రూ.50 కోట్లు కొల్లగొట్టిన రాధిక శరత్‌ కుమార్‌ మూవీ | Radhika Sarathkumar Starrer Thaai Kizhavi enters rs 50 cr Club | Sakshi
Sakshi News home page

Thaai Kizhavi: హాఫ్‌ సెంచరీ కొట్టిన రాధిక సినిమా..

Mar 9 2026 5:52 PM | Updated on Mar 10 2026 11:30 AM

Radhika Sarathkumar Starrer Thaai Kizhavi enters rs 50 cr Club

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా అలరించిన రాధిక శరత్‌కుమార్‌ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే 'తాయ్‌ కిళవి' కోసం ఆమె ముసలమ్మగా నటించింది. ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసినప్పటినుంచి మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. 75 ఏళ్ల బామ్మగా రాధిక నటించడం, హీరో శివకార్తికేయన్‌ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాకు పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హాఫ్‌ సెంచరీ
పాజిటివ్‌ రివ్యూలతో తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌పై మంచి పట్టు సాధించింది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తాయ్‌ కిళవి రూ.50 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇక సినిమా రిలీజైనప్పటినుంచి టాప్‌ హీరోలు, దర్శకుడు, హీరోయిన్లు అందరూ సినిమాను, ముఖ్యంగా రాధికను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు.

 

 

చదవండి: వానిటీ వ్యాన్స్‌, వాష్‌రూమ్స్‌ ఏవీ లేవు: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement