చిరంజీవికి సన్మానం.. గ్రాండ్‌ పార్టీలో సెలబ్రిటీలు | Kakinada Port Chairman KV Rao Grand Party Arrange To Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవికి సన్మానం.. గ్రాండ్‌ పార్టీలో సెలబ్రిటీలు

Feb 23 2026 7:00 AM | Updated on Feb 23 2026 9:17 AM

Kakinada Port Chairman KV Rao Grand Party Arrange To Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి- దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఘన విజయాన్ని అందుకున్న  చిరంజీవి, చిత్ర యూనిట్‌ను కాకినాడ పోర్ట్‌ ఛైర్మన్‌ కె.వి.రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పార్టీలో  చిత్ర నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటితోపాటు, దర్శకుడు అనిల్‌ రావిపూడి, కె.రాఘవేంద్రరావు, సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, వి.వి.వినాయక్, బాబీ, బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. ఈ ఫోటోలను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్,  అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయడు తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement