అప్పటివరకు నా కొడుకు సినిమా చూడను: సునీల్‌ శెట్టి | Suniel Shetty Refused To Watch His Son Ahan Shetty Border 2 Until It Cross Rs 500 Cr Box Office Collections | Sakshi
Sakshi News home page

Suniel Shetty: అప్పటిదాకా నా కొడుకు మూవీ చూసే ప్రసక్తే లేదు

Feb 28 2026 4:58 PM | Updated on Feb 28 2026 5:20 PM

Suniel Shetty Refused to Watch Ahan Shetty Border 2 Until it Cross Rs 500 cr

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్‌ శెట్టి నటించిన తాజా చిత్రం "బోర్డర్‌ 2". అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే రూ.400 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇంతటి ఘన విజయం అందుకున్న ఈ సినిమాను ఇంతవరకు చూడలేదంటున్నాడు సునీల్‌ శెట్టి.

మాట మీదే ఉన్నా..
రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాతే బోర్డర్‌ 2 చూస్తానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్‌ శెట్టి మాట్లాడుతూ.. ఇది దేశభక్తి సినిమా.. కచ్చితంగా ఇది రూ.500 కోట్లు దాటాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేవరకు నేను వేచి చూస్తానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇప్పుడీ సినిమా రూ.489 కోట్ల కలెక్షన్స్‌ వరకు చేరుకుంది. మరో రూ.11 కోట్లు వస్తే నేను అనుకున్న నెంబర్‌ దాటేస్తుంది. 

సినిమా
అప్పుడే ఈ మూవీ చూస్తాను. చాలాసార్లు సినిమా చూడాలనుకున్నాను, థియేటర్‌ వరకు వెళ్లాను. అహాన్‌ ఇంట్లో ప్రాక్టీస్‌ చేసిన డైలాగులను థియేటర్‌లో చెవులారా వినాలనుకున్నాను. కానీ నన్ను నేను తమాయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 1997లో వచ్చిన బోర్డర్‌ సినిమాకు సీక్వెల్‌గా బోర్డర్‌ 2 తెరకెక్కింది. ఇందులో సన్నీడియోల్‌, వరుణ్‌ ధావన్‌, దిల్జిత్‌ దోసాంజ్‌, మోనా సింగ్‌, సోనమ్‌ బజ్వా, అన్య సింగ్‌, ప్రణవ్‌ వశిష్ట్‌, మేధ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

చదవండి: ప్రేయసికి బ్రేకప్‌ చెప్పలేదని హీరోని మార్చేశారా?

Advertisement
 
Advertisement
Advertisement