సమంత.. టాలీవుడ్‌లో ఈ పేరు వినిపించి చాలాకాలమైపోయింది. ఆరేడేళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసి హీరోయిన్‌గా స్టార్‌డమ్ అనుభవించిన ఈమె.. నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం, మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటంతో పూర్తిగా మూవీస్ చేయడం తగ్గించేసింది. మూడేళ్ల క్రితం అంటే 2023లో విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' చేసింది. ఇదేం పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు పోస్ట్ పెట్టింది.
నటిగా అలరించిన సమంత.. ట్రలాలా పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించింది. 'శుభం' అనే సినిమాతో గతేడాది ప్రేక్షకుల్ని పలకరించింది. ఇది ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈమెనే నిర్మాత కమ్ లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'.. థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ చిత్రం ఒకటుందని ఆడియెన్స్‌కి గుర్తులేదు. అలాంటిది ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించి అందరికీ సామ్.. సర్‌ప్రైజ్ ఇచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. పాతిరాత్రి రివ్యూ)
నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత చాన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న సామ్.. 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్లలో ఒకటైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు. అయితే గతేడాది వీళ్ల ప్రేమ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సామ్ ఏమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో అనుకుంటే.. 'మా ఇంటి బంగారం' సినిమాని రెడీ చేసింది.
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత.. ఓ సంప్రదాయ ఇల్లాలి పాత్రలో కనిపించనుంది. అలానే ఆపద వచ్చినప్పుడు యాక్షన్‌తో అదరగొట్టే పాత్రలోనూ కనిపించనుండటం విశేషం. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన టీజర్‌తో స్టోరీ ఏంటో చూచాయిగా క్లారిటీ వచ్చింది. ట్రైలర్ వస్తే అసలు కథేంటో తెలుస్తుంది. మరి ఈ మూవీతో సమంత కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి)


