4 రోజులు ఇంటికెళ్లకుండా షూటింగ్‌.. 5వ రోజు ఆస్పత్రిలో! | Isha Koppikar recalls Hospitalisation After Nonstop Working For 5 days | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌ షూటింగ్‌.. ఐదోరోజు ఆస్పత్రిలో: చంద్రలేఖ హీరోయిన్‌

Feb 27 2026 6:17 PM | Updated on Feb 27 2026 6:38 PM

Isha Koppikar recalls Hospitalisation After Nonstop Working For 5 days

సాధారణంగా ఉద్యోగులు 8-9 గంటలపాటు పని చేస్తారు. కానీ సినిమా, బుల్లితెర ఆర్టిస్టులు మాత్రం కొన్నిసార్లు గ్యాప్‌ లేకుండా రోజంతా షూటింగ్‌ చేస్తూనే ఉంటారు. దీనివల్ల తాను చాలా ఇబ్బందిపడ్డానంటోంది బాలీవుడ్‌ నటి ఇషా కొప్పికర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్‌ మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాళ్లు నొప్పి పుట్టి ఇక నిలబడటం నా వల్ల కాదు అనేవరకు పని చేయించుకుంటూనే ఉంటారు. 

ఇంటికి వెళ్లేంత తీరిక ఎక్కడిది?
నా కెరీర్‌ మొదట్లో వెంటవెంటనే సినిమాలు చేశాను. షూటింగ్స్‌కు గ్యాప్‌ ఉండేది కాదు. కనీసం ఫిలిం సిటీ నుంచి నా ఇంటికి వెళ్లే తీరిక కూడా దొరికేది కాదు. దాంతో నిర్మాతలను షూటింగ్‌ లొకేషన్‌లోనే నాకంటూ ఒక రూమ్‌ వసతి కల్పించమని అడిగేదాన్ని. పొద్దున ఐదింటికి షూట్‌ స్టార్ట్‌ చేస్తే ఐదు గంటల వరకు కొనసాగేది. ఆ తర్వాత మళ్లీ రాత్రి ఏడింటి నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు షూటింగ్‌ అయ్యేది. 

సినిమా
అలా వరుసగా ఐదు రోజులు జరిగింది. దాంతో ఆరో రోజు నేను సెట్‌లో కాకుండా హాస్పిటల్‌లో పడున్నాను అని గుర్తు చేసుకుంది. దీపికా పదుకొణె అడిగినట్లుగా 8 గంటల పని డిమాండ్‌ సబబే అని వత్తాసు పలికింది. కాగా ఇషా కొప్పికర్‌.. చంద్రలేఖ అనే తెలుగు చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తెలుగులో ప్రేమతో రా, కేశవ సినిమాల్లో నటించింది. హిందీ, తమిళంలో అనేక సినిమాలు చేసింది. చివరగా అయలాన్‌ మూవీలో తళుక్కుమని మెరిసింది.

చదవండి: తల్లినవుతా.. కానీ పెళ్లి అవసరం లేదు: హీరోయిన్‌

Advertisement
 
Advertisement
Advertisement