బాలీవుడ్ నుంచి వచ్చిన మరో దేశభక్తి చిత్రం బోర్డర్ 2. 1997లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘బోర్డర్’చిత్రానికి సీక్వెల్ ఇది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య నిన్న (జనవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలిరోజే సూపర్ హిట్ సంపాదించుకుంది. ఫలితంగా మొదటి రోజు భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30 కోట్ల(నెట్) వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. కలెక్షన్స్ పరంగా చూస్తే.. తొలి రోజే ఈ చిత్రం ‘ధురంధర్’ని బీట్ చేసింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ చిత్రానికి తొలి రోజు రూ. 28 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక దేశ వ్యాప్తంగా దురంధర్ తొలిరోజు 6,146 షోస్ పడితే.. బోర్డర్ 2కి 6000 మాత్రమే పడ్డాయి. అయినా కూడా కలెక్షన్స్ పరంగా బోర్డర్ 2 చిత్రమే టాప్‌లో ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. వీకెండ్‌లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


