పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతోన్న లేటేస్ట్ మూవీ పురుషః. ఈ చిత్రంలో అనైరా గుప్తా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌ను మెప్పించాయి.
తాజాగా ఈ చిత్రం నుంచి దేవ నాయకి అంటూ సాగే ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు. ఈ మూవీకి షూటింగ్ ఇప్పిటికే పూర్తి కాగా..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ , వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషించారు.


