వదలా కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించింది  | Anil Ravipudi Speech At Vadala Telugu Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

వదలా కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించింది 

Jul 16 2026 4:44 AM | Updated on Jul 16 2026 4:44 AM

Anil Ravipudi Speech At Vadala Telugu Movie Pre Release Event

– దర్శకుడు అనిల్‌ రావిపూడి

జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్‌ నటించిన సినిమా ‘వదలా’. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ్, కిషోర్‌ నాయుడు చిరుమామిళ్ల నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజ రైన దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘వదలా’ ట్రైలర్, పాటలు నాకు నచ్చాయి. కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించింది’’ అన్నారు. 

జగపతిబాబు మాట్లాడుతూ–‘‘ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది. ఈ సినిమాకి ఇంకా బిజినెస్‌ కాలేదు. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి, మాకు డబ్బులు ఇస్తారని ఆశిస్తున్నాను. ‘వదలా..’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే, హీరోగా ఇలాంటి డిఫరెంట్‌ పాత్రలు కూడా ప్రయత్నిస్తాను. ఈ ‘వదలా’ సినిమాను నాకోసం వదలకుండా చూడండి’’ అని కోరారు. ‘‘నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతోంది. 

ఓ పదేళ్ల క్రితం వైరాగ్యంతో సినీ సన్యాసం తీసుకుంటే, కిషోర్‌గారు మాత్రం ఈ సినిమాను నిర్మించాల్సిందే అని పట్టుబట్టారు. నా ప్రొడక్షన్‌లో ‘అంతఃపురం’ తర్వాత ఇదే బెస్ట్‌ ఫిల్మ్‌’’ అని పేర్కొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్‌. ‘‘మధ్యప్రదేశ్‌లో సెటిల్‌ అయిన నేను ఇక్కడకు వచ్చి, డబ్బు గురించి కాకుండా మనుషుల గురించి ఆలోచించాను. ప్రతిరోజూ సెట్స్‌లో 150 మందికి భోజనం పెట్టాను. అదే నాకు అదృష్టం. నా సంకల్పంతో ఈ సినిమా కూడా హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు కిషోర్‌ నాయుడు. ఛోటా కె. నాయుడు, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ నిర్మాత నాగేశ్వర్‌ రావు మాట్లాడారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement