తలకిందులుగా వేలాడుతున్న ఈ హీరోని గుర్తుపట్టారా? | Do You Find Out This Hero, Who Hanging Upside Down In This Photo | Sakshi
Sakshi News home page

తలకిందులుగా వేలాడుతున్న ఈ హీరోని గుర్తుపట్టారా?

Feb 22 2026 11:14 AM | Updated on Feb 22 2026 11:29 AM

Do You Find Out This Hero, Who Hanging Upside Down In This Photo

పైన ఫోటోలో తలక్రిందుగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైన నటుడు. కేవలం నటనతోనే కాదు, క్రమశిక్షణతో కూడిన ఫిట్‌నెస్‌తో కుర్రకారుకు ఇన్పిరేషన్‌గా నిలుస్తుంటారు. ఆయనే మాస్‌ హీరో విశాల్‌. ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం రాజీపడని ఈ హీరో, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా డెంగ్యూ బారిన పడటం, షూటింగ్స్ ఒత్తిడి వల్ల కొన్నాళ్ల పాటు వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ జిమ్‌లోకి అడుగుపెట్టారు.

తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన జిమ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శరీరాన్ని దృఢంగా మార్చుకుంటూ, పాత 'పందెంకోడి' లుక్‌ను గుర్తుచేస్తున్నారు. ఈ మార్పు కేవలం ఆరోగ్యం కోసమే కాదు, తన తదుపరి ప్రాజెక్టుల కోసం కూడా అని తెలుస్తోంది.

ప్రస్తుతం విశాల్ తన 36వ చిత్రంలో బిజీగా ఉన్నారు. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో 'మొగుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మగ మహారాజు', 'యాక్షన్' సినిమాల తరహాలోనే ఇది కూడా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement