‘సామజవరగమన’ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ జంటగా నటించిన చిత్రం మృత్యుంజయ్.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను దర్శకుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. కాలభైరవ సంగీతం అందించారు. మార్చి 6న ఈ చిత్రం విడుదల కానుంది.


