త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్‌ ఇచ్చిన త్రిష తల్లి! | Thalapathy Vijay and Trisha Krishnan To marry soon, Actress mother Hints | Sakshi
Sakshi News home page

త్వరలోనే విజయ్‌, త్రిషల పెళ్లి.. ఇలా హింట్‌ ఇచ్చేశారు!

Mar 17 2026 1:47 PM | Updated on Mar 17 2026 2:17 PM

Thalapathy Vijay and Trisha Krishnan To marry soon, Actress mother Hints

టీవీకే పార్టీని స్థాపించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్‌కి ఆయన సతీమణి సంగీత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విజయ్‌తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం..  ఒక నటితో ఆయన సహజీవనం చేస్తున్నాడని ఆరోపించడంతో త్రిష పేరు బయటకు వచ్చింది. విజయ్‌ సహజీవనం చేస్తున్నది త్రిషతోనే అని తమిళ మీడియా కోడై కూసింది. అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్‌ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు.

 అప్పటి నుంచి విజయ్‌, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా పుకార్లే అని అంతా భావిస్తున్న తరుణంలో త్రిష తల్లి చేసిన ఓ పని.. మరోసారి వీరిద్దరి పెళ్లిపై చర్చకు దారి తీసింది.

అలా హింట్‌ ఇచ్చిందా?
త్రిష,విజయ్‌ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైనప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై నెట్టింట రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అయితే ఏఐని ఉపయోగించి పెళ్లి వీడియో క్రియేట్‌ చేసి..సోషల్‌ మీడియాలో వదిలారు. ఆ వీడియోలు బాగా వైరల్‌ అయ్యాయి. అలా విజయ్‌ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీతో విజయ్‌, త్రిషల పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరైనట్లు వీడియో క్రియేట్‌ చేశాడు. అది నెట్టింట తెగ వైరల్‌ అయింది. ఆ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్‌  లైక్‌ కొట్టారు. దీంతో విజయ్‌తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ..ఆమె లైక్‌ కొట్టిన పోస్ట్‌ని వైరల్‌ చేస్తున్నారు. 

ఎన్నికల తర్వాత పెళ్లి
విజయ్‌ ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా తమిళనాడు ఎన్నికలపైనే పెట్టాడు. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నా.. ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై ఇరు కుటుంబాలలో చర్చలు కూడా జరిగాయట. ఇక సంగీత విషయానికొస్తే.. ఓ అభిమానిగా పరిచయం అయితే ఈమెను.. విజయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో వీరిద్ద వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా విజయ్‌, సంగీత వేరు వేరుగా ఉంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement