శ్రీలీలకు మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి కయాదు కొట్టేసింది! | Ak64: Kayadu Lohar Replaced Sreeleela In Ajith Film | Sakshi
Sakshi News home page

శ్రీలీలకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ హీరో సినిమా నుంచి ఔట్‌

Jul 16 2026 8:49 AM | Updated on Jul 16 2026 8:57 AM

Ak64: Kayadu Lohar Replaced Sreeleela In Ajith Film

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ నుంచి కొత్త సినిమా వచ్చి  ఏడాది దాటిపోయింది. గుడ్‌ బాడ్‌ అగ్లీ చిత్రం తర్వాత ఈయన మరో చిత్రంలో నటించలేదు. దీంతో ఆయన అభిమానులు కొత్త చిత్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గుడ్‌ బాడ్‌ అగ్లీ చిత్రం దర్శకుడు ఆధిక్‌ రవిచంద్రన్‌ నే అజిత్‌ 64వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికీ వెలువడలేదు. మరోపక్క అజిత్‌ తన కార్‌ రేస్‌ పోటీలపై దృష్టి సారిస్తున్నారు. ఇకపోతే అజిత్‌ తన పారితోషికాన్ని తగ్గించడానికి అంగీకరించడం లేదని, దీంతో నిర్మాతలు ఆయనతో చిత్రం చేయడానికి ముందుకు రావడంలేదనే ప్రచారం జోరుగానే సాగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో అజిత్‌ కథానాయకుడుగా నటించే 64వ చిత్రాన్ని నిర్మించడానికి కోయంబత్తూరు కు చెందిన ఒక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చినట్లు తాజా సమాచారం. కాగా ఇందులో నటి శ్రీ లీల నాయకగా నటించనున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే తాజా విషయం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్‌ నుంచి శ్రీలీలను తప్పుకుందట. డేట్స్‌ కుదరకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు సమాచారం.

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఉన్న ఫ్లాప్‌ రికార్డు చూసి చిత్రబృందమే ఆమెను తప్పించారనే రూమర్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీలీల స్థానంలో కయాదు లోహర్‌ని తీసుకున్నట్లు సమాచారం.   ఇప్పటికే శ్రీలీల ‘లెనిన్‌’లాంటి మంచి సినిమాను మిస్‌ చేసుకుంది. తొలుత ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు.

అయితే డేట్స్‌ కుదరకపోవడంతో ఆమె పాత్రను భాగ్యశ్రీ చేసింది. సినిమా రిలీజ్‌ తర్వాత భాగ్యశ్రీ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. శ్రీలల అనవసరంగా ఈ సినిమాను వదులుకుందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు అజిత్‌ సినిమా కూడా మిస్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె స్థానంలో కయాదుని తీసుకున్నారట. మరో ముఖ్య పాత్రలో నటి స్వాసిక నటించనున్నట్లు, దీనికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. అదేవిధంగా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌న్స్‌ కార్యక్రమాలు మొదలయ్యాయని త్వరలోనే ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement