Border 2 Movie
-
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2' హవా కొనసాగుతోంది. దీని దెబ్బకు పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని అభిమానులు తప్పితే మరెవరు పట్టించుకోవట్లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ చూసేందుకు ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. వీటిలో తెలుగు, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విష్ణు విన్యాసం, అమరావతికి ఆహ్వానం, బోర్డర్ 2, సీతా పయనం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు-వెబ్ సిరీస్‌లు (మార్చి 20)అమెజాన్ ప్రైమ్విష్ణు విన్యాసం - తెలుగు సినిమాడెడ్లోచ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్లగ్నచ షాట్ - మరాఠీ సినిమా (రెంట్)లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ డెన్మార్క్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఆంఖోంఖి గుస్తాకియాన్ - హిందీ మూవీమై లార్డ్ - తమిళ సినిమాద హౌస్ మెయిడ్ - ఇంగ్లీష్ మూవీఅమోర్ యానిమల్ సీజన్ 1 - స్పానిష్ సిరీస్కంపెనీ రిట్రీట్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్వైల్డ్ క్యాట్ - ఇంగ్లీష్ సినిమాస్ట్రే కిడ్స్ - ఇంగ్లీష్ కన్సర్ట్ మూవీనెట్ఫ్లిక్స్బోర్డర్ 2 - హిందీ సినిమాపీకీ బ్లండర్స్: ద ఇమ్మొర్టల్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీద రైజ్ ఆఫ్ ద రెడ్ హాట్ చిల్లీ పెప్పర్స్ - ఇంగ్లీష్ సినిమాఏ డిఫరెంట్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీహాట్స్టార్చిరైయా - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5కాసర్గోడ్ ఎంబసీ సీజన్ 1 - మలయాళ సిరీస్ల్యాండ్ లార్డ్ - కన్నడఅగ అగ సునాబై! కాయ్ మహంతాయ్ ససుబాయ్ - మరాఠీ సినిమాసన్ నెక్స్ట్వలవార - కన్నడ చిత్రంసీతాపయనం - తెలుగు మూవీఫోర్త్ ఫ్లోర్ - తమిళ సినిమాఆపిల్ టీవీ ప్లస్వండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాఅమరావతికి ఆహ్వానం - తెలుగు సినిమామనోరమ మ్యాక్స్రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ - మలయాళ మూవీసోనీ లివ్ద జాజ్ సిటీ - తెలుగు సిరీస్(ఇదీ చదవండి: పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి) -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్‌లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్ బాక్సాఫీస్‌ను షేర్ చేయగా సీక్వెల్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్లో మాత్రమే కాస్తా బజ్ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20ది రైజ్ ఆఫ్ ది రెడ్‌హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20 ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20అమెజాన్ ప్రైమ్..ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18ది హౌస్‌మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20 అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్): మార్చి 20జీ5..ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19కాసర్గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20జియో హాట్‌స్టార్..చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20యాపిల్ టీవీ..ఇమ్పర్ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18సోనీ లివ్..జజ్ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19సన్ నెక్ట్స్..సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20 -
ఓటీటీలో బోర్డర్-2 సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
బాలీవుడ్ హిట్ ప్రాంఛైజీ చిత్రం బోర్డర్-2 ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలోకి వచ్చింది. 1997లో రిలీజై భారీ హిట్ అందుకున్న బోర్డర్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. 1971 ఇండో-పాక్ యుద్ధం తీవ్రతను, భారత సాయుధ దళాల వీరత్వాన్ని ఈ సినిమా చూపిస్తుంది. అందరిలో దేశభక్తిని రగిల్చేలా ఈ చిత్రం ఉంటుంది.బోర్డర్ 2(Border 2) మూవీ మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే, హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సుమారు రూ. 275 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 485 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. బోర్డర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ మరో చిత్రాన్ని కూడా మేకర్స్ ప్రకటించారు.పార్ట్-1 మాదిరే ‘బోర్డర్ 2’ కూడా దేశభక్తిని పెంచేలా ఉంటుంది. భారత్‌ను దొంగదెబ్బ కొట్టేందుకు పాకిస్థాన్ 1971లో ఎలాంటి కుట్రలు చేసిందో ఈ చిత్రంలో చూడొచ్చు. భారత్‌పై భూ, జల, వాయు మార్గాల ద్వారా కశ్మీర్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల ద్వారా భారీ దాడులకు దిగుతుంది. అయితే, భారత ప్రభుత్వం దీనిని ముందే గ్రహించి సైనికులను యుద్ధ రంగంలోకి దింపుతుంది. పాక్ సైన్యాన్ని ఎలా మట్టికరిపించారో ఇందులో చూపించారు. -
అప్పటివరకు నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి నటించిన తాజా చిత్రం "బోర్డర్ 2". అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఇంతటి ఘన విజయం అందుకున్న ఈ సినిమాను ఇంతవరకు చూడలేదంటున్నాడు సునీల్ శెట్టి.మాట మీదే ఉన్నా..రూ.500 కోట్ల క్లబ్లో చేరిన తర్వాతే బోర్డర్ 2 చూస్తానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ఇది దేశభక్తి సినిమా.. కచ్చితంగా ఇది రూ.500 కోట్లు దాటాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. రూ.500 కోట్ల క్లబ్లో చేరేవరకు నేను వేచి చూస్తానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇప్పుడీ సినిమా రూ.489 కోట్ల కలెక్షన్స్ వరకు చేరుకుంది. మరో రూ.11 కోట్లు వస్తే నేను అనుకున్న నెంబర్ దాటేస్తుంది. సినిమాఅప్పుడే ఈ మూవీ చూస్తాను. చాలాసార్లు సినిమా చూడాలనుకున్నాను, థియేటర్ వరకు వెళ్లాను. అహాన్ ఇంట్లో ప్రాక్టీస్ చేసిన డైలాగులను థియేటర్లో చెవులారా వినాలనుకున్నాను. కానీ నన్ను నేను తమాయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 1997లో వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్‌గా బోర్డర్ 2 తెరకెక్కింది. ఇందులో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, మోనా సింగ్, సోనమ్ బజ్వా, అన్య సింగ్, ప్రణవ్ వశిష్ట్, మేధ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు.చదవండి: ప్రేయసికి బ్రేకప్ చెప్పలేదని హీరోని మార్చేశారా? -
దేశభక్తి టచ్ చేస్తే చాలు.. కాసుల పంట పండాల్సిందే!
బాలీవుడ్ ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 'నేషనలిజం' ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వెండితెరపై త్రివర్ణ పతాకం కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. 'ఉరి', 'గదర్ 2' నుంచి మొదలైన ఈ ఊపు, ఇప్పుడు 'ధురంధర్', 'బోర్డర్ 2' వరకు కొనసాగుతోంది. సామాన్యుడిలో ఉండే దేశభక్తిని భావోద్వేగంతో కలిపి వెండితెరపై చూపించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన దేశభక్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే రూ.450 కోట్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. చారిత్రక వీరగాథలకు దేశభక్తి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది.రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక స్పై థ్రిల్లర్‌గా వచ్చి, దేశభక్తిని అద్భుతంగా పండించిన ఈ చిత్రం కేవలం ఏడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,285 కోట్లకు పైగా వసూలు చేసి 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలిచింది.ఇక గతవారం (జనవరి 23) రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' ప్రస్తుతం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. 1971 ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల మార్కును చేరుకుంది. నిన్న ఒక్క రోజులోనే ఇండియాలో ఈ చిత్రం రూ.59 కోట్లు రాబట్టిందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇలానే కొనసాగితే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. .సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. 1971 ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో జేపీ దత్తా తెరకెక్కించిన బోర్డర్(1997) చిత్రానికి సీక్వెల్ ఇది. -
‘బోర్డర్ 2’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. ‘ధురంధర్’ కంటే ఎక్కువే!
బాలీవుడ్ నుంచి వచ్చిన మరో దేశభక్తి చిత్రం బోర్డర్ 2. 1997లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘బోర్డర్’చిత్రానికి సీక్వెల్ ఇది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య నిన్న (జనవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలిరోజే సూపర్ హిట్ సంపాదించుకుంది. ఫలితంగా మొదటి రోజు భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30 కోట్ల(నెట్) వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. కలెక్షన్స్ పరంగా చూస్తే.. తొలి రోజే ఈ చిత్రం ‘ధురంధర్’ని బీట్ చేసింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ చిత్రానికి తొలి రోజు రూ. 28 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక దేశ వ్యాప్తంగా దురంధర్ తొలిరోజు 6,146 షోస్ పడితే.. బోర్డర్ 2కి 6000 మాత్రమే పడ్డాయి. అయినా కూడా కలెక్షన్స్ పరంగా బోర్డర్ 2 చిత్రమే టాప్‌లో ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
‘బోర్డర్ 2’ సినిమాపై అఫ్గాన్ క్రికెటర్ ఆసక్తికర పోస్ట్
సన్నీ డియోల్ హీరోగా నటించిన బోర్డర్ 2 చిత్రం ఈ నెల 23న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం డియోల్ ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్డర్ 2పై అప్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్(Rashid Khan) ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. దుబాయ్‌లో హైవే పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న వీడియో ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘బోర్డర్ 2 సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా.ఇప్పుడు నేను ఈ రీల్ పోస్ట్ చేస్తున్నా కదా.. చూద్దాం ఏమవుతుందో చూద్దాం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బోర్డర్ 2లోని పాట ప్లే చేయడం గమనార్హం. రషీద్ పోస్ట్‌పై బాలీవుడ్ ప్రముఖులు సరదాగా స్పందించారు. ‘హా భాయ్’ అని వరుణ్ ధావన్ కామెంట్ పెట్టగా.. ‘అదే మార్గం’( ఆ హైవే నుంచే సినిమాకు రావాలి అనే అర్థం వచ్చేలా..) సునీల్ శెట్టి కామెంట్ చేశాడు.బోర్డర్ 2 విషయానికొస్తే.. 1997లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'బోర్డర్'కి సీక్వెల్ ఇది. జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. సన్నీ డియోల్ తో పాటు వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి వంటి ప్రముఖులు నటించారు. మన దేశంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ సోమవారం ప్రారంభం అయ్యింది. విదేశాల్లో ఆదివారం సాయంత్రం ప్రారంభం అయ్యింది. అయితే పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఈ సినిమా కథ ఉందంటూ.. కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి గల్ఫ్ దేశాలు బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Rashid Khan (@rashid.khan19) -
'బోర్డర్-2' .. సైనికులకు సెల్యూట్ చేసేలా సాంగ్
సన్నీ డియోల్, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్న చిత్రం బోర్డర్-2.. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 1997లో వచ్చిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని నిర్మించారు. తొలి పార్ట్‌ను జె.పి. దత్తా తెరకెక్కించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ రూపొందించారు. ‘విజయ్ దివస్’ని పురస్కరించుకుని విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.తాజాగా విడుదలైన సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 1997 నాటి బోర్డర్ మూవీలోని ఐకానిక్ సాంగ్ 'సందేశే ఆతే హై'ని రీమేక్ చేశారు. ఆధునిక హంగులతో చాలా చక్కగా రీమేక్ చేశారంటూ ఈ పాటను నెటిజన్లు ప్రశంసించారు. కానీ, వరుణ్ ధావన్ పాత్ర పెద్దగా కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. భారత్- పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. -
'బోర్డర్ 2' సినిమా టీజర్ రిలీజ్
భారత్- పాకిస్థాన్ యుద్ధం నేపథ్యం కథతో తీసిన సినిమా 'బోర్డర్'. 1997లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో సంచనలమైంది. ప్రేక్షక్షుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తీశారు. 'బోర్డర్ 2' పేరుతో తెరకెక్కించారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా విజయ్ దివస్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్‌కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ తీశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని కూడా తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ఆర్మీ, దిల్జీత్ ఎయిర్‌ఫోర్స్, అహన్ శెట్టి నేవీ సైనికులుగా కనిపించనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
హిందుస్తాన్... హిందుస్తాన్...
మేజర్ కుల్దీప్ సింగ్‌గా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ వెండితెరపైకి మళ్లీ వస్తున్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బోర్డర్ 2’. వరుణ్ ధావన్, దిల్జీత్ సింగ్, అహన్ శెట్టి, మేధా రాణా, మోనా సింగ్, సోనమ్ బజ్వా ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మేజర్ కుల్దీప్ సింగ్ పాత్రలో కనిపిస్తారు సన్నీ డియోల్. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘బోర్డర్ 2’ సినిమాలోని సన్నీ డియోల్ పాత్ర తాలూకు మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘హిందుస్తాన్... హిందుస్తాన్... మేరీ జాన్ హిందుస్తాన్’ అనే పాటతో ఈ మోషన్‌పోస్టర్ సాగుతుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కానుంది. అయితే ఈ సినిమాను తొలుత జనవరి 23న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఒకరోజు ముందుగా... జనవరి 22న విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ఇక 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘బోర్డర్’ (1997) సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ రూపొందింది. ‘‘27 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఓ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఓ సైనికుడు తిరిగి వస్తున్నాడు’’ అంటూ ఈ సినిమాను ప్రకటించిన సమయంలో ఈ చిత్రబృందం పేర్కొంది. -
బోర్డర్ సీక్వెల్లో అహన్ శెట్టి.. నాన్న వల్లే ఈ చాన్స్ అంటూ ఎమోషనల్!
బాలీవుడ్ ‘బోర్డర్’ సీక్వెల్ ‘బోర్డర్ 2’లో జాయిన్ అయ్యారు అహన్ శెట్టి. సన్నీ డియోల్ హీరోగా, వరుణ్ ధావన్, దిల్జీత్ సింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బోర్డర్ 2’. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో అహన్ శెట్టి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ‘‘బోర్డర్’ సినిమాతో నా అనుబంధం 29 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. మా నాన్న (బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి) ‘బోర్డర్’ సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు మా అమ్మ సెట్స్‌కు వెళ్లేది. అప్పుడు మా అమ్మ గర్భవతి. నేను మా అమ్మ గర్భంలో శిశువుగా ఉన్నాను. ఆ తర్వాత జేపీ దత్తా (‘బోర్డర్’ సినిమా దర్శకుడు, ‘బోర్డర్ 2’ నిర్మాత) అంకుల్ చెప్పే కథలు వింటూ, ఆయన చేయి పట్టుకుని నడిచాను... పెరిగాను. నా జీవితంలోని ఇలాంటి అనుభవాలే నాకు సినిమాల వైపు ఆసక్తి కలిగేలా చేశాయి. ‘‘ఇప్పుడు నేను ‘బోర్డర్ 2’ సినిమాలో ఓ రోల్ చేయనున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సన్నీ డియోల్ సార్‌తో వర్క్ చేయబోతున్నాను. దిల్జీత్గారికి నేను అభిమానిని. వరుణ్ ధావన్గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా నాన్నగారి వల్లే నేను ఇలా ఉండగలిగాను. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాను’’ అని పేర్కొన్నారు అహన్ శెట్టి. ‘బోర్డర్ 2’ చిత్రాన్ని 2026 జనవరి 23న రిలీజ్ చేయనున్నారు. ఇక సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ ‘బోర్డర్’ 1997లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు జేపీ దత్తా దర్శకత్వం వహించారు. -
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
ఇరవయ్యేడేళ్ల తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు సన్నీ డియోల్. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన చిత్రం ‘బోర్డర్’. 1997 జూన్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. కాగా ‘బోర్డర్’ చిత్రం విడుదలై గురువారం (జూన్ 13) నాటికి సరిగ్గా 27 సంవత్సరాలు. ఈ సందర్భంగా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ‘బోర్డర్’కు దర్శకత్వం వహించిన జేపీ దత్తాకు బదులుగా దర్శకుడు అనురాగ్ సింగ్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 27 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు సన్నీ డియోల్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘బోర్డర్’ చిత్రం 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం సీక్వెల్ కథపై స్పష్టత రావాల్సి ఉంది. -
Border 2 : పాతికేళ్ల తర్వాత వచ్చేస్తున్న సీక్వెల్
సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా తదితరులు లీడ్ రోల్స్‌లో నటించిన సూపర్ హిట్ హిందీ ఫిల్మ్ ‘బోర్డర్’ని అంత సులువుగా మరచిపోలేం. 1997లో విడుదలైన ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. పాతికేళ్ల తర్వాత ‘బోర్డర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్ సీక్వెల్లోనూ హీరోగా నటిస్తారు. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో లీడ్ రోల్ చేస్తారు. కాగా ‘బోర్డర్’ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి ప్రకాశ్ దత్తా ‘బోర్డర్ 2’కు ఓ నిర్మాతగా ఉండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను 2026 జనవరి 23న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భారతదేశ సైనికుల త్యాగాలు, గొప్పతనం గురించి తెలిపేలా ఉండే ఈ సినిమాను రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని, జనవరి 23 పర్ఫెక్ట్ డేట్ అని యూనిట్ భావించిందట. ఇక ఈ సీక్వెల్లో వచ్చే వార్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.


