టాలీవుడ్‌లో మరో వివాదం.. సారీ చెప్పిన డైరెక్టర్ | Ustaad Bhagat Singh Director Harish Shankar Apologizes Mahesh Babu Fans | Sakshi
Sakshi News home page

Harish Shankar: అనవసరమైన ట్వీట్.. తర్వాత డిలీట్.. ఇప్పుడు క్షమాపణ

Mar 11 2026 12:18 PM | Updated on Mar 11 2026 12:26 PM

Ustaad Bhagat Singh Director Harish Shankar Apologizes Mahesh Babu Fans

పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తీసిన దర్శకుడు హరీశ్ శంకర్.. హీరో మహేశ్ బాబు అభిమానుల్ని హర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం అంతా ట్విటర్‌లో ఈ విషయం గురించే చర్చ నడిచింది. ఇప్పుడు ఇది కాస్త సీరియస్ అయ్యేసరికి సదరు డైరెక్టర్.. మహేశ్ ఫ్యాన్స్‌కి  క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది.

(ఇదీ చదవండి: చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్)

అసలేం జరిగింది?
మంగళవారం సాయంత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'ని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. బాబు రికార్డులు లేపేయాలని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా 'తథాస్తు' అని రీట్వీట్ చేశాడు. సెకన్ల వ్యవధిలో విషయం అర్థమై హరీశ్ శంకర్.. తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ మహేశ్ బాబు అభిమానులు మాత్రం హరీశ్ శంకర్‌ని ఘోరంగా ట్రోల్ చేశారు. 'ఉస్తాద్..' మూవీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. దీంతో ఇప్పుడు హరీశ్ శంకర్.. మహేశ్ అభిమానులకు సారీ చెప్పాడు.

హరీశ్ ఏమన్నాడు?
'సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తమన్ స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పనులతో నిన్నంతా బిజీగా గడిచింది. అదే టైంలో జర్నలిస్టులు, అభిమానుల మెసేజులకు రిప్లై ఇస్తూ ఆ హడావుడిలో ఓ ట్వీట్‌ని పూర్తి చదవకుండానే రీట్వీట్ చేశాను. నా టీమ్ అలెర్ట్ చేయగానే నిమిషం లోపే ట్వీట్ డిలీట్ చేశాను. మహేశ్ బాబుపై నాకు ఎంతో గౌరవముంది. 'పోకిరి' గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. 'వారణాసి'తో ఆయన పేరుమీద మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నాను'

'ఆయనని కానీ ఆయన అభిమానులని కానీ బాధపెట్టాలని ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. సినిమా మరో 10 రోజుల్లో విడుదలయ్యే ఈ టైంలో ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఓ సినిమా రికార్డులు సృష్టించాలనే అందరి హీరోల అభిమానుల మద్దతు అవసరం. అయినప్పటికీ నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని హరీశ్ శంకర్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement