‘ధురంధర్‌ 2’ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. ఒక్క మాటతో అంచనాలు రెట్టింపు | Dhurandhar 2 First Review: Yami Gautam Reveals She Has Watched Dhurandhar 2 | Sakshi
Sakshi News home page

‘ధురంధర్‌ 2’ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. బాక్సాఫీస్‌ షేక్‌ అవ్వాల్సిందేనా?

Feb 28 2026 11:24 AM | Updated on Feb 28 2026 11:36 AM

Dhurandhar 2 First Review: Yami Gautam Reveals She Has Watched Dhurandhar 2

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్‌’ క్రియేట్‌ చేసిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ధురంధర్‌ 2 చిత్రం కోసం యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 

ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్‌ చేసింది. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఆదిత్యధర్‌ సతీమణి యామీ గౌతమ్‌ ధురంధర్‌ 2పై తన రివ్యూని ఇచ్చేసింది.

భారత్‌ సమ్మిట్‌ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్‌.. తాను ఇప్పటికే ‘ధురంధర్‌ 2’ చూశానని చెబుతూ..భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్‌ 2 నేను చూసేశాను. నా భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారు. ధురంధర్‌ 2 చాలా అసాధరణమైన సినిమా. ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మూవీ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను.

ఆ రోజు నేను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో ఆదిత్య ధర్‌తో ఏమీ చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. విమానం దిగిన తర్వాత ఆదిత్యకు ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నాను. సినిమాపై నా ఒపీనియన్ చాలా చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ఆడియన్స్, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఈ మూవీ తెరకెక్కించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ధురంధర్ 2 ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతం. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈ విషయాన్ని నేను  కచ్చితంగా చెప్పగలను’ అని యామీ గౌతమ్‌ అన్నారు.

ఇక ధురంధర్‌ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్‌ 370’ షూటింగ్‌లో ఉన్నప్పుడే ‘ధురంధర్‌’ స్క్రిప్ట్ చదివాను. అది కేవలం 40 పేజీలు మాత్రమే ఉంది. కానీ చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. అప్పుడు కూడా ఆదిత్యకు ఏం చెప్పాల్లో అర్థం కాలేదు. కానీ నా స్పందన ఏంటో ఆయను అర్థమైపోయింది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. హిస్టరీ క్రియేట్‌ చేసే సినిమా అవుతుందని ముందే ఊహించా. ధురంధర్‌ 2 అంతకు మించి ఉంటుంది’ అంటూ అంచనాలను రెట్టింపు చేసింది.  మరి ధురంధర్‌ 2 ఎన్ని రికార్డులకు బద్దలు కొడుతుందో చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement