హీరోలు నన్ను రిజెక్ట్‌ చేశారు.. వాళ్ల వల్లే..: తాప్సీ | Taapsee Pannu: Male Actors Refused to Work with Me | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: నాతో నటించేందుకు హీరోలు ఇష్టపడరు, వాళ్ల వల్ల..

Feb 28 2026 1:09 PM | Updated on Feb 28 2026 1:17 PM

Taapsee Pannu: Male Actors Refused to Work with Me

'ఝుమ్మంది నాదం' సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది తాప్సీ పన్ను. మిస్టర్‌ పర్ఫెక్ట్‌, వీర, మొగుడు, దరువు, సాహసం, గేమ్‌ ఓవర్‌, మిషన్‌ ఇంపాజిబుల్‌ ఇలా తెలుగులో అనేక సినిమాలు చేసింది. తమిళ చిత్రాల్లోనూ తళుక్కుమని మెరిసింది. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడే పాగా వేసింది.

హీరోల వెనకడుగు
తాజాగా ఈ బ్యూటీ అస్సి అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న తాప్సీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాతో సినిమాలు చేసేందుకు చాలామంది హీరోలు వెనకడుగు వేశారు. కారణాలు తెలీదు కానీ నాతో చేయననేవారు. అలా కొన్ని అవకాశాలు చేజారిపోయాయి.

చాలామందికి పెద్ద షాక్‌
చాలామటుకు సినిమాల్లో హీరోయిన్‌ ఎవరనేది ఫైనల్‌గా హీరోనే నిర్ణయిస్తాడు. అయితే కొందరు దర్శకులు మాత్రం ఫలానా హీరోయినే కావాలని పట్టుబడతారు. వారు కోరుకున్న హీరోయిన్‌తోనే సినిమా మొదలుపెడతారు. ఉదాహరణకు డండీ సినిమానే తీసుకుందాం. డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ హిరానీ సర్‌ నన్నే తీసుకోవాలని డిసైడయ్యారు. నిజానికి షారూఖ్‌తో తరచూ జత కట్టే హీరోయిన్స్‌ వేరు. కానీ, అది బ్రేక్‌ చేస్తూ నన్ను ఎంపిక చేయడంతో చాలామంది షాకయ్యారు. ఇకపోతే నాతో పనిచేయడం కష్టమని ఓ రూమర్‌ ఉంది. అదెలా వచ్చిందో నాకర్థం కాదు.

అదే నిజమైతే..
ఎందుకంటే నా కెరీర్‌లో చాలామంది దర్శకుడు నాతో మళ్లీ మళ్లీ పని చేశారు. నాతో పని చేయడం కష్టమైతే సెకండ్‌ టైమ్‌ నన్నెందుకు తీసుకుంటారు? నాతో పని చేయనివారు, నా గురించి తెలియనివారే నాపై అనవసరమైన రూమర్‌ పుట్టించారు. దానికోసం ఆలోచించి నేనేంటో బయటకు వచ్చి చెప్పాల్సిన పనిలేదు. నేను పనితోనే సమాధానం చెప్తాను అంది తాప్సీ.

చదవండి: నీకు ఉసురు తగులుతుంది.. హేటర్స్‌కు ఇచ్చిపడేసిన తనూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement