విజయ్‌, రష్మికలకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ | Endayya Saami Special Surprise song out from Ranabaali movie | Sakshi
Sakshi News home page

విజయ్‌, రష్మికలకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

Feb 28 2026 11:33 AM | Updated on Feb 28 2026 11:41 AM

Endayya Saami Special Surprise song out from Ranabaali movie

విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్న నూతనంగా పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు రణబాలి మూవీ నుంచి స్పెషల్‌ వీడియోను విడుదల చేసి మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. ఏందయ్య సామీ అంటూ సాగే ఒక గీతాన్ని ప్రోమోగా వదిలారు. సింగర్స్‌ శ్వేతా మోహన్, అజయ్ గోగవాలే ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటలో కొత్తగా పెళ్లైన దంపతులుగా విజయ్‌, రష్మికలు కనిపిస్తున్నారు. 1854 - 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి చిత్రాన్ని  డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement