నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్ | AIADMK MP CV Shanmugam Comments Actress Nayanthara | Sakshi
Sakshi News home page

Nayanthara: మొన్న త్రిష.. ఇప్పుడు నయనతార!

Mar 17 2026 4:55 PM | Updated on Mar 17 2026 5:35 PM

AIADMK MP CV Shanmugam Comments Actress Nayanthara

తమిళనాడులో ఎన్నికల సంగతేమో గానీ పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు.. స్టార్ హీరోయిన్లని అవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం నైనర్ నాగేంద్రన్ అనే నాయకుడు.. విజయ్‌ని విమర్శిస్తూ, ముందు నువ్వు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని అనేశాడు. తర్వాత త్రిష సీరియస్ కావడంతో సదరు నాయకుడు క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ.. నయనతారని ఉద్దేశిస్తూ చీప్ కామెంట్స్ చేశారు.

(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. హరీశ్ శంకర్ ఆశ పెద్దదే!)

మహిళల భద్రత, గౌరవం కోసం అన్నాడీఎంకే(AIADMK) పార్టీ.. మంగళవారం చెన్నైలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులోనే ఆ పార్టీకి చెందిన ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు అంతటా పెను దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్ నయనతారని ఉద్దేశిస్తూ అసభ్యకర రీతిలో మాట్లాడేసరికి విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.

అసలు విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రజలని ఉద్దేశిస్తూ మాట్లాడారు. తమ కలలని పంచుకోవాలని, వాటిని ప్రభుత్వం నెరవేర్చేందుకు కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. వీటి గురించి మాట్లాడిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం, నయనతార పేర్లని ప్రస్తావిస్తూ అసభ్యకర కామెంట్స్ చేశారు.

'అబ్దుల్ కలాం గారు మనల్ని కలలు కనమన్నారు. స్టాలిన్ కూడా తనతో కలలు పంచుకోమంటున్నారు. ఒకవేళ నాకు నయనతార కావాలని కల వస్తే.. నా కోరికని స్టాలిన్ తీరుస్తారా? ఎవరైనా వెళ్లి నయనతారతో తమకు పెళ్లి చేయమని అడిగితే.. ఆ కల కూడా నెరవేరుస్తారా?' అని ఎంపీ అన్నారు. అయితే ఈయన ఇలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే నిలుచుని ఉన్న పార్టీ నేతలు.. వారించాల్సింది పోయి, నవ్వుతుండేసరికి విమర్శలు గట్టిగా వస్తున్నాయి. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్‌ ఇచ్చిన త్రిష తల్లి!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement