యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. కెమెరామెన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ యాక్షన్ లవ్‌స్టోరీ నుంచి తాజాగా రుబరూ.. అంటూ సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
లవ్ సాంగ్
మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని.. అంటున్నది మనసే.. కాసేపు నువ్వు,నేను కలిసి.. క్షణంలో లోకమంత తెలిసే.. అన్న లిరిక్స్‌తో పాట మొదలైంది. 'మోసం అంటే ఏందో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే.. మోసం చేస్తావని తెలీదు కదా జూలియట్.. ఎందుకు నమ్మించినావే..' అంటూ హీరో లవ్‌స్టోరీని పాటలో చూపించారు. అలాగే చివర్లో బ్రేకప్ బాధను కూడా చూపించారు.
సినిమా
ఇదివరకు రిలీజైన టీజర్‌లో యాక్షన్‌ను ఎక్కువ హైలైట్ చేయగా ఈ పాటలో మాత్రం లవ్ టచ్ ఎక్కువ జోడించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.


