ప్రేయసికి బ్రేకప్‌ చెప్పలేదని హీరోని మార్చేశారా? | Director Reveals Reason Behind Fired Saif Ali Khan from debut film | Sakshi
Sakshi News home page

ప్రేయసికి బ్రేకప్‌ చెప్తావా? హీరోగా లాంచ్‌ అవుతావా? అసలేం జరిగిందంటే?

Feb 28 2026 3:56 PM | Updated on Feb 28 2026 4:02 PM

Director Reveals Reason Behind Fired Saif Ali Khan from debut film

బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ కెరీర్‌ పరంపర (1993) సినిమాతో మొదలైంది. అయితే దీనికంటే ముందు సైఫ్‌ బేకుడి చిత్రంతో పరిచయం కావాల్సి ఉంది. కానీ గర్ల్‌ఫ్రెండ్‌కు బ్రేకప్‌ చెప్తేనే సినిమా ఛాన్స్‌ అని డైరెక్టర్‌ కండీషన్‌ పెట్టాడని, దానికి సైఫ్‌ నిరాకరించాడని, దాంతో ఈ సినిమా అతడి చేజారిందని ప్రచారం జరిగింది.

అసలేం జరిగిందంటే?
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విషయంపై బేకుడి దర్శకుడు రాహుల్‌ రవాలి స్పందించాడు. ఆనాడు అసలేం జరిగిందనే విషయాలను గుర్తు చేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. గర్ల్‌ ఫ్రెండ్‌ ఉందన్న కారణంతో సైఫ్‌ అలీఖాన్‌ను రిజెక్ట్‌ చేశానన్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. అది పూర్తిగా అవాస్తవం. అతడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. 

అప్పుడలా...
షూటింగ్‌కు సరిగా వచ్చేవాడే కాదు. దానివల్ల నేను ఒత్తిడికి లోనయ్యాను. యాక్టింగ్‌ బాగా చేస్తాడు, కానీ షూటింగ్‌కు రాకుండా చిరాకు తెప్పించేవాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ తనలో చాలా మార్పు వచ్చింది అని చెప్పుకొచ్చాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ విషయానికి వస్తే.. ఆషిక్‌ ఆవారా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 

సినిమా
మై ఖిలాడీ తు అనారి, ఏక్‌తా రాజా, హమేశా, కీమత్‌: దే ఆర్‌ బ్యాక్‌, కచ్చే ఢాగే, దిల్‌ చహతా హై, డర్నా మానా హై, హమ్‌ తుమ్‌, ఓంకార, లవ్‌ ఆజ్‌ కల్‌, తానాజీ ఇలా అనేక సినిమాలు చేశాడు. దేవర: పార్ట్‌ 1 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం హైవాన్‌, హమ్‌ హిందుస్తానీ సినిమాలు చేస్తున్నాడు.

చదవండి: ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె

Advertisement
 
Advertisement
Advertisement