మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నా: రకుల్ ప్రీత్ సింగ్‌ | Rakul Preet Singh wishes To husband Jacky Bhagnani on Marriage day | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నా: రకుల్ ప్రీత్ సింగ్‌

Feb 22 2026 11:08 AM | Updated on Feb 22 2026 11:27 AM

Rakul Preet Singh wishes To husband Jacky Bhagnani on Marriage day

పద్దెనిమిది ఏళ్లకే కన్నడ సినిమా గిల్లి ద్వారా ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్‌ చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్ సరసన ధృవ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా కన్నడ, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.

సినిమాలతో బిజీగా ఉండగానే 2024లో తను ప్రేమించిన జాక్కీ భగ్నానీని పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్‌గా జరిగింది. తాజాగా వీరి పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో భర్తకు విషెస్ తెలిపింది ముద్దుగుమ్మ. తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది.  నేను కలలు కన్నదంతా నీకోసమేనని ట్వీట్‌లో రాసుకొచ్చింది. తన భర్తకు శుభాకాంక్షలు చెబుతూ పెళ్లి వీడియోను షేర్ చేసింది. 

రకుల్ తన ట్వీట్‌లో రాస్తూ..'నా జీవిత భాగస్వామికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను కలలు కన్నది నీకోసమే. నీతో ఉండటం నాకు ఒక ఇల్లులా అనిపిస్తుంది. నువ్వే నా ఓదార్పు, నా ప్రాణ స్నేహితుడు.. నాకు తెలిసిన అత్యంత సున్నితమైన వ్యక్తి. నువ్వు చూపించే ఉత్సాహం, అభిరుచి గురించి నేను చాలా గర్వపడుతున్నా. నీ దయ, బలం ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తాయి. నా జీవితాన్ని నవ్వు, ప్రేమ, సాహసంతో నింపినందుకు ధన్యవాదాలు. ఇంకా చాలా సంవత్సరాలు కలిసి అందమైన జ్ఞాపకాలను మనం సృష్టించుకోవాలి. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు మ్యారేజ్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది దేదే ప్యార్ దే-2, మేరే హస్బెండ్‌ కీ బీవీ చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం రామాయణ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement