Photo source : instantbollywood (instagram)
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్‌కు రానున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న తర్వాత తొలిసారిగా కలిసి కనిపించారు. తాజాగా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
పెళ్లికి ముందు కూడా వారిద్దరూ కలిసి ప్రయాణం చేసినప్పటికీ వేర్వేరుగా ప్లాన్ చేసుకునేవారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు పెళ్లి తర్వాత ఒకరిచేయి మరోకరు పట్టుకుని సంతోషంగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇలా వారిద్దరూ కలిసి కనిపించడంతో ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.


