పిల్లలంటే ప్రాణం.. ఆ విషయంలో మాత్రం: ఉదయభాను | Anchor Udaya Bhanu about Mobile Phone Effects On Kids | Sakshi
Sakshi News home page

Udaya Bhanu: సోషల్‌ మీడియా టాక్సిక్‌.. పిల్లల్ని దూరంగా ఉంచాలి

Feb 27 2026 7:26 PM | Updated on Feb 27 2026 7:28 PM

Anchor Udaya Bhanu about Mobile Phone Effects On Kids

ఒకప్పుడు యాంకర్‌గా ఉర్రూతలూగించిన ఉదయభాను ఇప్పుడు సినీ నటిగా అలరిస్తోంది. గతేడాది త్రిబాణధారి బార్బరిక్‌ చిత్రంలో అలరించిన ఈ యాంకర్‌ ఇప్పుడు డాటరాఫ్‌ ప్రసాద్‌రావు: కనబడుట లేదు వెబ్‌ సిరీస్‌లో పోలీస్‌గా కనిపించింది. ఈ సిరీస్‌ జీ 5లో నేడే రిలీజైంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఉదయభాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

జాగ్రత్త అవసరం
ఆమె మాట్లాడుతూ.. జెన్‌జీ కిడ్స్‌ వాళ్ల ప్రపంచంలో వాళ్లుంటున్నారు. తల్లిదండ్రులు వారి పనుల్లో వారు బిజీ.. పిల్లలు అయితే చదువు లేదంటే ఫోన్‌తో బిజీ అయిపోతున్నారు. కానీ, సోషల్‌ మీడియాకు పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే సోషల్‌ మీడియా టాక్సిక్‌.. అక్కడ మంచి కన్నా చెడుయే ఎక్కువగా ఉంది. ఈ ఫోన్‌ పిల్లల్ని క్రిమినల్స్‌గా మార్చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

పిల్లలంటే ప్రాణం
నాకు పిల్లలంటే ప్రాణం. వాళ్ల కోసం ఉదయం ఐదుగంటలకే లేచి వంట చేసి పెట్టి షూటింగ్‌కు వెళ్తాను. వారికోసం ప్రత్యేక సమయం కేటాయిస్తాను. ఇకపోతే నేను తొలిసారి మైక్‌ పట్టింది హృదయాంజలి కోసం! అప్పటికి చిన్న చిన్న సీరియల్స్‌ చేశాను. కానీ హృదయాంజలి షోతోనే యాంకర్‌గా నా జర్నీ మొదలైంది అని ఉదయభాను చెప్పుకొచ్చింది.

చదవండి: నాన్‌స్టాప్‌ షూటింగ్‌.. ఐదో రోజు ఆస్పత్రిలో హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement