ఓ మాట అనుకుందామా! | O Mata Anukundama First Look Unveiled by senior actors Suhasini | Sakshi
Sakshi News home page

ఓ మాట అనుకుందామా!

Feb 28 2026 3:32 AM | Updated on Feb 28 2026 3:32 AM

O Mata Anukundama First Look Unveiled by senior actors Suhasini

సుహాసినీ మణిరత్నం, వినోద్‌ కుమార్, ఇంద్రజ కీలక పాత్రల్లో, శ్రీనివాస్‌ అనంతనేని, మోనికా మిశ్రా జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓ మాట అనుకుందామా!’. భీమ్‌జీ దర్శకత్వంలో మాస్టర్‌ కనిష్క్‌ మహాబలాహ్‌ సమర్పణలో పెంటి నాగరాజు, పెంటి నీరజ్‌ సందీప్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టైటిల్‌ గ్లింప్స్‌ని సుహాసినీ మణిరత్నం, వినోద్‌ కుమార్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మేం మంచి పాత్రలు చేస్తున్నాం. ఈ చిత్రం మంచి విజయం సాధించి, టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అని పేర్కొన్నారు.

భీమ్‌జీ మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఓ మాట అనుకుందామా!’. సరికొత్త ప్రేమకథని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘మా బ్యానర్‌ నుంచి ‘ఓ మాట అనుకుందామా!’ వంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పెంటి నాగరాజు, పెంటి నీరజ్‌ సందీప్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుకిృత్‌ కేఎస్, సంగీతం: అలోష్య పీటర్‌–వినోద్‌ యజమాన్య.

Advertisement
 
Advertisement
Advertisement