డ్రాగన్‌ సీక్వెల్‌? హింట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ | Is Ashwath Marimuthu Hints at Pradeep Ranganathan Dragon Sequel? | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బస్టర్‌ డ్రాగన్‌కు ఏడాది.. రెండోసారి వస్తామంటున్న డైరెక్టర్‌

Feb 22 2026 12:33 PM | Updated on Feb 22 2026 12:53 PM

Is Ashwath Marimuthu Hints at Pradeep Ranganathan Dragon Sequel?

దర్శకుడిగా, హీరోగా హిట్టయినవారిలో ప్రదీప్‌ రంగనాథన్‌ ఒకరు. కోమలి సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన ఇతడు లవ్‌ టుడేతో డైరెక్టర్‌ కమ్‌ హీరోగా భారీ సక్సెస్‌ కొట్టాడు. ఆ వెంటనే డ్రాగన్‌ సినిమా చేశాడు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 21న ఈ సినిమా వచ్చి ఏడాది అవుతోంది.

రెండోసారి తప్పక వస్తాం
ఈ సందర్భంగా అశ్వత్‌.. ప్రదీప్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. డ్రాగన్‌ చిత్రానికి ఏడాది. సెల్ఫ్‌ మేడ్‌ స్టార్‌ ప్రదీప్‌తో కలిసి పని చేసిన అనుభవాన్ని మర్చిపోలేను. ఇద్దరు స్నేహితులు కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో చూపించాం. మమ్మల్ని నమ్మినందుకు ఏజీఎస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌కు, మా టీమ్‌కు కృతజ్ఞతలు. మేము సెకండ్‌ టైమ్‌ తప్పకుండా వస్తాం అని రాసుకొచ్చాడు. 

సినిమా
దీంతో అభిమానులు డ్రాగన్‌ సీక్వెల్‌ ఉంటుందా? అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో డ్రాగన్‌ టీమ్‌ కాంబినేషన్‌లో ఒక కొత్త చిత్రం రాబోతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్‌ విషయానికి వస్తే.. ప్రదీప్‌ హీరోగా నటించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. ఈ చిత్రం తెలుగులో రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ పేరిట విడుదలై ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది.

 

 

చదవండి: సెట్‌లో అందరూ చూస్తుండగా.. : తాప్సీ

Advertisement
 
Advertisement
Advertisement