చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా కీలకపాత్రలో వెంకటేశ్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 గంటలకు... మీ జీ తెలుగులో, జీ5లోనూ అందుబాటులో ఉండనుంది. శనివారం సాయంత్రం మీ ఇంట్లోనే బుల్లితెరపై చిరంజీవి హిట్ సినిమాను కుటుంబ సమేతంగా చూసేయండి.
చిరంజీవి హీరోగా నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ హై–యాక్షన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ థియేట్రికల్ రన్‌లో భారీ వసూళ్లు సాధించి, ప్రశంసలు అందుకుంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ గ్రాండ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28 శనివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో తప్పక చూడండి.
ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫిబ్రవరి 11 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫాం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. శంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి కనిపించగా, నయనతార, వెంకటేశ్ దగ్గుబాటి, కేథరిన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం, తమ్మిరాజు ఎడిటింగ్‌తో ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా మారింది.

హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు, నవ్వులు పూయించే కామెడీ, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో అన్ని వయసుల ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా ఈ చిత్రం నిలిచింది. డిజిటల్ వేదికపై కూడా సెన్సేషన్ సృష్టించిన ఈ చిత్రం జీ5లో సంచలనాత్మకంగా 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి ప్రేక్షకాదరణను మరింతగా చాటుకుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని జీ5, జీ తెలుగు వేదికగా మీరూ తప్పకుండా చూసేయండి! మెగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’... జీ5లో ఫిబ్రవరి 11 నుంచి, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28 సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో మిస్ కాకుండా చూసేయండి!


