస్‌మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20 అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్): మార్చి 20జీ5..ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19కాసర్గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20జియో హాట్‌స్టార్..చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20యాపిల్ టీవీ..ఇమ్పర్ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18సోనీ లివ్..జజ్ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19సన్ నెక్ట్స్..సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20 -
అర్జున్ సర్జా కూతురి మొదటి సినిమా.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
అర్జున్ సర్జా దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీతా పయనం. ఈ చిత్రంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా నటించారు. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.8.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. కేవలం మౌత్ టాక్‌తో ఈ సినిమాకి కలెక్షన్స్ పెరగడం విశేషం. త వారం విడుదలైన చిత్రాల పరంగా చూస్తే సీతా పయనం టాప్‌లో కొనసాగుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో తెరకెక్కించారు. ఈ మూవీలో అర్జున్, ధృవ్ సర్జాలు సైతం స్పెషల్ కేమియో రోల్స్‌లో మెప్పించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. -
సీతా పయనం చిత్ర బృందంతో జగపతి బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ
-
‘సీతా పయనం’ మూవీ రివ్యూ
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటించిన తొలి సినిమా ‘సీతా పయనం’. ముందుగా ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ అనుకున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో కూడా విశ్వక్ పాల్గొన్నాడు. కానీ షూటింగ్‌కి కొద్ది రోజుల ముందు ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతొ విశ్వక్ ప్లేస్‌లో కన్నడ స్టార్ ఉపేంద్ర సోదరుడి కొడుకు నిరంజన్‌ని హీరోగా పెట్టి ఈ సినిమా తెరకెక్కించాడు అర్జున్. కూతురు డెబ్యూ ఫిల్మ్ అవ్వడంతో ప్రమోషన్స్ భారీగా చేశాడు.మొత్తానికి రిలీజ్‌కి ముందే సీతా పయనంపై హైప్ అయితే క్రియేట్ అయ్యేలా చేశారు. మంచి అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వైజాగ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్(సత్య రాజ్)కి కూతురు సీత(ఐశ్వర్య అర్జున్) అంటే ప్రాణం. తల్లి లేకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. కూతురికి పెళ్లి చేస్తే తన బాధ్యత తీరుతుందని భావిస్తాడు. కానీ సీతకు మాత్రం పెళ్లి అంటే నచ్చదు. పెళ్లి టాపిక్ తీసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఓ రోజు వర్క్ షాప్ కోసం వైజాగ్ నుంచి తన కారులో హైదరాబాద్‌కి బయలు దేరుతుంది. మార్గ మధ్యలో అభి(నిరంజన్) పరిచయం అవుతాడు. తనతో కలిసి చేసే ప్రయాణంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవేంటి? ఆ సంఘటనల వల్ల సీతలో వచ్చిన మార్పు ఏంటి? సీత ప్రయాణంలో గిరి(అర్జున్), బసవన్న(ధృవ్ సర్జా) ఎలా భాగమయ్యారు? పెళ్లే వద్దనుకున్న సీత..చివరకు అభితో ప్రేమలో ఎలా పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సీతా పయనం కొత్త కథేమీ కాదు. మనం ఇంత వరకు ఎన్నో సార్లు, ఎన్నో సినిమాల్లో చూసిన విషయాలతోనే అర్జున్ ఈ మూవీని తెరకెక్కించాడు. ప్రస్తుత తరం మరిచిపోతోన్న విలువల్నిఈ కథ ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. మన హైందర ధర్మంలో పెళ్లికి ఉన్న గొప్పదనం చర్చిస్తూనే.. . తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలి.. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత సంస్కారంతో పెద్ద చేయాలి.. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి అనే విషయాలను గొప్పగా చూపించారు. వీటితో పాటు గో రక్షణ గురించి ఓ ఎపిసోడ్‌ని యాడ్ చేశారు. ఈ సినిమాలో ఉన్న మరో గొప్పదనం ఏంటంటే.. ఇందులో అందరూ మంచి వాళ్లే. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒకటి, రెండు పాత్రలు కూడా ఒక్క సీన్‌తో మంచి వాళ్లు అయిపోతాయి. ఇదంతా చెప్పుకోవాడానికి బాగానే ఉన్నా.. తెరపై చూస్తుంటే మాత్రం అంత రక్తి కట్టించదు. ఎలాంటి మలుపులు, ట్విస్టులు లేకుండా ‘సీతా పయనం’ చాలా సాఫీగా సా..గుతుంది. ఇచ్చిన సందేశం మంచిదే కానీ.. కూర్చొబెట్టి హితబోధ చేసినట్లుగా అనిపిస్తుంది.తండ్రి కూతురు బాండింగ్‌ని చూపిస్తూ కథ ప్రారంభించాడు దర్శకుడు. కూతురుకి పెళ్లి చేయాలని తండ్రి.. పెళ్లి టాపిక్ వస్తేనే ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేసే కూతురు..మొదటి పది నిమిషాల కథంతా ఇలానే రొటీన్‌గా ఉంటుంది. ఇక సీత వర్క్ షాప్ కోసం హైదరాబాద్‌కి బయలుదేరినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. మార్గ మధ్యలో అభి పరిచయం అవ్వడం.. గిరి పాత్ర ఎంట్రీ.. ఆ తర్వాత కొన్ని సంఘటనలు ఇవన్నీ మొదట రొటీన్‌గానే అనిపించినా.. ఇంటర్వెల్ తర్వాత ఆయా సన్నివేశాల వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. ఫస్టాఫ్ మొత్తం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి సీత ప్రయాణం ఉంటే.. సెకండాఫ్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ధృవ్ సర్జా ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ భావోద్వేగానికి గురి చేస్తుంది. కొత్తదనం ఆశించకుండా, ఫ్యామిలీతో కలిసి ఓపికతో ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకునేవారిని ‘సీతా పయనం’ ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే..సీత పాత్రలో ఐశ్వర్య ఒదిగిపోయింది. ఆమె ఆహార్యం, హావభావాలు, మాట తీరు అన్నీ కూడా ఆడియెన్స్‌ని ప్రేమలో పడేస్తాయి. ఆమెని చూస్తే ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. అయితే డబ్బింగ్ విషయం ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేదేమో. ఇక అభి పాత్రకు నిరంజన్ న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ఓ చిన్న ట్విస్ట్ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్లని కూడా బాగానే చేశాడు. ఇక హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ రెగ్యులర్ పాత్రను చేశాడు. హీరో తాతా, ఊరి పెద్దగా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇలాంటి పాత్ర ఆయన కొత్తేమి కాదు. బిత్తిరి సత్తి రెండు, మూడు చోట్ల కనిపించి, నవ్విస్తాడు. అర్జున్ సర్జా ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ధృవ్ సర్జా బ్లాక్, అక్కడ చెప్పిన సందేశం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మిగిలిన పాత్రధారులందరూ కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ నుంచి మంచి పాటల్ని, బీజీఎంని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, సెట్ వర్క్ బాగానే కుదిరింది. కూతురు కోసం నిర్మాతగా మారిన అర్జున్.. ఈ సినిమాకు బాగానే ఖర్చు చేశాడు. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. - రేటింగ్ : 2.75/5 -
Arjun Sarja: రోజుకో గంట మీ శరీరానికి ఇచ్చుకోండి లైఫ్‌లో ఫిట్‌గా ఉంటారు
-
రాజకీయాల్లోకి అర్జున్.. యాక్షన్ కింగ్ ఏమన్నారంటే..?
సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్‌తో సహా పలువురు హీరోలు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు. కొత్తగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కుడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో అర్జున్ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై అర్జున్ స్పందించారు. రాజకీయాలపై ఆసక్తి లేదని.. అంత జ్ఞానం కూడా తనకు లేదన్నాడు. (చదవండి: విశ్వక్ సేన్‌తో సినిమా తీస్తారా?.. అర్జున్ ఆన్సర్ ఇదే!)అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన అర్జున్.. ‘రాజకీయ ఎంట్రీ’పై స్పందింస్తూ... ‘నాకు మంచి పని చేయాలని ఉంది కానీ..దాని కోసం రాజకీయాల్లోకి రావాలని లేదు. నాకు అంత జ్ఞానం కూడా లేదు. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను. ఒకవైపు నటిస్తూనే..మరోవైపు కొన్ని కథలను రాసుకుంటున్నాను. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే నాకు లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. మంచి చేయాలనుకునేవాళ్లు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటారు. విజయ్ ఇప్పుడే వచ్చాడు. ఆయన పని తీరు ఎలా ఉంటుందో తెలియదు. అందరిలాగే తాను కూడా విజయ్ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు. -
విశ్వక్ సేన్‌తో సినిమా తీస్తారా?.. అర్జున్ ఆన్సర్ ఇదే!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా ‘సీతా పయనం’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిరంజన్ హీరోగా నటించిన ఈచిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా విశ్వక్ సేన్ నటించాల్సింది. పూజా కార్యక్రమాల్లో కూడా విశ్వక్ పాల్గొన్నాడు. కానీ షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో అర్జున్ మీడియా ముఖంగా విశ్వక్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విశ్వక్ సైతం వివరణ ఇచ్చుకున్నాడు. చివరకు నిరంజన్‌ని హీరోగా పెట్టుకొని ఈ సినిమాకు తెరకెక్కించాడు అర్జున్. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అర్జున్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విశ్వక్ వివాదంపై కూడా ఆయన స్పందించారు. విశ్వక్పై తనకు ఎలాంటి కోపం లేదని.. కొన్ని కారణాల వల్ల తప్పకున్నాడు. అంతమాత్రనా ఆయనపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ అవకాశం వస్తే కచ్చితంగా అతనితో సినిమా చేస్తా’ అని అర్జున్ అన్నారు. విశ్వక్ మారిన తర్వాత కథలో ఏవైనా మార్పులు చేశారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘నా సినిమాలో కథే హీరో. హీరో కోసం కథలో మార్పులు చేయలేదు. మొదట అనుకున్న కథతోనే ఈ సినిమాను తెరకెక్కించాను’ అని అర్జున్ అన్నారు. -
‘సీతా పయనం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఒకే ఒక్కడు మూవీ షూటింగ్.. నాకోసం పది నిమిషాల్లోనే..!
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ సినీ ప్రియులను ఆకట్టుకుంది.మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు అర్జున్, ఆయన కూతురు ఐశ్వర్య. తండ్రి, కూతురు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఐశ్వర్య అర్జున్. తాను చెన్నైలో స్కూల్లో చదివే సమయంలో కడుపునొప్పిగా ఉందని డాడీకి కాల్ చేశానని తెలిపింది. అప్పుడు నాన్న ఒకే ఒక్కడు సినిమా షూటింగ్లో ఉన్నారు. దాదాపు నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నేను చెప్పగానే నాకోసం హుటాహుటిన స్కూల్‌కు వచ్చేశారని ఐశ్వర్య అర్జున్ వెల్లడించారు. ఆ రోజు నేను చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చానని అర్జున్ సర్జా తెలిపారు. ఆ రోజు నా డ్రైవింగ్ చూసి చాలామంది తిట్టుకుని ఉంటారని అన్నారు. వీరిద్దరి బాండింగ్ చూస్తుంటే కూతురంటే అర్జున్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రలు పోషించారు. -
విశ్వక్ సేన్‌కు భవిష్యత్ ఉంది.. గొడవకు 'అర్జున్' ఫుల్స్టాప్
ప్రముఖ నటుడు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా 'సీతాపయనం'.. ఇదే మూవీతో తన కూతురు ఐశ్వర్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో నిరంజన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మొదట విశ్వక్ సేన్ హీరోగా ప్రకటించారు. కానీ, పలు విభేదాల కారణంగా అతను వాకౌట్ చేశాడు. అయితే, యాదృచ్చికంగా, విశ్వక్ చిత్రం ఫంకీతో పాటు 'సీతాపయనం' కూడా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదలవుతోంది. తాజాగా తమ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో విశ్వక్ సేన్ గురించి అర్జున్ పలు వ్యాఖ్యలు చేశారు.గతంలో విశ్వక్‌తో జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ అడిగిన ప్రశ్నకు అర్జున్ ఇలా సమాధానం ఇచ్చారు. మా సినిమా సీతాపయనంతో పాటు విశ్వక్ సేన్ మూవీ ఫంకీ కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అతనొక యువకుడు.. తనకు చాలా భవిష్యత్ ఉంది. ఏదో మనకు కుదరలేదని అతనిపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. వారి అమ్మగారి చేతి భోజనం తిన్నాను. వాళ్లు బాగుండాలని కోరుకుంటాను. కాలంతో పాటు కొన్ని మరిచిపోతూ సంతోషంగా ముందుకు సాగాలి. మా రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను అని అర్జున్ అన్నారు.విశ్వక్పై అర్జున్ చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ నుంచి అభినందనలు వస్తున్నాయి. పెద్దరికం ఎలా ఉంటుందో చూపించావ్ అంటూ అర్జున్ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అర్జున్ కూతురు హీరోయిన్గా విశ్వక్ సేన్‌తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే, షూటింగ్ కొంత జరిగిన తర్వాత పలు కారణాలతో విశ్వక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్, విశ్వక్ మధ్య మాటల గొడవ జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Crazziee Stuff (@crazziee_stuff) -
సీతా పయనం ట్రైలర్: లిఫ్ట్ అడిగితే ఓకే అన్నా..
‘అతను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను... ఇప్పుడు అతను నా పక్కనే కూర్చున్నాడు’ అనే డైలాగ్‌తో ‘సీతా పయనం’ మూవీ ట్రైలర్ ఆరంభం అయింది. హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు. సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా ఇతర పాత్రలుపోషించారు.శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్... ఇలా అన్ని రకాల అంశాలతో రూపొందిన చిత్రం ‘సీతా పయనం’. కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీ ఇది’’ అని మేకర్స్ తెలిపారు. -
హీరోయిన్గా అర్జున్ కూతురు.. ‘సీతా పయనం’ ఎప్పుడంటే..?
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పాజిటీవ్ బజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, ఫ్యామిలీస్ కు బాగా నచ్చే అనేక అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి, త్వరలో సీతా పయనం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చెయనున్నారు. -
ఆహా ఓహో..అస్సలు సినిమా ముందుంది అంటున్న ఐశ్వర్య!
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి ‘అస్సలు సినిమా ముందుంది’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు అనే పదాలతో మొదలైన ఈ సాంగ్ ఊపుతెప్పించే లిరిక్స్ తో ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీయ ఘోషల్ పాడారు. ఈ పాటలో ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ అవుతుండగా.. అనూప్ రూబెన్స్ బాణీలు అదుర్స్ అనేలా ఉన్నాయి. -
ఆ మూడు సినిమాలు తీసుంటే రిటైర్ అయ్యేవాడిని : సుకుమార్
‘‘ఈ వేదికపై ఇద్దరు (అర్జున్, ఉపేంద్ర) లెజెండ్స్ ఉన్నారు. ఈ ఇద్దరూ యాక్టర్స్ మాత్రమే కాదు.. దర్శకులు కూడా. ‘ఓం, ఏ, ఉపేంద్ర... ఇలాంటి కల్ట్ సినిమాలు తీసిన తర్వాత ఏ దర్శకుడైనా రిటైర్ అయిపోవచ్చు. నేను ఆ మూడు చిత్రాలు తీసి ఉంటే రిటైర్ అయిపోయేవాడిని. ఈ రోజు నా స్క్రీన్‌ప్లే ఇలా ఉందంటే కారణం ఆ మూడు సినిమాలే’’ అని అన్నారు దర్శకుడు సుకుమార్.హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ ప్రధాన పాత్రలో, అర్జున్, ధ్రువ సర్జా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ టీజర్లో ఐశ్వర్య, నిరంజన్ బ్యూటిఫుల్‌గా కనిపించారు. అలాగే ఈ చిత్రంలో చంద్రబోస్ గారు రాసిన ఓ పాట విన్నాను. చాలా నచ్చింది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.‘‘నేను కాలేజీలో చదివిన రోజుల్లోనే అర్జున్ గారు నాకు డైలాగ్ రైటర్‌గా అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు అవకాశం కల్పించిన అర్జున్‌గారు, ఇప్పుడు నా అన్న కొడుకుకి అవకాశం ఇచ్చారు. ‘సీతాపయనం’ టీజర్ బ్యూటిఫుల్‌గా ఉంది’’ అన్నారు మరో ముఖ్య అతిథి ఉపేంద్ర. ‘‘నా హనుమాన్ జంక్షన్’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన సుకుమార్ ఇప్పుడు ఇండియాలోని టాప్ టెన్ దర్శకుల్లో ఒకరని చెప్పడం గర్వంగా ఉంది. ఉపేంద్రగారికి పెద్ద పెద్ద దర్శకులే అభిమానులుగా ఉంటారు. మా అమ్మాయి కోసం ఈ సినిమాను మొదలుపెట్టాను. నాపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమను మా అమ్మాయిపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నాను. నిరంజన్‌లో మంచి అంకితభావం ఉంది’’ అన్నారు. ‘‘సీతా పయనం’తో తెలుగు పరిశ్రమకు వస్తున్నందుకు, నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యా అర్జున్. ‘‘తెలుగులో నాకిది తొలి సినిమా’’ అన్నారు నిరంజన్.


