సీరియల్ బ్యూటీ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. టీజర్ రిలీజ్ | Jyothi Poorvaj Killer Movie Teaser | Sakshi
Sakshi News home page

Jyothi Poorvaj: 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ షాకింగ్ సినిమా

Feb 22 2026 7:16 PM | Updated on Feb 22 2026 7:16 PM

Jyothi Poorvaj Killer Movie Teaser

స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన జ్యోతిరాయ్.. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి మేడమ్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కొన్నేళ్ల క్రితం ఉన్నట్లుండి పూర్తిగా సీరియల్స్ చేయడం తగ్గించేసిన ఈమె, సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 'కిల్లర్' పేరుతో తెరకెక్కుతున్న చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: సమంత నుంచి సర్‌ప్రైజ్.. పోస్ట్ వైరల్)

సీరియల్‌లో పద్ధతి అయిన పాత్రల్లో కనిపించిన జ్యోతిరాయ్.. ఈ సినిమాలో సూపర్ ఉమన్ తరహా పాత్ర చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. టెరర్రిస్ట్(ఉగ్రవాది), వ్యాంపైర్(రక్త పిశాచి), స్పై(గూఢచారి) అనే కన్ఫ్యూజన్.. జ్యోతి పోషించిన పాత్రలో చూపించారు. ఓవైపు ఫుల్ రొమాన్స్ చూపిస్తూనే మరోవైపు ఈమె పాత్రతో యాక్షన్ కూడా చేయించారు. ఈమె భర్త పూర్వజ్.. ఇదే మూవీలో పోలీస్‌గా నటించాడు. టీజర్ అయితే ఆసక్తికరంగానే ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement