హరీష్ శంకర్, దేవిశ్రీప్రసాద్, చంద్రబోస్
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల, రాశీ ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’పాట లిరికల్ వీడియో లాంచ్ ఈవెంట్‌ను యూనిట్ నిర్వహించింది.
ఈ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్‌గారి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ‘‘గబ్బర్ సింగ్’ సినిమాలోని ‘ఆకాశం అమ్మాయైతే..’పాటకు నేను, దేవీ, హరీష్‌గార్లు కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు మళ్లీ ఈపాటతో మీ ముందుకు వచ్చాం’’ అని తెలి΄ారు చంద్రబోస్. ‘‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ నాకు ప్రత్యేకమైనపాట. మైత్రీ మూవీ మేకర్స్ నా హోమ్ బ్యానర్ వంటిది. ఈ నిర్మాతలకు సినిమా అంటే ఎంతో తపన’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్.


