విజయ్-రష్మిక పెళ్లి తర్వాత వచ్చే సినిమా ఇదే.. వీడియో రిలీజ్
గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ మాత్రం విజయ్ దేవరకొండకు దొరకట్లేదు. గతేడాది 'కింగ్డమ్'తో వచ్చాడు గానీ అదే సీన్ రిపీటైంది. ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'రౌడీ జనార్ధన' కాగా మరొకటి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పీరియాడిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తుండటం విశేషం.విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు 'రణబాలి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 1876-78 మధ్య రాయలసీమ ప్రాంతంలో జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన బ్రిటీషర్లు.. హిట్లర్ చేసిన దానికంటే ఎంత పెద్ద మారణహోమం సృష్టించారు. ఏకంగా 45 ట్రిలియన్ డాలర్లు దోచుకోవడం, 40 ఏళ్లలో 100 మిలియన్ల మంది చావులకు కారణమవడం.. ఇలాంటి చాలా విషయాలు సినిమాలో ఉండబోతున్నాయని అనౌన్స్మెంట్ వీడియోతో చెప్పకనే చెప్పేశారు.ఇందులో విజయ్.. బ్రిటీషర్లపై పోరాడిన రణబాలి అనే వీరుడిగా కనిపించనున్నాడు. రష్మిక.. జయమ్మ అనే పాత్ర పోషించింది. 'మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో ... సర్ థియోడర్ హెక్టర్ పాత్ర చేశాడు. బాలీవుడ్ ఫేమ్ అజయ్ అతుల్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వీళ్లిద్దరూ భార్యభర్తలుగా నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. గతంలో వీళ్లిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు జంటగా చేశారు.