'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా | Dhurandhar The Revenge Movie Runtime Difference India And Overseas | Sakshi
Sakshi News home page

Dhurandhar The Revenge: 'ధురంధర్ 2' హైప్.. రెండుచోట్ల వేర్వేరుగా

Mar 17 2026 5:43 PM | Updated on Mar 17 2026 5:48 PM

Dhurandhar The Revenge Movie Runtime Difference India And Overseas

లెక్క ప్రకారం ఈ నెలలో చాలానే పాన్ ఇండియా సినిమాలు రావాలి. కానీ చాలావరకు అవన్నీ వాయిదా పడటంతో చివరకు 'ధురంధర్ 2' మాత్రమే రేసులో మిగిలింది. ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దేశమంతటా దీనిపై హైప్ బీభత్సంగా ఉంది. ప్రీమియర్, రెగ్యులర్ షోల టికెట్స్ వేగంగా బుక్ అయిపోతున్నాయి. అయితే ఓ విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: బ్యాడ్‌ సెంటిమెంట్‌.. టెన్షన్‌లో పవన్‌ ఫ్యాన్స్‌!)

గతేడాది డిసెంబరులో అంటే మూడు నెలల క్రితం 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు ఏ మాత్రం హైప్ లేదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో మౌత్ టాక్ వల్ల పాన్ ఇండియా లెవల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఈ మూవీ చివరలో చెప్పినట్లుగానే మార్చి 19నే ఇప్పుడు సీక్వెల్ విడుదల చేస్తున్నారు. తొలి భాగం దాదాపు మూడున్నర గంటల నిడివి కాగా.. ఇప్పుడు మరింత నిడివితో సీక్వెల్ రాబోతుంది.

'ధురంధర్: ద రివేంజ్' నిడివి మన దేశంలో మూడు గంటల 49 నిమిషాలు కాగా.. ఓవర్సీస్‌లో మాత్రం 3 గంటల 55 నిమిషాలు. అంటే మన కంటే విదేశీ ప్రేక్షకులు ఆరు నిమిషాల పాటు అదనంగా ఉండే ఫుటేజ్  చూడనున్నారనమాట. రిలీజ్ 19నే ‍అయినప్పటికీ ముందురోజు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ప్రీమియర్ల బుకింగ్స్ టాప్ రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక విడుదలకు ముందే రూ.130 కోట్లకు పైగా ప్రీ సేల్స్‌తో అదరగొట్టిన 'ధురంధర్ 2'.. తెలుగు, తమిళం లాంటి దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీంతో ఈసారి ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయోనని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దీనితో పాటు విడుదలవుతున్న తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 2 గంటల 34 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వస్తోంది. మరి 'ధురంధర్ 2' పోటీ తట్టుకుని పవన్ మూవీ నిలబడుతుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)

Advertisement
 
Advertisement
Advertisement