ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా | Seetha Payanam Movie OTT Streaming Update | Sakshi
Sakshi News home page

OTT: నటుడే దర్శకుడు.. కూతురే హీరోయిన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mar 17 2026 8:22 PM | Updated on Mar 17 2026 8:30 PM

Seetha Payanam Movie OTT Streaming Update

తెలుగు, తమిళ, కన్నడలో చాలా సినిమాలు చేసిన నటుడు అర్జున్ సర్జా.. ప్రస్తుతం వేగం తగ్గించేశాడు. కొన్నాళ్ల క్రితం కూతురు ఐశ్వర్యని హీరోయిన్‌గా పెట్టి ఓ మూవీ మొదలుపెట్టాడు. తెలుగు హీరో విశ్వక్ సేన్‌ని హీరోగా తీసుకున్నాడు. అనుకోని కారణాలతో విశ్వక్.. ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. తర్వాత మరో హీరోతో చిత్రాన్ని పూర్తి చేశారు. గత నెలలోనే థియేటర్లలోకి కూడా తీసుకొచ్చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)

నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'సీతా పయనం'. ఇతడి కుమార్తె ఐశ్వర్య హీరోయిన్. కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్.. ఈ చిత్రంలో హీరో. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఉగాది కానుకగా ఈ గురువారం (మార్చి 19) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

'సీతా పయనం' విషయానికొస్తే.. సీత (ఐశ్వర్య)చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. దీంతో తండ్రి(సత్యరాజ్)లోనే తల్లిని చూసుకుంటూ ఉంటుంది. తాను లేకపోతే తండ్రి ఏమైపోతడోనని పెళ్లి కూడా చేసుకోదు. ఓసారి ఒంటరిగా కారులో హైదరాబాద్‌కి ప్రయాణమవుతుంది. దారి మధ్యలో అభి(నిరంజన్) లిఫ్ట్ అడిగితే.. కండీషన్స్ పెట్టి ఊరి దగ్గర దించేస్తుంది. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఎవరెవరు ఎదురయ్యారు? సీత.. మళ్లీ అభిని ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈ ప్రయాణం సీత జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement