ప్రభాస్ స్పిరిట్ మూవీ.. విలన్‌ యాక్షన్ మోడ్‌ లుక్‌ చూశారా? | Prabhas Spirit Movie Villain Role First Look Release | Sakshi
Sakshi News home page

Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ మూవీ.. విలన్‌ ఫస్ట్ లుక్ రిలీజ్

Feb 27 2026 6:51 PM | Updated on Feb 27 2026 6:59 PM

Prabhas Spirit Movie Villain Role First Look Release

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రానికి యానిమల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ స్టార్స్‌ నటిస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్‌ థ్రిల్లర్‌లో విలన్‌గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారు.

తాజాగా విలన్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నోటిలో సిగరెట్‌ పెట్టుకుని హై యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే విలన్ రోల్ పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కనిపిచనుంది.

ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని మాఫియా నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇప్పటివరకు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్‌  కనిపించనున్నారు.  ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న  స్పిరిట్ థియేటర్లలో సందడి చేయనుంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement