ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్..! | This week Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

This week Ott Releases: ఈ వారం ఓటీటీల్లో 17 మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..!

Mar 16 2026 3:00 PM | Updated on Mar 16 2026 3:47 PM

This week Ott Release Movies List Goes Viral

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్‌లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్‌ బాక్సాఫీస్‌ను షేర్ చేయగా సీక్వెల్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్‌లో మాత్రమే కాస్తా బజ్‌ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.

ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్‌ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్..

  • రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18

  • ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18

  • పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20

  • బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20

  • ది రైజ్ ఆఫ్ ది రెడ్‌హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20

  •    ఏ డిఫరెంట్‌ మ్యాన్‌ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20

    అమెజాన్ ప్రైమ్..
  • ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18

  • ది హౌస్‌మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19

  • డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20

  •    అమోర్‌ యానిమల్‌ (వెబ్ సిరీస్‌): మార్చి 20

జీ5..

  • ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19

  • కాసర్‌గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20

  • జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20


జియో హాట్‌స్టార్..

  • చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20

యాపిల్ టీవీ..

  • ఇమ్‌పర్‌ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18

సోనీ లివ్..

  • జజ్‌ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19

సన్‌ నెక్ట్స్..

  • సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement