'జయం' సినిమా మాదే.. ప్రత్యూషతో పరిచయం: శేఖర్‌ భాషా | Bigg Boss Fame Shekar Basha Comments On Pratyusha and Jayam movie | Sakshi
Sakshi News home page

జయం సినిమా మా ఇద్దరిదే.. ప్రత్యూషతో పరిచయం: శేఖర్‌ భాషా

Feb 22 2026 3:46 PM | Updated on Feb 22 2026 3:53 PM

Bigg Boss Fame Shekar Basha Comments On Pratyusha and Jayam movie

బిగ్‌బాస్‌ ఫేం, ఆర్జే శేఖర్‌ భాషా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి ప్రత్యూషతో పాటు జయం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ కోసం జరిగిన ఆడిషన్స్‌లో తాను సెలెక్ట్ అయ్యానని గుర్తు చేసుకున్నారు. అయితే, హీరోయిన్‌గా ప్రత్యూషను ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. ఈ క్రమంలో దర్శకులు తేజ తమ ఇద్దరితో కలిపి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారని ఆయన గుర్తుచేశారు.

తాను ఇంజనీరింగ్‌ చదువుతున్న రోజుల్లో జయం సినిమా కోసం దర్శకుడు తేజ ఆడిషన్స్‌ ప్రకటన ఇచ్చినట్లు శేఖర్‌ భాషా తెలిపారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున​ ఆడిషన్స్‌లో పాల్గొన్నారన్నారు. అయితే, గట్టి పోటీ తట్టుకుని మొదట తాను ఎంపికయినట్లు చెప్పారు.  ' సినిమా షూటింగ్స్‌లో భాగంగా నాతో కొన్ని సీన్స్‌ కూడా ప్రాక్టీస్‌ చేపించారు. ఆ తర్వాతనే హీరోయిన్‌గా ప్రత్యూష ఎంపిక చేశారు. స్క్రీన్‌పై మా ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూసేందుకు కొన్ని రిహార్సల్స్‌ కూడా చేపించారు. జయం సినిమాకు మేము ఇద్దరం ఫైనల్ అవుతామనే నమ్మకం ఏర్పడింది. 

కానీ,  హీరోయిన్‌గా ఎంపికైన ప్రత్యూష మరణించడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.  ఆ తర్వాత నిర్మాత కూడా ఈ మూవీ నుంచి వెనక్కి తగ్గారు. అయితే, అదే కథతో కొద్దిరోజుల తర్వాత నితిన్, సదా కాంబినేషన్‌తో ‘జయం’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా భారీ విజయం అందకున్నప్పుడు జరిగిన విషయం చెబుదామనుకున్నాను. కానీ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుందని అప్పట్లో చెప్పలేదు. ప్రస్తుతం ప్రత్యూష మరణంపై కోర్టు తీర్పు రావడంతో  సందర్భం అనిపించి ఈ విషయాన్ని చెబుతున్నాను అని శేఖర్‌ భాషా అన్నారు.

‘జయం సినిమాలో ప్రత్యూషను హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్లు కొద్దిరోజుల క్రితం ఆమె తల్లి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.  తేజ గారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ రావడంతో వారి ఆఫీస్‌కెళ్లి వస్తానని చెప్పి ఆమె తిరిగి రాలేదని కూడా తెలిపింది. ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డితో ఆమె వెళ్లడం, అనుమాస్పదంగా మరణించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement