టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందారు. హీరోయిన్ రహస్య గోరఖ్‌ను పెళ్లాడగా.. వీరిద్దరికి పండంటి బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా ఈ జంట తమ ముద్దుల కుమారుడికి కేశఖండన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కిరణ్, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. గతేడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం గతేడాది క, కె-ర్యాంప్ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్‌తో మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించనున్నారు.
కిరణ్ అబ్బవరం తన కుమారుడు హను
అబ్బవరం పుట్టి వెంట్రుకలు కార్యక్రమంలో తన గ్రామ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, తన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దనే అందమైన సందేశం ఇచ్చారు.👌@Kiran_Abbavaram #chennailovestory ♥️ pic.twitter.com/4rpBfu9d8w— Kakinada Talkies (@Kkdtalkies) February 26, 2026


