ది కేరళ స్టోరీ-2 మేకర్స్‌కు బిగ్ రిలీఫ్ | Kerala High Court Big Relief to The Kerala Story 2 Goes Beyond Movie | Sakshi
Sakshi News home page

The Kerala Story 2 Movie : ది కేరళ స్టోరీ-2 మేకర్స్‌కు బిగ్ రిలీఫ్

Feb 27 2026 4:28 PM | Updated on Feb 27 2026 5:35 PM

Kerala High Court Big Relief to The Kerala Story 2 Goes Beyond Movie

ది కేరళ స్టోరీ-2 మూవీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు తొలగించింది. సింగిల్ బెంచ్‌ ఇచ్చిన స్టేను డివిజన్‌ బెంచ్‌  కొట్టేసింది. దీంతో ఈ సినిమాకు రిలీజ్‌కు మార్గం సుగమమైంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా స్టే వల్ల విడుదల కాలేదు. తాజాగా స్టే ఎత్తివేయడంతో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. 

కాగా.. గతంలో రిలీజైన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్‌గా 'కేరళ స్టోరీ 2' ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 27న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాపై సింగిల్ బెంచ్ న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెన్సార్‌ బోర్డుపై కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.

సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్‌ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement