హనుమాన్ మూవీ సీక్వెల్ 'జై హనుమాన్' ప్రారంభమైంది. చారిత్రాత్మక పట్టణం హంపిలో పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు నటుడు రిషభ్‌శెట్టి తన సతీమణి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి బెట్టలో లాంఛనంగా మూవీ పనులు మొదలయ్యాయి. 2024లో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని రూ. 300 కోట్లు రాబట్టింది.
ఇప్పుడు సీక్వెల్‌లో ఆంజనేయుడి పాత్రలో రిషభ్‌శెట్టి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. రామాయణంతో ముడిపడిన ఈ మైథలాజికల్ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిసింది.
అంజనాద్రి బెట్టలోనే పూజా కార్యక్రమం ఎందుకో తెలుసా..
'జై హనుమాన్' సినిమా పూర్తిగా ఆంజనేయుడి స్వామి చుట్టే తిరుగుతుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. అందుకే సెంటిమెంట్‌గా అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమంతో మూవీ చిత్రీకరణను ప్రారంభించారు. మన పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని హనుమంతుడి జన్మస్థలంగా నమ్ముతారు. హనుమంతుడు అంజనా దేవికి జన్మించారు. అందుకే ఈ ప్రాంతాన్ని అంజనాద్రి బెట్ట అని ఇప్పటికీ పిలుస్తారు. కొండ పైభాగంలో విశాలమైన హనుమాన్ ఆలయం ఉంది.
దాదాపు 575 మెట్లు దాటుకుని పైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో రాతితో చెక్కబడిన హనుమంతుడి విగ్రహం, కొద్ది సమీపంలో రాముడు, సీత మందిరాలు ఉన్నాయి. అక్కడే అంజనా దేవి ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశం పురాణాలలో కిష్కిందగా పిలువబడింది. ఈ కొండ హంపికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మీరు రాతి రథం, హనుమాన్ ఆలయం, యంత్ర హనుమాన్ ఆలయంతో పాటు రాముడు, హనుమంతుడు మొదటిసారి కలిసిన ప్రదేశం ఇలా ఎన్నో మరెన్నో చూడవచ్చు.
#rishabshetty #tejasajja at #JaiHanuman Pooja Ceremony 🎬 pic.twitter.com/eYdAg45iM5
— Rajesh Manne (@rajeshmanne1) February 22, 2026


