వెంటాడుతున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌.. టెన్షన్‌లో పవన్‌ ఫ్యాన్స్‌! | Ustad Bhagat Singh Release: Pawan Kalyan Fans Tension About Bad Sentiment | Sakshi
Sakshi News home page

‘ఉస్తాద్’ రిలీజ్‌.. పవన్‌ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌!

Mar 17 2026 5:28 PM | Updated on Mar 17 2026 6:06 PM

Ustad Bhagat Singh Release: Pawan Kalyan Fans Tension About Bad Sentiment

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే.  సినిమా అనౌన్స్‌మెంట్‌ మొదలు రిలీజ్‌ వరకు అన్నింట్లోనూ సెంటిమెంట్‌ ఫాలో అవుతుంటారు. ఇక హీరో-డైరెక్టర్‌, హీరో, హీరోయిన్ల కాంబినేషన్‌ విషయంలోనూ సెంటిమెంట్‌ చూస్తుంటారు. ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్‌కి ఎవరినైనా గెస్ట్‌గా పిలవాలంటే.. దానికి కూడా ఓ సెంటిమెంట్‌ ఉంది. ఫలానా హీరో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వస్తే సినిమా హిట్‌ అవుతుందని నమ్మే దర్శకనిర్మాతలు చాలానే ఉన్నారు. ఇదంతా పాజిటివ్‌ సెంటిమెంట్‌. ఇదే ఇండస్త్రీలో నెగెటివ్‌ సెంటిమెంట్‌ కూడా ఉంది. పలాన హీరో.. పలానా దర్శకుడితో సినిమా తీస్తే ఫ్లాప్‌ గ్యారెంటీ.. ఆ ఇద్దరు స్టార్స్‌ రెండోసారి కలిస్తే.. అపజయం తప్పదు అనే నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా అభిమానులు ఎక్కువగా ఈ నెగెటివ్‌ సెంటిమెంట్లను నమ్ముతుంటారు. కొన్ని సందర్భాలలో వారి నమ్మకం నిజం అవుతుంటాయి కూడా. ఇప్పుడు ఇలాంటి ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులను టెన్షన్‌ పెడుతుంది. అదేంటో చదివేయండి..

రెండోసారి ఫ్లాప్‌
పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ఒక డైరెక్టర్‌తో రెండో సినిమా తీస్తే ప్లాప్‌ గ్యారెంటీ. ఒక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మినహా..ఆయన కెరీర్‌ మొత్తంలో రెండోసారి సినిమా చేసిన దర్శకులందరికీ అపజయమే ఎదురైంది. పవన్‌ కల్యాణ్‌కి ‘తొలిప్రేమ’తో తొలి హిట్‌ అందించిన దర్శకుడు కరుణాకరన్‌. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బాలు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. అలాగే ‘సుస్వాగతం’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పవన్‌, దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘అన్నవరం’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

పవన్‌-పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘బద్రి’ సూపర్ హిట్‌ అయితే.. రెండో చిత్రం ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ డిజాస్టర్‌ అయింది. ‘ఖుషీ’ తర్వాత ఎస్‌ జే సూర్య దర్శకత్వంలో నటించిన ‘కొమరం పులి’ సినిమా  కూడా ప్లాప్‌ అయింది. కిషోర్ పార్ధసాని (డాలీ), పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘గోపాల గోపాల’ ఓ మోస్తరు విజయం సాధిస్తే.. ‘కాటమ రాయుడు’ డిజాస్టర్‌గా నిలిచింది.  

త్రివిక్రమ్‌ ఒక్కడే.. 
పవన్‌తో రెండోసారి సినిమా తీసిన దర్శకులంతా అపజయాలనే అందించారు. ఒక త్రివిక్రమ్‌ మాత్రం వరుసగా రెండు హిట్లు(జల్సా, అత్తారింటికి దారేది) ఇచ్చాడు. ఇదే  జోష్‌లో ముచ్చటగా మూడో సినిమాగా ‘అజ్ఞాతవాసి’ తీస్తే..అది అతిపెద్ద డిజాస్టర్‌ అయింది.

ఉస్తాద్‌ రిలీజ్‌..టెన్షన్‌లో ఫ్యాన్స్‌
ఇప్పుడు ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ చూసే పవన్‌ అభిమానులు భయపడుతున్నారు. హరీశ్‌ శంకర్‌- పవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌(Ustad Bhagat Singh). అంతకు ముందు వీరిద్దరి  కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’బ్లాక్‌ బస్టర్‌ అయింది. సెంటిమెంట్‌ ప్రకారం చూస్తే.. మార్చి 19న రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రం ఫ్లాప్‌ కావాలి. ఇప్పుడు అదే అభిమానులను కలవర పెడుతుంది. 

ఇప్పటీకీ ఈ సినిమాపై పెద్దగా బజ్‌ లేదు. ఈ చిత్రానికి పోటీగా వస్తున్న ‘ధురంధర్‌ 2’ బుకింగ్స్‌  విషయంలో దూసుకెళ్తుంది. ట్రైలర్‌ కూడా అదిరిపోయింది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడం.. బ్యాడ్‌ సెంటిమెంట్‌ కూడా ఉండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. మరి సెంటిమెంట్‌ ప్రకారం సినిమా ప్లాప్‌ అవుతుందా  లేదా సెంటిమెంట్‌ని బద్దలు కొట్టి హిట్‌ అవుతుందా అనేది రెండు రోజుల్లో తేలిపోతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement