లెనిన్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా? | Jr Ntr Voice Over To Akkineni Akhil Lenin Movie | Sakshi
Sakshi News home page

Lenin Movie: లెనిన్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Jul 6 2026 6:42 PM | Updated on Jul 6 2026 6:51 PM

Jr Ntr Voice Over To Akkineni Akhil Lenin Movie

అక్కినేని అఖిల్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రానికి ముర‌ళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

లెనిన్ ట్రైలర్‌కు నాగార్జున వాయిస్ ఓవర్ అందించారు. తాజాగా మరో హీరో లెనిన్ కోసం తన వాయిస్ ఓవర్ అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన వాయిస్ ఓవర్ ఇచ్చారు. శ్రీరామాపురం, భారతంమిట్ట గ్రామాలు.. అందులోని మనుషులను తీరు తెన్నులను ఎన్టీఆర్‌ తన వాయిస్‌ ద్వారా చెప్పనున్నారు. దీనికి సంబంధించిన డబ్బింగ్‌ పనిని కూడా పూర్తి చేశారు మన యంగ్ టైగర్.  ఈ సందర్భంగా అక్కినేని అఖిల్‌.. జూనియర్ ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఈ చిత్రాన్ని మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవ‌ర నాగవంశీ నిర్మించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement