Tamil actor
-
రెండు నెలలుగా ఆస్పత్రిలో.. కన్నుమూసిన నటుడు
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు జయశీలన్ (40) అనారోగ్యంతో మరణించారు. రెండు నెలల క్రితం కామెర్ల వ్యాధితో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జయశీలన్.. విజయ్‌తో బిగిల్, తేరి, ధనుష్‌తో పుదుపేట్టై, విజయ్ సేతుపతితో విక్రమ్ వేద సినిమాల్లో నటించారు.తన కెరీర్లో వందకు పైగా సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలన్న కోరికతో చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పోయారు. కానీ ఆయన టాలెంట్‌కు తగ్గ గుర్తింపు రాలేదు. ఈయన విజయ్ సేతుపతికి మంచి స్నేహితుడని తెలుస్తోంది.చదవండి: హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్ -
ప్రముఖ నటుడికి బ్రెయిన్ సర్జరీ
ప్రముఖ నటుడు ప్రభు గణేశన్ (Prabhu Ganesan)కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అతడి సర్జరీ విజయవంతమవగా, ప్రస్తుతం తనను డిశ్చార్జి చేశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని అతడి టీమ్ వెల్లడించింది. జ్వరం, తలనొప్పితో ప్రభు ఆస్పత్రిలో చేరాడు. మెదడులో వాపుఆయన్ను పరిశీలించిన వైద్యులు మెదడులోని రక్తనాళంలో వాపు ఉన్నట్లు గర్తించారు. దీంతో చిన్నపాటి సర్జరీ చేశారు. లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ తనయుడే ప్రభు. చిన్న తంబి, మనసుక్కుల్ మతప్పు, అగ్ని నక్షత్రం, అరువడై నాళ్, చార్లీ చాప్లిన్ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించాడు. తెలుగువారికీ సుపరిచితుడేచంద్రముఖి, డార్లింగ్, ఆరెంజ్, దరువు, ఒంగోలు గిత్త, దేనికైనా రెడీ, పొన్నియన్ సెల్వన్, వారసుడు వంటి చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. దాదాపు 200 సినిమాలు చేసిన ఈయన ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా (Good Bad Ugly) చేస్తున్నాడు. అజిత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో త్రిష కథానాయికగా యాక్ట్ చేస్తోంది.చదవండి: నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ -
సింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరో
తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయరామ్ కొడుకు కాళిదాస్ పెళ్లి జరిగింది. తమిళంలో హీరోగా, నటుడిగా పేరు తెచ్చుకున్న ఇతడు.. గత కొన్నాళ్లుగా తరణి అనే మోడల్ని ప్రేమిస్తున్నాడు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఒక్కటయ్యారు. కేరళలలోని గురవాయూర్ ఆలయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆదివారం ఉదయం సింపుల్‌గా పెళ్లి జరిగిపోయింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా)'అల వైకుంఠపురములో', 'గుంటూరు కారం' తదితర చిత్రాల్లో నటించిన జయరామ్ కొడుకు కాళిదాస్ జయరామ్ కూడా నటుడే. రీసెంట్గా ధనుష్ తీసిన 'రాయన్' మూవీలో కీలక పాత్రలో కాళిదాస్ నటించాడు. అప్పుడప్పుడు హీరోగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. గత కొన్నిరోజులు తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉన్నాడు.గురువారం సాయంత్రం చైన్నెలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు హాజరవ్వడం విశేషం. ఇక కాళిదాస్ పెళ్లాడిన తరణి విషయానికొస్తే.. స్వతహాగా మోడల్ అయిన ఈమె ఫ్యాషన్ షోలు, యాడ్స్ చేస్తోంది. మిస్ తమిళనాడు, మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?) -
ఢిల్లీ గణేష్ కన్నుమూత
సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ (80) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యం కారణంగా శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నై రామాపురంలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1964–74 మధ్య కాలంలో ఇండియ¯Œ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు ఢిల్లీ గణేష్. కళలపై ఉన్న ఆసక్తితో ఢిల్లీకి చెందిన దక్షిణ భారత నాటక సభలో సభ్యుడిగా చేరారు. అనంతరం సినీ రంగ ప్రవేశం చేశారు.కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘పట్టణ ప్రవేశం’(1976) చిత్రం ద్వారా నటుడుగా పరిచయమయ్యారాయన. ‘ఎంగమ్మ మహారాణి’ అనే మూవీలో హీరోగా నటించారు కూడా. తమిళంతో పాటు తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో సహాయ నటుడిగా, హాస్యనటుడిగా దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. అలాగే పలు సీరియల్స్‌లోనూ, కొన్ని వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఆయన మంచి నటుడే కాదు.. డబ్బింగ్ కళాకారుడు కూడా. పలువురు ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు.ఢిల్లీ గణేశ్ తెలుగులో ‘జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమి నాగు’ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నేడు(సోమవారం) ఉదయం 10 గంటలకు చెన్నైలో ఢిల్లీ గణేశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు మాధవన్ గణేష్ తెలిపారు. -
తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత
-
ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ (80) కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించారు. వీటితో పాటు తమిళ సీరియల్స్, వెబ్ సిరీసుల్లోనూ నటించారు. అయితే గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో శనివారం రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)ఢిల్లీ గణేశ్ మృతితో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈయన కమల్ హాసన్ 'భారతీయుడు 2' మూవీలో కనిపించారు. అంతకు ముందు తెలుగులో ఈయన 'జైత్రయాత్ర', 'నాయుడమ్మ', 'పున్నమినాగు' తదితర సినిమాల్లో నటించారు. షారుఖ్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్', సూర్య 'వీడొక్కడే', లారెన్స్ 'కాంచన 3' లాంటి డబ్బింగ్ చిత్రాల్లో ఈయన మీకు కనిపించే ఉంటారు.1976లో ప్రారంభమైన ఢిల్లీ గణేశ్ సినీ ప్రస్థానం.. ఈ ఏడాది వరకు కొనసాగింది. సినిమా ఇండస్ట్రీ రాకముందు ఈయన భారత వైమానిక దళంలోనూ పనిచేశారు. మొదటి సినిమా కె.బాలచందర్ దర్శకత్వంలో పట్టిన ప్రవేశం (1977)లో నటించారు. 1994 కలైమామణి అవార్డును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు అందించింది. (ఇదీ చదవండి: OTT Review: గల్లీ ప్రేమను సింపుల్‌గా గెలిపించిన క్రికెట్) -
24 ఏళ్ల తర్వాత కలిసిన హీరోహీరోయిన్
రొమాంటిక్ సినిమాల్లో 'సఖి' క్రేజ్ వేరే లెవల్. పేరుకే డబ్బింగ్ సినిమా గానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన మాధవన్, షాలినీకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది దాదాపు 24 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)సందర్భంగా ఏంటో తెలీదు గానీ మాధవన్‌ని చాన్నాళ్ల తర్వాత కలిసి షాలినీ.. రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. దీనికి 'ఎండ్రెండుం పున్నాగై' అని క్యాప్షన్ పెట్టింది. 'ఎప్పటికీ నవ్వడం' అని తెలుగులో దీనికి అర్థం. తమ అభిమాన జోడీని దాదాపు 24 ఏళ్ల తర్వాత చూసిన ఫ్యాన్స్.. సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నారు. కామెంట్స్ పెడుతూ తమ ప్రేమని చూపిస్తున్నారు.ఇక మాధవన్ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉండగా.. షాలినీ తమిళ హీరో అజిత్ ని 2000లో పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు) View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
ఓటీటీకి సరికొత్త థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
సరికొత్త కంటెంట్‌తో ఓటీటీలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఏ భాషలో తెరకెక్కినా సరే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే మంచి కంటెంట్‌ను అందిస్తున్నారు. తాజాగా తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్.ఈ ఏడాది మార్చిలో ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌ను ప్రకటించారు. ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో నటించారు. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేస్తూ ట్వీట్ చేసింది.తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు. Roll the dice and accept your fate 🐍🪜#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 pic.twitter.com/dFi8ZVCbt7— prime video IN (@PrimeVideoIN) October 7, 2024 -
సతీమణి ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన హీరో జయం రవి (ఫోటోలు)
-
సినిమా ఇంటర్వ్యూ.. ప్రముఖ హీరోకి ఫైన్ వేసిన పోలీసులు
ప్రముఖ హీరోకి జరిమానా పడింది. కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఊహించని విధంగా పోలీసులకు ఇతడు చిక్కాడు. దీంతో ఫైన్ వేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసుకోవాలి కదా బ్రో అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: Kalki 2898 AD: గుడ్ న్యూస్.. చవక రేటుకే కల్కి టికెట్స్)'జీన్స్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో ప్రశాంత్.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయాడు. తెలుగులో 'వినయ విధేయ రామ' చిత్రంలో సహాయ పాత్ర చేశాడు. ప్రస్తుతం విజయ్ 'ద గోట్' మూవీలోనూ కీ రోల్ చేశాడు. ఇది కాకుండా 'అంధగన్' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇది ఆగస్టు 9న థియేటర్లలోకి రానుంది.ఈ క్రమంలోనే బైక్‌పై చెన్నై రోడ్లపై తిరుగుతూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో చెన్నై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. రూ.2000 చలాన్ వేసినట్లు ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన 'అంధాదున్' సినిమాకి ఇది రీమేక్. తెలుగులోనూ నితిన్ హీరోగా దీన్ని చాన్నాళ్ల క్రితమే రీమేక్ చేశారు. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్‌నే బెస్ట్: కీర్తి సురేశ్)#ActionTaken on reported violation.#GreaterChennaiTraffic https://t.co/bAZecvNYgn pic.twitter.com/TqJVoLi9MT— Greater Chennai Traffic Police (@ChennaiTraffic) August 1, 2024 -
ప్రియురాలితో సింపుల్‌గా నటుడి ఎంగేజ్మెంట్
తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు ప్రదీప్ ఆంటోని పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రియురాలితో ఏడడుగులు వేయనున్నాడు. ఈ మేరకు ఆదివారం (జూన్ 16న) అతడి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రదీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా ప్రదీప్ ఆంటోని తమిళ బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో పాపులర్ అయ్యాడు. ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అయితే ఆ ధోరణి చాలామందికి నచ్చేది కాదు. తన కుళ్లు జోకులు కూడా బిగ్‌బాస్ హౌస్‌లో కొందరు ఇష్టపడలేదు. అసభ్య జోకులు వేస్తున్నాడని, బూతులు మాట్లాడుతున్నాడని, తన ప్రవర్తన బాగోలేదని మాయ, పూర్ణిమ, జోవిక, నిక్సెన్, కూల్ సురేశ్, శరవణ విక్రమ్, అక్షయ వంటి పలువురు కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ హాసన్ రెడ్ కార్డు చూపించి తనను బయటకు పంపించేశారు. సినిమాల విషయానికి వస్తే దాదా, అరువి, వాళ్ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. Got engaged, yesterday 🙏 #FamilyMan#EnakulaamNadakathuNuNinaichen #ParavaillaPonnuKudukurangaEnnaNambi#90sKidsSaadhanaigal pic.twitter.com/vyg0DuCnaQ— Pradeep Antony (@TheDhaadiBoy) June 17, 2024 చదవండి: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్ -
అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి
చెన్నై: తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్ 12న) విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతడి స్నేహితుడు ఫోన్ చేస్తుండగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ప్రదీప్ ఇంటికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. గుండెపోటు వల్లే నటుడు మరణించాడని భావిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా ప్రదీప్.. తెగిడి అనే సినిమాతో పాపులర్ అయ్యారు. విలన్‌గా, కమెడియన్‌గా పలు సినిమాలు చేశారు. టెడ్డీ, ఇరుంబు తిరై, తమిళుకు ఎన్ ఒండ్రై అళతువం, లిఫ్ట్, మనం, కెన్నడీ క్లబ్, ఆడై.. ఇలా అనేక తమిళ చిత్రాల్లో నటించారు. చివరగా రాఘవ లారెన్స్ 'రుద్రన్' సినిమాలో కనిపించారు.చదవండి: అది చూసే ప్రేమలో పడ్డా.. పెళ్లనగానే రిజెక్ట్.. ఎందుకంటే?: నటుడు -
గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ప్రముఖ తమిళ దర్శకుడు గంగై అమరన్ రెండో కుమారుడు, నటుడు ప్రేమ్‌జీ 45 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కాడు. తిరుత్తణి మురుగన్ సాక్షిగా తన ప్రేమికురాలు ఇందు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం (జూన్ 9న) నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ప్రేమ్‌జీ.. సేలం నగరానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ఇందును కొన్నేళ్లగా ప్రేమిస్తూ వచ్చాడు. గుడిలో సింపుల్‌గా పెళ్లివీరి ప్రేమకు ఇరుకుటుంబాలు పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు తమిళనాడు తిరువళ్లూరులోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ తారలు రావడంతో తిరుత్తణి ఆలయంలో సందడి నెలకొంది. వారిని చూసేందుకు, సెల్పీ దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గంగై అమవరన్, అతడి పెద్ద కుమారుడు, సినీ దర్శకుడు వెంకట్‌ప్రభు సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. కమెడియన్ ప్రేమ్‌జీ పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపీటలపై ప్రియురాలికి ముద్దుతన ప్రేమికురాలు జీవిత భాగస్వామి కావడంతో ప్రేమ్‌జీ పెళ్లిపీటలపైనే ఇందును ముద్దాడి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అనంతరం నూతన దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. వివాహ వేడుకల్లో సినీ నటులు శివ, జయ్, వైభవ్, సంతాన భారతి, కార్తీక్‌రాజ, సంగీత, గాయకులు ఎస్పీబీ. చరణ్, క్రిష్ సహా ప్రముఖులు పాల్గొన్నారు.చదవండి: కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్.. నిజమేనా? -
Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్ (ఫోటోలు)
-
పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
ప్రముఖ కమెడియన్ కమ్ మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్గీ పెళ్లి చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయితో ఏడడుగులు వేశాడు. జూన్ 9న తిరుత్తణి గుడిలో పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రేమ్ గీ సోదరుడు, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు బయటపెట్టాడు. తన ఇన్ స్టాలో కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: బాలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో కలిసి!)తమిళ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభుకి సోదరుడే ప్రేమ్ గీ. ఇతడి ప్రస్తుత వయసు 45 ఏళ్లు. కానీ ఇన్నాళ్లు ఒంటరిగానే ఉన్నాడు. అలాంటిది కొన్నాళ్ల ముందు ప్రేమ్ గీ పెళ్లి చేసుకోబోతున్నాడని న్యూస్ వచ్చింది. చాలామంది దీన్ని రూమర్ ఏమో అనుకున్నారు. కానీ వెడ్డింగ్ కార్డ్ బయటకొచ్చేసరికి నిజమని తేలింది. అమ్మాయి పేరు ఇందు అని తప్పితే ఇంకే వివరాలు ప్రస్తుతానికైతే లేదు. తాజాగా జరిగిన పెళ్లి వేడుకకు యువ హీరోలు జై, వైభవ్ తదితరులు హాజరయ్యారు. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Vaibhav Reddy (@vaibhav30) View this post on Instagram A post shared by Venkat Prabhu (@venkat_prabhu) -
45 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కనున్న నటుడు! వచ్చే వారమే ముహూర్తం!
నటుడు, సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటిదాకా సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన ఈయన 45 ఏళ్ల వయసులో మ్యారీడ్ లైఫ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇందు అనే అమ్మాయి మెడలో ప్రేమ్‌జీ మూడు ముళ్లు వేయనున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా పెళ్లిరోజు ఇదేనంటూ ఓ వివాహ పత్రిక నెట్టింట ప్రత్యక్షమైంది. ఆరోజే పెళ్లిఇందులో జూన్ 9న తమిళనాడు రాష్ట్రంలో తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తని మురుగన్ ఆలయంలో వివాహం జరగనున్నట్లు రాసి ఉంది. ఇది చూసిన అభిమానులు ఇప్పుడైనా పెళ్లి గురించి ఆలోచించినందుకు సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది నిజంగా అతడి పెళ్లి కార్డేనా? లేదంటే అతడి సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ స్టంటా? అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాదే పెళ్లిప్రేమ్జీ ఫ్యాన్స్ మాత్రం ఇది నిజమేనని ధృవీకరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నానని నటుడే స్వయంగా జనవరిలో చేసిన ఓ పోస్టులో వెల్లడించాడు. ప్రేమ్‌జీ సినిమాల విషయానికి వస్తే అతడి సోదరుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో ప్రేమ్‌జీ ఉన్నాడు. కస్టడీ, ప్రిన్స్ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. Happy new year. This year I am getting married. Dot.— PREMGI (@Premgiamaren) January 1, 2024 చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
ఆయన సలహాతో ఇద్దరి హీరోల సినిమాలు ఫ్లాప్.. అందుకే..
నేనుగా వెళ్లి ఎవరిని అవకాశాలు అడగలేదంటున్నారు నటుడు రామరాజన్. 1980 ప్రాంతంలో టాప్ హీరోగా వెలిగారు. ముఖ్యంగా గ్రామీణ కథా పాత్రల్లో అధికంగా నటించారు. అంతే కాకుండా 44 చిత్రాల్లో సింగిల్ హీరోగా నటించిందీ రామరాజనే. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్‌కు ధీటుగా రాణించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీరాభిమాని అయిన రామరాజన్ రాజకీయ రంగప్రవేశం కూడా చేశారు. ఆ తరువాత కొంత కాలం సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన రామరాజన్ సుమారు 14 ఏళ్ల తరువాత సామాన్యన్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.నటనకు దూరం కానుఎంఎస్.భాస్కర్, రాధారవి, దర్శకుడు కేఎస్.రవికుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రాకేశ్ దర్శకత్వంలో ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై మదియళగన్ నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో చిత్రం యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో పాల్గొన్న నటుడు రామరాజన్ మాట్లాడుతూ తాను నటనకు దూరం కాదలచుకోలేదన్నారు. చాలా కథలు వింటున్నప్పటికీ ఏవీ సెట్ కాలేదన్నారు. ఫలానా హీరోలా నటించమని..తాను నటించిన గరగాట్టక్కారన్ చిత్రాన్ని చూస్తే శివాజీగణేశన్ నటించిన తిల్లానా మోహనాంబాళ్ చిత్రమే గుర్తుకు వస్తుందన్నారు. ఆ చిత్రంలో శివాజీగణేశన్‌కు బదులు ఎంజీఆర్ నటిస్తే ఎలా సెట్ అవుతుందని ప్రశ్నించారు. అప్పట్లో ఒక డిస్ట్రిబ్యూటర్ శివాజీ గణేశన్‌తో ఎంజీఆర్‌లా నటించాలని, ఎంజీఆర్‌తో శివాజీగణేశన్ మాదిరి నటించాలని కోరారన్నారు. అలా ప్రయత్నించి చూద్దామని ఎంజీఆర్ నటించిన పాశం, శివాజీగణేశన్ నటించిన తంగ సురంగం చిత్రాలు రెండూ ప్లాప్ అయ్యాయన్నారు. రెండూ ఫ్లాపయ్యాయిదీంతో ఆ రెండు చిత్రాల దర్శకుడు రామన్న ఆ ఇద్దరు హీరోలతో మీరు మీరుగానే నటించండి అని చెప్పారన్నారు. కాబట్టి ఎలాంటి పాత్ర చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో అలాంటి పాత్రల్లోనే తాను నటిస్తున్నానని చెప్పారు. ప్రారంభం నుంచి తాను కథ నచ్చితేనే నటిస్తున్నానని చెప్పారు. తానిప్పటి వరకూ అవకాశాల కోసం ఎవరిని అడగలేదన్నారు. మరో విషయం ఏమిటంటే తాను నటించింది 1986 నుంచీ 1990 వరకేనని, అయితే ఇప్పటి వరకూ ప్రేక్షకుల మనసులో నిలిచిపోవడానికి కారణం సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలేనని రామరాజన్ పేర్కొన్నారు.చదవండి: షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ దద్లానీ చేసిన పోస్ట్ వైరల్ -
12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. అది కూడా హీరోగా!
సినిమాలకు, రాజకీయాలకు అత్యంత సుపరిచితుడు రామరాజన్. దాదాపు 44 చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సక్సెస్ఫుల్ నటుడీయన. పలు చిత్రాలకు దర్శకత్వం సైతం వహించిన ఈయన రాజకీయ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీర విధేయుడు రామరాజన్. కాగా సినీ, రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన గతంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. దాని నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. పద్నాలుగేళ్ల తర్వాత..సుమారు 14 ఏళ్ల తర్వాత రామరాజన్ మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అదీ కథానాయకుడిగా! అలా ఆయన నటించిన చిత్రం సామానియన్. ఎక్సట్రా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మదియళగన్ నిర్మించిన ఇందులో రాధారవి, ఎంఎస్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 23వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.హీరోయిన్ లేదుఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మీడియాతో ముచ్చటించింది. రామరాజన్ మాట్లాడుతూ సామానియన్ చిత్రంలో నటించడానికి ముఖ్య కారణం కథ అన్నారు. దర్శకుడు రాకేష్ చెప్పిన కథ నచ్చిందన్నారు. ఈ చిత్రంలో తనకు హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరన్నారు. ఒక సగటు సామాన్యుని కోపమే ఈ చిత్రమని చెప్పారు. మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన, లేదని సినిమాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కొన్ని కథలను వింటున్నానని వాటికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.చదవండి: ప్రభాస్ నుంచి త్వరలో గుడ్ న్యూస్.. ఏమై ఉండొచ్చు? -
ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం
ప్రముఖ తమిళ హాస్య నటుడు అప్పుకుట్టి మంచి మనసు చాటుకున్నాడు. తాను చదివిన పాఠశాలకు రూ.11 లక్షలు విరాళం ఇచ్చి, తన ఔదార్యం చాటుకున్నాడు. అప్పుకుట్టి స్వస్థలం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నాథన్ కినరు. ఆ ప్రాంతంలోని ముత్తారమ్మన్ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు అప్పుకుట్టి వెళ్లాడు. వేడుకల సందర్భంగా నాథన్ కినేరులోని తాను చదువుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)గ్రామ ప్రజల కోరిక మేరకు అప్పుకుట్టి.. రూ.11 లక్షల ఖర్చుతో టేబుల్, కంప్యూటర్, టీవీ విద్యుత్ ఫ్యాన్లు, తదితర వస్తువులను కొని ఇచ్చాడు. దీని గురించి అప్పుకుట్టి మాట్లాడాడు. ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాను ఒకటి, రెండు తరగతులు చదివానని, అయితే ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతో చదివే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉందన్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు అవసరమైన సామగ్రి అందించానని అన్నాడు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుకుట్టి కోరాడు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనం ఊరి బయట ఉన్నా, ఏడాదికి కొన్ని రోజులు ఊరిలోనే నివాసం ఉండాలని అప్పుకుట్టి తన అభిప్రాయం వెలిబుచ్చారు.(ఇదీ చదవండి: AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!) -
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
కాలం వేగంగా పరిగెడుతోంది. ఒకప్పుడు వెండితెరపై వెలుగులు పంచిన ఎందరో తారలు తర్వాతి కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కమెడియన్ జనగరాజ్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. అప్పట్లో తమిళ చిత్రపరిశ్రమలో సెంథిల్, గౌడమణి తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పంచింది ఈయనే!కామెడీ రోల్స్‌తో..మొదట్లో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. అందులో క్లిక్కవడంతో జనగరాజ్‌కు నటుడిగా అవకాశాలు వచ్చాయి. విలనిజం పండే పాత్రలు చేశాడు. కామెడీ రోల్స్‌తోనూ అదరగొట్టాడు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో కామెడీ సీన్లలో పోటీపడి నటించేవాడు. అప్పట్లో ఏడాదికి 15-20 సినిమాలు చేశాడు. జెట్ స్పీడులో మూవీస్ చేసిన ఆయన 2000వ సంవత్సరంలో అడుగుపెట్టేసరికి కాస్త స్లో అయ్యాడు.ఇండస్ట్రీకి దూరంతెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించాడు. దాడి చిత్రంలోనూ యాక్ట్ చేశాడు. నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ పోయి తర్వాత ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయాడు. దీంతో అతడు అమెరికా వెళ్లి సెటిలైపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత విజయ్ సేతుపతి 96 మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తాత అనే షార్ట్ ఫిలింలో నటించాడు.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడుఈ షార్ట్ ఫిలింలో అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అలాగే అతడి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నటుడు బక్కచిక్కిపోయి ఉన్నాడు. వయసు 68 ఏళ్లు కావడంతో వృద్ధాప్య చాయలు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నటుడి ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడేంటి? ఇలా అయిపోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: భర్తతో విడిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఒంటరినే అంటూ పోస్ట్ -
పెళ్లి చేసుకున్న నటుడు.. వధువుపై ట్రోలింగ్
పెళ్లి అనేది రెండు మనసులను ఒక్కటి చేసే తంతు. రెండు కుటుంబాలను కలిపే గొప్ప ప్రక్రియ. ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి వారు తమ భాగస్వాములను ఎంచుకుంటారు. జీవితాంతం వారితో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. అయితే పెళ్లి చేసుకునేవాళ్లు బాగానే ఉన్నా జనాలు మాత్రం కొన్నిసార్లు ఆ జంటను విమర్శిస్తూ ఉంటారు. దంపతుల్లో ఒకరి ఎత్తు తక్కువైందనో, లావుగా ఉన్నారనో, రంగు లేదనో.. జోడీ బాలేదంటూ నోటికొచ్చింది అనేస్తుంటారు. ప్రియురాలి మెడలో తాళి కట్టిన నటుడు కన్నడ నటుడు విరాట్ విషయంలోనూ అదే జరిగింది. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన ఇతడు తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యాడు. తమిళంలో పలు సీరియల్స్ చేశాడు. అలాగే రియాలిటీ షోలలో పాల్గొంటున్నాడు. ఏప్రిల్ 18న అతడు తన ప్రేయసి నవీన మెడలో మూడుముళ్లు వేశాడు. ఈమె సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. పలువురు నటీనటుల దగ్గర మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసింది. గురువారంనాడు తమిళనాడులోని మహాబలిపురంలో వీరి వివాహం జరిగింది. పుట్టినింటికి దూరమవుతానన్న బాధతో పెళ్లిపీటలపైనే నూతన వధువు కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమెను ఓదార్చుతూ నటుడు తనకు ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. పెళ్లికూతురిపై ట్రోలింగ్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు విరాట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి బాగోలేదని, ఆంటీలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇద్దరూ అబ్బాయిల్లాగే ఉన్నారు.. ఆమె గుండమ్మలా ఉందని బాడీ షేమింగ్ చేస్తున్నారు. శుభమా అని పెళ్లి చేసుకున్న కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి ఇలా ఎందుకు తిడుతున్నారని నటుడి అభిమానులు మండిపడుతున్నారు. చదవండి: సినిమా కోసం తిరిగి పర్సు ఖాళీ.. అప్పుడు భార్యే..! -
ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన నటుడు
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ చాలామంది పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్టపడతారు. కొందరు మాత్రమే గుప్తదానాలు చేస్తుంటారు. అలాంటివారిలో నటుడు డేనియల్ ఒకరు. ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా చేయి చాచి అడిగితే చాలు క్షణం ఆలోచించకుండా సాయం చేసేవారు. తను కూడబెట్టిన డబ్బునంతా ఓ గుడి కట్టేందుకు ఉపయోగించారు. తనకంటూ పెద్దగా ఆస్తులు వెనకేసుకోలేదు. రియల్ హీరో.. సినిమాల్లో విలన్‌గా నటించినా నిజ జీవితంలో మాత్రం హీరోగా బతికారు. ఇంకా ఎంతో జీవితం చూడాల్సిన వ్యక్తి శుక్రవారం (మార్చి 29) గుండెపోటుతో కన్నుమూశారు. అతడి మరణం తమిళ చిత్రపరిశ్రమను కుదిపేసింది. నటుడి కెరీర్ విషయానికి వస్తే.. చిట్టి అనే సీరియల్‌తో తన నటప్రస్థానం మొదలైంది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. స్క్రీన్‌పై విలనిజం పండించే ఈయనకు మనసులో ఎప్పుడూ ఓ కోరిక మెదులుతూ ఉండేది. తనకు డైరెక్షన్ అంటే ఇష్టం. ఆ కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాడని అంటుంటారు. 2014లో తమిళంలో ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఆ కోరిక తీరకుండానే.. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. 'స్క్రిప్ట్ రెడీ అయింది. దీన్ని డైరెక్ట్ చేయడంతోపాటు ఓ ముఖ్య పాత్రలో నేను నటించాలనుకుంటున్నాను. వీలు కుదిరితే తమిళంతోపాటు కన్నడ భాషలోనూ ఒకేసారి రూపొందించాలని చూస్తున్నాను. ఈ మూవీకి నా స్నేహితుడు ఎమ్ఆర్ గణేశ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు' అని చెప్పారు. ఎందుకోగానీ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. డైరెక్టర్ అవ్వాలన్న కోరిక తీరకుండానే ఆయన ప్రాణాలు విడిచారు. డేనియల్.. సాంబ, ఘర్షణ,చిరుత, టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. చదవండి: ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత -
కొత్త బిజినెస్.. ఫ్రెండ్‌కు అప్పజెప్పిన నటుడు.. అంతేకాదు!
సినిమా రంగంలో నిజమైన మిత్రులు కొందరే ఉంటారు. నటుడు గంజాకరుప్పు, గీత రచయిత జయంకొండాన్ ఆ కోవలోకే వస్తారు. గంజాకరుప్పు ఎన్నో చిత్రాల్లో హాస్యపాత్రల్లో ప్రేక్షకులను నవ్వించడంతోపాటు, కథానాయకుడిగా, నిర్మాతగానూ చిత్రాలు చేశారు. ప్రస్తుతం నటనపైనే దృష్టి సారిస్తున్న ఈయన కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. 20 ఏళ్లుగా మంచి ఫ్రెండ్స్ గీత రచయిత జయంకొండాన్.. వేటప్పన్, ఇంద్రసేనా, ఓడుం మేఘంగళ్, ఒరు సంధిప్పిల్, సొక్కు సుందరం తదితర చిత్రాలకు పాటలను రాసి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలకు గేయరచయితగా పని చేస్తున్న ఈయన స్థానిక కేకే.నగర్లో కవింజర్ కిచెన్ పేరుతో హోటల్ నడుపుతున్నారు. గంజాకరుప్పు, జయంకొండాన్లు 20 ఏళ్లుగా మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. ఫ్రెండ్‌కు పెళ్లి చేసే బాధ్యత కూడా! తాజాగా గంజాకరుప్పు త్వరలో ఊరంపాక్కమ్లో ప్రారంభించనున్న హోటల్ నిర్వహణ బాధ్యతలను గీత రచయిత జయంకొండాన్కు అప్పగించనున్నారు. అంతేకాదు ఇంకా అవివాహితుడిగా ఉన్న తన మిత్రుడికి పెళ్లి చేసే బాధ్యతలను తీసుకున్నారు. ఇందుకోసం డాక్టర్ చదివిన యువతిని వెతికే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో స్నేహమంటే వీరిదే.. అని కోలీవుడ్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. కాగా నటుడు గంజాకరుప్పు భార్య కూడా వైద్యురాలు అన్న విషయం తెలిసిందే. చదవండి: ముగ్గురు కుమార్తెలతో భారమైన జీవితం.. లారెన్స్ సాయం.. వీడియో వైరల్ -
Daniel Balaji Photos: గుండెపోటుతో నటుడి హఠాన్మరణం.. డేనియల్ బాలాజీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
హీరో అజిత్ కుమార్ బాధపడుతోంది ఈ వ్యాధితోనే..!
ఇటీవల తమిళ హీరో అజిత్ కుమార్ చెకప్ కోసం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏమైందంటూ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై అజిత్ పీఏ సురేశ్‌చంద్ర స్పందించి వివరణ ఇచ్చారు. సాధారణ వైద్య పరీక్షల కోసం అజిత్ ఆస్పత్రిలో చేరారని, ఆయనకు చెవి వెనుక ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పుకొచ్చారు. అయితే వైద్య నటుడు అజిత్ కుమార్ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్తో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అసలేంటీ ఈ వ్యాధి? ఎందువల్ల వస్తుందంటే.. ఈ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్ని వైద్యపరంగా ఇస్కీమిక్గా స్ట్రోక్ అని పిలుస్తారు. తగినంత ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల మెదడు కణజాలం దెబ్బతినండంతో ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. మెదడులోని ధమని బ్లాక్ అయినప్పుడు లేదా చిట్లినప్పుడూ ఈ సమస్య తలెత్తుంది. ఇది మెదడుకు సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని నరాలు వాపుకి దారితీయడంతో ఇదంతా జరుగుతుంది. దీంతో రోగికి పక్షవాతం రావడం లేదా కొన్ని సమయాల్లో సీరియస్ అయ్యి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రోగికి తక్షణమే చికిత్స అందడం అనేది అత్యంత ముఖ్యం. ఈ వ్యాధి లక్షణాలు.. వికారం లేదా వాంతులు కంటి కదలికలో సమస్యలు, సరిగా కనిపించకపోవడం తలనొప్పి మాట్లాడడంలో ఇబ్బంది చేతులు, పాదాలు లేదా ముఖంలో తిమ్మిరి అనుభూతి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లిపోవడం కారణాలు అధిక రక్తపోటు మధుమేహం, ధూమపానం, ఊబకాయం, కొలస్ట్రాల్, డయాబెటిస్, లేదా సడెన్‌గా చక్కెర స్థాయలు పెరగడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. నివారణ ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించడానికి బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ఆదిలోనే గుర్తించగలుగుతాం. అలాగే స్ట్రోక్ వచ్చిన రోగులకు థ్రోంబోలిటిక్ మందులతో నయం చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రావీనస్ ఆర్‌టీపీఏ థెరపీని అందిస్తే రోగిని సుమారు 3 గంటల్లో మాములు మనిషిగా చెయ్యొచ్చు. (చదవండి: కేన్సర్‌పై యువతి పోరు..ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో!) -
ముఖ్య సమస్య గురించి సినిమా.. పోస్టర్ రిలీజ్
సామాజిక సమస్యలు ఇతి వృత్తంగా రూపొందిన చిత్రాలకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటు ఆదరణ లభిస్తోంది. అలాంటి ఒక ముఖ్య సమస్య ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న చిత్రం వెప్పం కుళీర్ మళై. హేస్టేక్ ఎఫ్‌డీఎఫ్ ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ధీరవ్ నిర్మించి, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇస్మత్ భాను హీరోయిన్గా నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు కిశోర్‌కుమార్, నటి సుభద్ర జంటగా సంగీతం నేపథ్యంలో మెల్లిసై అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ధీరవ్.. ఇంతకు ముందు అసురన్, బొమ్మై నాయకి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించారన్నది గమనార్హం. నటుడు ఎంఎస్.భాస్కర్, రామా, మాస్టర్ కార్తీకేయన్, దేవ్ హబిబుల్లా, విజయలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పో షిస్తున్నారు. దీనికి భాస్కల్ వేదముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కుట్రం కడిదల్ చిత్రానికి సహాయ దర్శకుడిగానూ, మగళీర్ మట్రుం, సుళల్ వెబ్ సిరీస్‌కు అసోసియేట్ దర్శకుడిగానూ పని చేశారన్నది గమనార్హం. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం దర్శకుడు వెట్రిమారన్ ఆవిష్కరించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా దీనికి పృధ్వీ రాజేంద్రన్ చాయాగ్రహణం, శంకర్ రంగరాజన్ సంగీతాన్ని అందించారు. -
సినిమా పిచ్చితో నేవీ ఉద్యోగాన్ని వదిలేసిన నటుడు..
సినిమా మీద పిచ్చితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చినవాళ్లను చాలామందినే చూశాం. తాజాగా నౌకాదళ ఉద్యోగిని కూడా సినిమా ఆకర్షితుణ్ని చేసేసింది. దాశరధి నరసింహన్ స్వతహాగా నేవీ ఉద్యోగి. చదువు పూర్తి అయిన తర్వాత కొన్నేళ్లపాటు నౌకలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించారు. తనకు నటన అంటే చాలా ఇష్టం. దీంతో మంచి ఉద్యోగాన్ని వదిలేసి నటుడవ్వాలనే కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు. బ్యాడ్ బాయ్స్ టీమ్‌లో ఒకరిగా.. 2016లో వెంకట్రావు దర్శకత్వం వహించిన 'చెన్నై 600028–2' చిత్రంలో బ్యాడ్ బాయ్స్ టీమ్‌లో ఒకరిగా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అరుణ్ రాజాకామరాజ్ వహించిన కణ చిత్రంలో కథానాయకుడికి స్నేహితుడిగా నటించారు. వైభవ్ హీరోగా నటించిన 'ఆర్కే నగర్', అధర్వ కథానాయకుడిగా నటించిన '100' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు విలన్‌గా.. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ప్రతి నాయకుడి స్థాయికి ఎదిగారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ చిత్రంలో విష్ణు విశాల్‌కు మిత్రుడిగా నటించిన దాశరధి ప్రస్తుతం అజిత్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న విడాముయర్చి చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన రణం చిత్రంలో వైభవ్‌కు ప్రతి నాయకుడిగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈయన శ్రమను, నటనా ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ అమైది తమిళ్ వర్సిటీ యూత్ ఐకాన్ అవార్డుతో గౌరవించడం విశేషం. చదవండి: పెళ్లి చేసుకోనంటున్న హాట్ బ్యూటీ.. కారణమేంటో తెలుసా? -
విశాల్ మాటలు చెత్తబుట్టలో వేయండి: హీరో
ప్రముఖ గీత రచయిత ప్రియన్ కథానాయకుడిగా అవతారమెత్తి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అరణం. వర్ష హీరోయిన్గా నటించిన ఇందులో లఘుబరన్, కీర్తన ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 9వ తేదీన విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌తో 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సినిమా చేయడం అవసరమా?.. ఈ వేదికపై చిత్ర కథానాయకుడు, దర్శకుడు ప్రియన్ మాట్లాడుతూ.. అరణం సక్సెస్ సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాకుండా పలువురు చిన్న నిర్మాతలకు, కళాకారులకు కొత్త ధైర్యాన్ని అందించిందన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, ఇలాంటి సమయంలో ఈ చిత్రం చేయడం అవసరమా అని హెచ్చరించిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారన్నారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక చాలా సమస్యలు ఉన్నట్టు ఇంతకుముందు ఆడియో ఆవిష్కరణ వేదికపైనే చెప్పానని అదేవిధంగా అరణం విజయాన్ని సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశానని, ఇప్పుడదే నిజమైందన్నారు. విశాల్ మాట విని వెనక్కు వెళ్లిపోయారు ఈ చిత్ర నిర్మాణంలో తాను చాలా నేర్చుకున్నానన్నారు. కొన్ని చిత్రాలు విడుదలైన వారంలోనే వేడుకలను జరుపుకుంటున్నప్పుడు, 25 రోజులుగా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తమ చిత్రానికి వేడుకలు ఎందుకు జరుపుకోకూడదన్నారు. మూడు, నాలుగు కోట్ల రూపాయలతో చిత్రాలు చేయడానికి నిర్మాతలు రావొద్దని విశాల్ చెప్పడంతో చాలామంది తిరిగి వెళ్లిపోయారన్నారు. కానీ హీరోలను కాకుండా కథను నమ్మి చిత్రాలు చేస్తే విజయం తథ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాల్ వ్యాఖ్యలను చెత్తబుట్టలో వేయండన్నారు. సినిమాను సినిమా వాళ్లే చంపేస్తున్నారని ఆరోపించారు. చదవండి: మేము ప్రశ్నిస్తే.. అన్నింటికీ సిద్ధపడే ఈ వృత్తిలోకి వచ్చారు కదా అంటున్నారు: రష్మిక -
తండ్రిని కాదని బుల్లితెర నటుడితో పెళ్లి.. చివరికి ఏమైందంటే?
సినీ ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కొన్నేళ్లకే విడిపోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా మరో సినీ నటుడికి అతని భార్య విడాకులిచ్చింది. గతంలో పారిపోయి బుల్లితెర నటుడు మునీశ్ రాజాను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె.. విడిపోయినట్లు ఓ వీడియోను రిలీజ్ చేసింది. అంతే కాకుండా తన దత్త తండ్రి, నటుడు రాజ్ కిరణ్‌కు క్షమాపణలు చెప్పింది. జీనత్ ప్రియ వీడియోలో మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. నేను జీనత్ ప్రియ. రాజ్‌కిరణ్ సార్ దత్తపుత్రికను. 2022లో నటుడు మునీష్ రాజాను ప్రేమ వివాహం చేసుకున్నా. కానీ ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాం. మేం విడిపోయి కొన్ని నెలలైంది. మా పెళ్లికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నా. నా పెళ్లితో నాన్నను చాలా బాధపెట్టాను. అయినప్పటికీ.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచారు. నాకు సహాయం చేశారు. ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న' అంటూ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మునీష్ రాజాతో జీనత్ ప్రియ వివాహం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ప్రియా, మునీష్ మొదట స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ప్రియా, మునీష్ రాజా కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి మునీష్ రాజా కుటుంబం ఓకే చెప్పింది. కానీ రాజ్‌కిరణ్ మాత్రం పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. మునీష్ రాజాకు తన కూతురిని పెళ్లి చేసుకునే అర్హత లేదని రాజ్‌కుమార్ అన్నారు. దీంతో రాజ్‌కుమార్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీనత్ ప్రియ తన దత్త తండ్రి రాజ్‌కిరణ్‌పై పలు ఆరోపణలు చేసింది. తాజాగా భర్తతో విడాకులు తీసుకున్నట్లు వీడియో రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చింది. స్పందించిన రాజ్ కిరణ్ అయితే ఈ విషయంపై నటుడు రాజ్ కిరణ్ స్పందించారు. జీనత్ ప్రియ తన దత్తపుత్రిక అని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మునీష్ రాజా డబ్బు కోసం ఏదైనా చేస్తాడని రాజ్‌కిరణ్ ఆరోపించారు. తన పేరును వాడుకుని సినిమాల్లో అవకాశాల కోసం యత్నించాడని ఆయన ఆరోపించారు. -
రాజకీయాల్లోకి తమిళ నటుడు విజయ్?
చెన్నై: తమిళ నటుడు దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకుగాను త్వరలోనే కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. చెన్నైలో గురువారం జరిగిన విజయ్ అభిమానుల సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’సర్వసభ్య సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. విజయ్ అధ్యక్షతన ఏర్పాటయ్యే పార్టీకి నియమ నిబంధనలను ఖరారు చేసే అధికారం కూడా ఈ సమావేశం విజయ్‌కే వదిలేసింది. నెలలోగా పార్టీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. తమిళనాడుతోపాటు కేరళలోనూ విజయ్‌కు భారీగా అభిమానులున్నారు. ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ విజయ్ అభిమానుల సంఘం పోటీ చేసింది. 2026 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానంటూ గతంలోనే ఆయన ప్రకటించారు. -
కెప్టెన్‌గా విజయ్‌కాంత్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?
డీఎండీతే అధినేత, నటుడు విజయ్‌కాంత్ తమిళనాడులోని మధురైలో ఆగస్టు 25, 1952న జన్మించారు. కె.ఎన్.అలగస్వామి, ఆండాళ్ దంపతులకు ఆయన జన్మించారు. జనవరి 31, 1990 న ప్రేమలతను విజయకాంత్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవాళ కరోనా బారిన పడిన ఆయన ఆస్పతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ పేరు ఎందుకు వచ్చిందంటే.. "కెప్టెన్ ప్రభాకరన్" అనే చిత్రం ద్వారా విజయ్‌కాంత్‌కు కెప్టెన్' అని పేరు పెట్టారు. "కెప్టెన్ ప్రభాకరన్" 1992 సంవత్సరంలో విడుదల కాగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన విజయ్‌కాంత్.. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. -
హనీమూన్ చెక్కేసిన నవదంపతులు.. పెళ్లి వీడియో చూశారా?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటి సంగీతను పెళ్లాడాడు. ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా వివాహ శుభాకార్యాన్ని సింపుల్‌గా ముగించేశాడు. ఆదివారం నాడు (డిసెంబర్ 10న) బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. సడన్‌గా పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు.. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన రెడిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంట హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారి రెడిన్ కింగ్స్లీ తన భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మరోవైపు సంగీత తన పెళ్లి వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇద్దరి బ్యాగ్రౌండ్ ఇదే.. రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. అలాగే ఎల్కేజీ, సంతనాతిన్ ఏ1, జాక్‌పాట్, నెట్టికన్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. డాక్టర్, జైలర్ చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. సంగీత విషయానికి వస్తే.. ఈ నటి అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేసింది. పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. View this post on Instagram A post shared by Redin Kingsly (@redin_kingsley) View this post on Instagram A post shared by ©️ Silvan Photography (@silvan__photography) చదవండి: కీరవాణితో వియ్యం.. నిజమేనన్న మురళీ మోహన్.. అప్పుడే పెళ్లి! -
పెళ్లి పీటలెక్కిన బుల్లితెర నటుడు
బుల్లితెర నటుడు, కమెడియన్ తమిళ సెల్వన్ పెళ్లి పీటలెక్కాడు. ప్రేయసి పూర్ణిమ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మంగళవారం (నవంబర్ 28న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ శుభవార్తను వధూవరులిద్దరూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ పెళ్లి ఫోటోను షేర్ చేశారు. 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నానో! నువ్వు నీకోసం మాత్రమే కాకుండా నాకోసం ఎంత పరితపిస్తున్నావో అందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను నీలో కలుపుకున్నందుకు ఎంతగానో లవ్ చేస్తున్నాను' అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ జత చేశాడు. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా తమిళ సెల్వన్.. మిస్టర్ మనైవి, అభియుమ్ నానుమ్ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. మొదట కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు తర్వాత నటుడిగా రకరకాల పాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. View this post on Instagram A post shared by Tamil Selvan (@kuruvi_tamilselvan) చదవండి: త్రిషకు సారీ చెప్పానా? నో ఛాన్స్.. అంత సీన్ లేదన్న నటుడు -
మగవారూ... భాష జాగ్రత్త
గతంలో ఎం.ఎల్.ఏ అయిన ఒక పెద్ద హీరో స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడి అసెంబ్లీలో సంజాయిషీ ఇచ్చాడు. డెబ్బయి ఏళ్లు దాటిన ఒక సీనియర్ నటుడు నోరు పారేసుకుని పరువు పోగొట్టుకున్నాడు. పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న మరో నటుడు స్త్రీల దుస్తుల గురించి సుద్దులు చెప్పి నిరసన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. సెలబ్రిటీలుగా ఉన్నవారు ఎంతో బాధ్యతగా ఉండి యువతకు మార్గం చూపేలా ఉండాలి. వారు ఇలా తగలడితే స్త్రీలతో ఎలా వ్యవహరించాలో ఇంటినే బడిగా మార్చి తల్లిదండ్రులు నేర్పించాల్సి ఉంటుంది. అయితే ఇంటి ఆడవారికి తండ్రి, భర్త గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారా అనేది ప్రశ్న. అతడో ప్రసిద్ధ నటుడు. ‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’ అంటుంటాడు. కాని ఒక సభలో అభిమానులను చూసి పూనకం వచ్చి స్త్రీల గురించి అశ్లీలమైన వ్యాఖ్యలు చేశాడు. వందల సినిమాల్లో తండ్రిగానో బాబాయిగానో వేసిన ఒక నటుడు ‘స్త్రీల మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని సభలో యాంకర్ అడిగితే పరమ రోతగా సమాధానం ఇచ్చాడు. ఇక నటుడుగా, రియల్టర్‌గా గుర్తింపు పొందిన మరో పెద్ద మనిషి పార్లమెంట్ మెంబర్ అయ్యాక పార్లమెంట్లో నిలబడి మరీ ‘స్త్రీల దుస్తుల వల్లే వారికి సమస్యలు వస్తున్నాయి’ అన్నాడు. స్త్రీలను ఏదో ఒకటి అనేయొచ్చు, అంటే వాళ్లు పడతారు, అనడానికే మేము పుట్టాము అనే చులకనభావం పురుష సమాజంలో నరనరాన జీర్ణించుకుని పోబట్టే ఈ ప్రతిఫలాలు. అదృష్టవశాత్తు ఇలాంటి వ్యాఖ్యలకు వెంటనే నిరసన పెల్లుబుకుతున్నా పురుషుల నోటి దురుసు తగ్గడం లేదు. తాజాగా తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల త్రిషతో ‘లియో’ సినిమాలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఆమె హీరోయిన్ అని తెలిశాక (గత సినిమాల్లో తాను చేసిన) బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను’ అని వ్యాఖ్యానించాడు. ‘ఇది సినిమా లాంగ్వేజ్’ అని మన్సూర్ అనుకుని ఉండొచ్చుగాని దానిలోని అశ్లీల ధ్వనికి త్రిష రియాక్ట్ అయ్యింది. ‘ఇతనితో ఇంకెప్పుడూ సినిమాల్లో నటించను’ అని చెప్పింది. ఆ తర్వాత చినికి చినికి గాలివానై ఇప్పుడు మన్సూర్ మీద కేసు బుక్ అయ్యేంతగా వెళ్లింది. మగవాళ్లు ‘సరదాగా మాట్లాడుతున్నామని’ అనుకుంటూ కూడా స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. సరదాగా కించపరచడం ఏమిటో... కించపరచడం ఎలాంటి సరదానో వీరే చెప్పాలి. ► ప్రసిద్ధులే దారి తప్పితే రాజకీయ నేతలు, సినిమా నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు... ఇలా సమాజంలో గుర్తింపు పొందినవారు స్త్రీల పట్ల మరింత గౌరవంతో మెలగుతూ ఆదర్శంగా నిలవాలి. కాని చాలాసార్లు రాజకీయ నాయకుల దగ్గరి నుంచి అన్ని రకాల ప్రముఖులు ఏదో ఒక సందర్భంలో చులకన మాటలు మాట్లాడుతూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాదిలో మంత్రులు ‘మేం వేసిన రోడ్లు ఫలానా హీరోయిన్ బుగ్గల్లా ఉంటాయి’ అంటూ వదరుతుంటారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో కుస్తీ వీరుడిగా నటించి ‘ఈ సినిమాలో కుస్తీలు చేస్తే రేప్ జరిగినంత పనయ్యింది నాకు’ అని వ్యాఖ్యానించి మొట్టికాయలు తిన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రిగా ఉన్న నటిపై దారుణమైన వ్యాఖ్యలు చేసి కోర్టు కేసును ఎదుర్కొనబోతున్నాడు. ► బాల్యం నుంచి భావజాల ప్రభావం ‘కుటుంబంలో తండ్రి (మగాడు) ముఖ్యం’ అనే భావన బాల్యం నుంచి పిల్లల్లో ఎక్కించడం ద్వారా పురుష సమాజం తన ఆధిక్యతను స్త్రీలపై ఆధిపత్యాన్ని కొనసాగించేలా చేస్తుంది. తండ్రిని ‘మీరు’ అని, తల్లిని ‘నువ్వు’ అని అనడంలో ప్రేమ, గౌరవం, దగ్గరితనం ఉన్నా ‘నువ్వు’ అనడం వల్ల ‘లెక్క చేయవలసిన పని లేదు’ అనే భావన కలిగితే కష్టం. తిట్లు, బూతులు అన్నీ స్త్రీలను అవమానించేవే. వాటిని విని, పలికి స్త్రీల పట్ల అలా మాట్లాడవచ్చు అనుకుంటారు మగవారు. ఇంట్లో చెల్లెని, అక్కని, తల్లిని తండ్రి అదుపు చేసే తీరు చూసి, తామూ బయట స్త్రీలను అలాగే అదుపు చేయవచ్చనుకుంటారు. ఫైటర్ జెట్స్‌ను స్త్రీలు నడుపుతున్న ఈ కాలంలో కూడా ‘మేమేమీ గాజులు తొడుక్కోలేదు’, ‘మూతి మీద మీసముంటే రా’లాంటి పౌరుష వచనాలను పురుషులు ఇంకా పలికేటంత వెనుకబాటుతనంలో ఉండటం విషాదకరం. శారీరక పరిమితులు ఉన్నంత మాత్రాన స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు కాబోరు. ► తల్లిదండ్రులూ జాగ్రత్త అబ్బాయిలను ఆడపిల్లలను గౌరవించేలా పెంచడం, టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం ఇప్పటి తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యం. చట్టాలు పకడ్బందీగా ఉన్న ప్రస్తుత రోజుల్లో తెలిసో తెలియకో అహంకారంతోనో పరుష వ్యాఖ్య, అసభ్య చేష్ట నేరుగా కాని సోషల్ మీడియాలోగాని చేస్తే వారు ప్రమాదంలో పడతారని హెచ్చరించాలి. చైతన్యం పెరిగింది. అబ్బాయిలూ భాష జాగ్రత్త. -
నేను పెద్ద తాగుబోతుని.. ధనుష్‌కి కూడా అదే అలవాటు!: నటుడు
రోబో శంకర్.. స్టాండప్ కమెడియన్. తమిళంలో అనేక చిత్రాల్లో నటించాడు. మారి సినిమాలోనూ తన యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఇతడికి గతంలో ఓ చెడు అలవాటు ఉండేది. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడూ మందు తాగుతూ ఉండేవాడు. మద్యానికి బానిసై లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నాడు. దీనికి తోడు ఆ మధ్య ఇతడికి పచ్చకామెర్ల వ్యాధి సోకింది. ధనుష్ కూడా నాలాగే.. దీంతో నాలుగునెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. అప్పుడు జీవితం విలువ తెలుసుకున్నాడు. ప్రస్తుతం మద్యపానానికి దూరంగా ఉంటూ కఠిన ఆహారపు అలవాట్లను అనుసరిస్తూ బక్కచిక్కిపోయాడు. తాజాగా రోబో శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మద్యపానం అనే వ్యసనాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాను. అంత పెద్ద తాగుబోతులా తయారయ్యాను. ఎవరి మాటా వినలేదు. హీరో ధనుష్ కూడా నాలాగే మందు తాగుతాడు. అతడు డైరెక్ట్‌గా నాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకపోయినా ఓరకంగా(మారి సినిమాతో) నాకు జీవితాన్ని ఇచ్చాడు. మా మధ్య అనుబంధం అలాంటిది! మారి మూవీ షూటింగ్లో నాతో చాలా సరదాగా ఉండేవాడు. అతడు ధరించిన కళ్లజోడు కూడా తీసుకున్నాను. మా మధ్య అంతటి అనుబంధం ఉంది. ఓసారి ధనుష్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వచ్ఛందంగా మందు తాగడం మానేశాడు. ఏ పార్టీలో కూడా మందు ముట్టుకోలేదు. నాక్కూడా మద్యపానం మానేయమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ పట్టించుకోలేదు. చావు చివరి అంచుల దాకా వెళ్లినప్పుడు నాకు జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది. అప్పుడే ఈ వ్యసనానికి స్వస్తి పలికాను. కాబట్టి ఎవరూ చెడు అలవాట్ల జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోకండి' అని చెప్పుకొచ్చాడు రోబో శంకర్. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/ 040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నిహారిక ప్రేమ లేఖ.. ఎవరికో తెలుసా? అమ్మాయిలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెల్చుకుందెవరంటే? తన ఎలిమినేషన్ తథ్యం?! -
చిత్రసీమలో విషాదం.. జూనియర్ బాలయ్య కన్నుమూత
తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు టీఎస్ బాలయ్య తనయుడు జూనియర్ బాలయ్య(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. జూనియర్ బాలయ్య మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ జూనియర్ బాలయ్య? జూనియర్ బాలయ్య అసలు పేరు రఘు బాలయ్య. ఆయన తండ్రి టీఎస్ బాలయ్య కోలీవుడ్‌లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రిలోని నటనను పుణికి పుచ్చుకున్న జూనియర్ బాలయ్య మేల్నట్టు మరుమాల్ సినిమాతో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు. త్యాగం, హబే మాయం, గంగై అమరన్, అమ్మ వండచు, రాసుకుట్టి వంటి చిత్రాల్లోనూ ముఖ్య పాత్రలో నటించారు. సత్తై మూవీతో బాగా క్లిక్ అయ్యారు. సుందరకాండం, తని ఒరువన్, పులి, నేర్ కొండ పార్వై వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. అప్పుడప్పుడూ బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలోనూ పాల్గొని సందడి చేసేవారు. ఆయన చివరగా 2021లో వచ్చిన 'ఎన్నంగ సర్ ఉంగ సట్టం' సినిమాలో కనిపించారు. చదవండి: ఓటీటీలో ఏకంగా 28 సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
హీరో మృతి.. నిద్రాహారాలు మానేయడంతో తల్లి కన్నుమూత!
30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తమిళ హీరో బాబు సెప్టెంబర్ 19న కన్నుమూసిన సంగతి తెలిసిందే! ఆయన మరణంతో బాబు తల్లి ప్రేమ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నిద్రాహారాలు మానేసి చనిపోయిన కొడుకు గురించే కలవరించింది. ఈ క్రమంలో అస్వస్థతకు లోనైన ప్రేమ అక్టోబర్ 11న కన్నుమూసింది. కొడుకు చనిపోయిన మూడు వారాలకే తను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆ ఒక్క సీన్ వల్ల జీవితమే నాశనం.. కాగా బాబు 'ఎన్ ఉయిర్ తొళన్' అనే సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలో రంగప్రవేశం చేశారు. ఈ చిత్రాన్ని దర్శకదిగ్గజం భారతీరాజా తెరకెక్కించాడు. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాబుకు లెక్కలేనన్ని అవకాశాలు వచ్చాయి. దీంతో బాబు దాదాపు 10 సినిమాలకు సంతకం చేశారు. అందులో ఒకటి మనసారా వస్తుంగళెన్. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బాబు కొన్ని ఫైట్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించారు. ఈ క్రమంలో ఎత్తైన ప్రదేశం నుంచి ఆయన కిందకు దూకడంతో అతడికి తీవ్ర గాయాల్యాయి. వెన్నుముక విరిగిపోయి మంచానికి పరిమితమయ్యారు. 30 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంది హీరోగా ఎదుగుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఆయన కెరీర్‌నే కాదు జీవితాన్నే తలకిందులు చేసింది. వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ అతడు నిటారుగా కూర్చోలేని పరిస్థితి! అప్పటినుంచి కొడుకుకు సపర్యలు చేస్తూ తనను కంటికి రెప్పలా చూసుకుంటోంది అతడి తల్లి ప్రేమ. మూడు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన బాబు ఇటీవలే కన్నుమూయడంతో ఆ బాధ తట్టుకోలేక తల్లి గుండె సైతం ఆగిపోయింది. కాగా గతంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించిన కె. రాజారం సోదరియే ప్రేమ. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి చదవండి: శోభా ఓవరాక్షన్.. ఆటలో మరీ ఇంతలా దిగజారాలా? -
మరోసారి ఇలాంటి పని చేస్తే చెంప పగలగొడతా.. నటుడికి వార్నింగ్ ఇచ్చిన యాంకర్
కోలీవుడ్‌లో తాజాగా తమిళ నటుడు కూల్ సురేశ్ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. సరక్కు సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయిన ఆయన స్టేజీపైన మాట్లాడుతూనే పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. దీన్ని ఊహించని యాంకర్ ఐశ్వర్య.. వేదికపై ఉన్న దండను విసిరేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. అనంతరం మాట్లాడిన మన్సూర్ అలీఖాన్ కూల్ సురేశ్‌ను ఖండిస్తూ ఆయన తరపున క్షమాపణలు చెప్పారు. (ఇదీ చదవండి: 'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు) దీని తర్వాత, కూల్ సురేష్ తన చర్యలకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశాడు. సినిమా ప్రమోషన్ కోసమే అలాంటి పనిచేశానని చెత్త రీజన్ చెబుతూనే తాను ఒకరిని బాధపెట్టినందుకు చింతిస్తున్నాను. నిజంగానే తాను చేసింది చాలా పెద్ద తప్పేనని కూల్ సురేశ్ ఒప్పుకున్నాడు. అందుకు గాను బహిరంగంగా క్షమాపణలు కోరాడు. ఇకపై అలాంటి తప్పులు చేయనని చెప్పాడు. తాజాగా యాంకర్ ఐశ్వర్య కూడా స్పందించింది. 'ఆ సంఘటన గురించి తలచుకుంటే ఇప్పటికీ షాక్‌కి గురవుతున్నాను. ఎవరూ ఊహించని తరుణంలో తను కూడా నా భుజాన్ని బలవంతంగా నొక్కేసి అలా ప్రవర్తించాడు. ఎవరైనా అకస్మాత్తుగా బహిరంగంగా ఇలా ప్రవర్తిస్తే మీరు ఏమి చేయగలరు? చెంప పగుల కొడతారు కదా..? అలాగే ఇప్పుడు నేను అతని చెంప మీద ఎందుకు కొట్టలేదని ఆశ్చర్యపోతున్నాను. మొరటుగా ప్రవర్తించడంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.. అది వ్యక్తిగతంగా ఎవరినీ ప్రభావితం చేయకూడదు. ఇంతకు ముందు కూల్ సురేష్ ఓ షోలో నాపై రచ్చ చేశాడు. సాధారణంగా అతని చర్యలు నాకు నచ్చని మాట నిజమే. అందుకే అతన్ని స్టేజీపైకి పిలిచేముందు నేను నటుడు కూల్ సురేశ్ అని సింపుల్‌గా పిలుస్తాను. కానీ అది అతనికి ఇష్టం ఉండదు.. అతనిని అలా పిలవకూడదని కూడా కండీషన్ పెడతాడు. తనకు యూట్యూబ్ సూపర్‌స్టార్ అనే బిరుదు ఉంది. ఆ విధంగానే తనను ఎందుకు పిలవరని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. కానీ అతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను అలా పలువనని చెప్పడం జరిగింది.' అని ఆమె తెలిపింది. (ఇదీ చదవండి: నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్ ఛాన్స్) అందుకే ఈసారి తన మెడలో దండ వేసి అవమానించాలని కూల్ సురేశ్ ప్లాన్ వేసినట్లు తెలిపింది. ఇంకోసారి తన పట్ల ఇలా చేస్తే చెంప మీద కొట్టినా కొట్టేస్తానని తెలిపింది. కనీసం అలాంటి పని చేయలేకున్నా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఐశ్వర్య వ్యక్తం తెలిపింది. For the kind attention of Tamil Film Producers, Directors, Artistes & PRO's: The activity of junior artiste #CoolSuresh is becoming worse day-by-day. Yesterday during the audio launch of #MansoorAliKhan #Saraku movie,@chennaipolice_ @tnpoliceoffl @MuraliRamasamy4 @Udhaystalin pic.twitter.com/b5kcaX1MUL — Ottran Dorai (@ottrandorai) September 20, 2023 -
యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన, వీడియో వైరల్
కొందరు చేసే తిక్క పనుల వల్ల అవతలివారు ఇబ్బందిపడుతుంటారు. తాము చేసేది తప్పా? ఒప్పా? అని క్షణం కూడా ఆలోచించకుండా అప్రతిష్ట మూటగట్టుకుంటారు. తాజాగా తమిళ నటుడు కూల్ సురేశ్ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇతర చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు సురేశ్. ఈ క్రమంలో తాజాగా సరక్కు సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. చేసింది తప్పని గద్దించిన నటుడు దీంతో ఇబ్బందిగా ఫీలైన సదరు యాంకర్ చిరాకుగా ఆ మాలను తీసి పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె అనుమతి లేకుండా అలా దండ వేసేయడం సంస్కారమేనా? అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కూల్ సురేశ్ ప్రవర్తనకుగానూ అదే స్టేజీపై ఉన్న నటుడు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా సురేశ్‌ను సైతం క్షమాపణలు చెప్పాలని కోరాడు. దీంతో సురేశ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మొదటి నుంచి మేము సరదాగానే మాట్లాడుకుంటున్నాం.. అని తన తప్పిదాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ చప్పట్లేంటి? చిన్మయి ఆగ్రహం మధ్యలో మన్సూర్ అలీ కలగజేసుకుంటూ ఏదైతేనేం.. నువ్వు చేసిన పని తవ్వు అని నొక్కి చెప్పడంతో సురేశ్ క్షమాపణలు చెప్పాడు. కానీ నెట్టింట మాత్రం నటుడి ప్రవర్తనను ఏకిపారేస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయి సైతం దీన్ని తప్పుపట్టింది. 'ఇది భయంకరమైన ప్రవర్తన.. ఇలాంటివారిపై ఎవరూ చర్యలు తీసుకోరు. పైగా దీన్ని వివాదంగా మార్చవద్దని ఆ అమ్మాయి నోరే మూయిస్తారు. అక్కడ ఉన్న కొందరు అబ్బాయిలైతే అతడు పూలమాల వేస్తుంటే చప్పట్లు కొడుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. Uncouth and horrible behaviour. Anyway based on how Tamilnadu deals with such behaviour, Nobody is going to take action on him and perhaps they’ll ask the girl not to make a fuss. And honestly - you should know how some men are - listen to male voices in the audience hooting… https://t.co/HO5pmWxb3b — Chinmayi Sripaada (@Chinmayi) September 20, 2023 Worst Behaviour #CoolSuresh 🥴 Evan Da Adhu Clap Panni Sirikurathu !! 🙄😠pic.twitter.com/n60oBovPy7 — 𝐕𝐢𝐣𝐚𝐲 𝐊𝐚𝐫𝐭𝐡𝐢𝐤𝐞𝐲𝐚𝐧ツ🦁 (@Vijay_Karthik27) September 20, 2023 చదవండి: అక్కినేని శతజయంతి వేడుకలు.. కాంస్య విగ్రహం ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు -
బ్రేకప్.. 8 ఏళ్లు దూరంగా ఉన్నాం: గుంటూరు కారం నటుడు
శాంతను భాగ్యరాజ్.. తండ్రి భాగ్యరాజ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఇతడు తర్వాతి కాలంలో హీరోగా మారాడు. సక్కరకత్తి సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే రావణ కొట్టంతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం అతడు బ్లూ స్టార్ సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగులో మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమాలోనూ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అతడు తన భార్య కికి విజయ్‌తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముందుగా శాంతను మాట్లాడుతూ.. 'మేము ప్రేమించుకుంది, బ్రేకప్ చెప్పుకుంది రెండూ వాస్తవమే! ఎనిమిదేళ్లు దూరంగా ఉన్నాం. ఆ తర్వాత ఓ సందర్భంలో మరోసారి లవ్‌లో పడ్డాం. అప్పట్లో చిన్నచిన్న విషయాలను కూడా బాగా గొడవపడేవాళ్లం' అని ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు. కికి మాట్లాడుతూ.. 'శాంతనుతో లవ్‌లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది.. నాకిప్పటికీ బాగా గుర్తుంది. నా స్నేహితురాలు ఒకరు ఫోన్ చేసి శాంతను వేరే అమ్మాయితో కాఫీ షాప్‌లో ఉన్నాడని చెప్పింది. నేను వెంటనే శాంతనుకు కాల్ చేసి నువ్వెక్కడ ఉన్నావ్? అని ఆరా తీశాను. అతడు తన తండ్రితో ఉన్నానని అబద్ధం చెప్పాడు. ఇలా మా మధ్య చిన్న చిన్నవే పెద్ద గొడవలుగా మారాయి. మేము బ్రేకప్ చెప్పుకున్నాం. 8 ఏళ్లు విడివిడిగానే జీవించాం. కానీ ఓ షోలో ఇద్దరం కలిసి డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మళ్లీ కలిసిపోయాం' అని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ 2015లో పెళ్లి చేసుకున్నారు. చదవండి: అన్న సమాధి దగ్గర భార్య సీమంతం.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో భార్య -
విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?
విజయ్ సేతుపతి ఓ నటుడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు-వెబ్ సిరీస్‌లు ఫుల్ బిజీగా ఉన్నాడు. పేరుకే తమిళ యాక్టర్ గానీ దేశవ్యాప్తంగా బోలెడంత క్రేజ్ సంపాదించాడు. ఇంతలా పాపులారిటీ తెచ్చుకున్న సేతుపతికి పెళ్లయిందని, టీనేజ్ కూతురు ఉందని చాలామందికి తెలియదేమో. తాజాగా ఓ పిక్ బయటకు రావడంతో ఈ విషయం తెలుగు నెటిజన్స్ మధ్య చర్చకు దారితీసింది. ఇంతకీ విజయ్ సేతుపతి కూతురు డీటైల్స్ ఏంటి? కెరీర్ ప్రారంభంలో విజయ్ సేతుపతి.. పలు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేశాడు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోకముందే అంటే 2003లోనే జెస్సీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అబ్బాయి సూర్య, అమ్మాయి శ్రీజ పుట్టారు. అయితే సేతుపతికి బోలెడంత స్టార్డమ్, దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. కానీ ఇతడి ఫ్యామిలీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పొచ్చు. వాళ్ల ఫొటోలు కూడా పెద్దగా ఏం బయటకు రాలేదు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) అయితే విజయ్ సేతుపతి కొడుకు సూర్య.. తన 'నేను రౌడీనే' సినిమాలో చైల్డ్ క్యారెక్టర్లో నటించాడు. ఇక కూతురు శ్రీజ కూడా.. 2020లో విజయ్ సేతుపతి నటించిన 'ముగిల్' మూవీలో నటించింది. రీల్ లైఫ్ లోనూ వీళ్లిద్దరూ తండ్రి కూతురిగా నటించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా విజయ్ సేతుపతి.. తన కొడుకు-కూతురితో ఉన్న పిక్ బయటకు రావడంతో అందరూ షాకవుతున్నారు. ఇంత పెద్ద అమ్మాయి ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే శ్రీజ సేతుపతి ఓ సినిమాలో నటించింది. ప్రస్తుతం చూస్తుంటే.. తండ్రి అంతా ఎత్తు కూడా పెరిగిపోయింది. అన్ని కలిసొస్తే.. త్వరలో నటి లేదా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినాసరే ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!) -
మొన్ననే హీరో పెళ్లి.. ఇప్పుడు కొత్త సినిమా
'డాడా' లాంటి హిట్ సినిమాతో ప్రూవ్ చేసుకున్న నటుడు కవిన్.. మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. దీనికి 'స్టార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'ప్యార్ ప్రేమ కాదల్' ఫేమ్ ఇళన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎళిల్ అరసు ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రైస్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్, 'విరూపాక్ష'తో హిట్ కొట్టిన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. (ఇదీ చదవండి: బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. చైన్నె, ముంబైలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని దర్శకుడు మీడియాకు చెప్పుకొచ్చారు. ఇందులో ముంబై బ్యూటీ హీరోయిన్ కాగా, మలయాళ నటుడు కీలక పాత్ర చేస్తున్నట్లు చెప్పారు. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఇంట్రో సాంగ్ కోసం భారీ సెట్‌ను వేసి వేసినట్లు చెప్పారు. యువన్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 31న 'స్టార్' స్పెషల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇకపోతే కవిన్.. మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కొత్త సినిమా ప్రకటించాడు. (ఇదీ చదవండి: పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్) View this post on Instagram A post shared by Kavin M (@kavin.0431) -
త్వరలో జైలర్ నటుడి పెళ్లి, తలైవా ఆశీర్వాదాలు కూడా..
మాస్ ఫైటింగ్స్.. హీరోయిన్‌తో డ్యూయెట్స్.. ఇవేవీ లేకుండా సినిమా తీయొచ్చు.. హిట్టు కొట్టనూవచ్చు అని నిరూపించాడు తలైవా. తను స్లోమోషన్లో నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే తన ముందు మోకరిల్లుతాయని జైలర్‌తో చెప్పకనే చెప్పాడు. ఇప్పటికీ జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంంగా దూసుకుపోతూనే ఉంది. ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అందులో జాఫర్ సాదిఖ్ కూడా ఒకరు! ఈయన తమిళనాడులో ఫేమస్ కొరియోగ్రాఫర్. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసిన పావ కథైగల్ సిరీస్‌లో తొలిసారి నటించాడు. ఈ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్లో మాత్రమే ఆయన నటించాడు. తర్వాత అతడు వేందు తనైంతాతు కాదు అనే చిత్రంలో నెగెటివ్ రోల్లో మెరిశాడు. కానీ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ విక్రమ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ హిట్ జైలర్‌లో నటించి మరిన్ని మార్కులు కొట్టేశాడు. జైలర్ సినిమాలో జాఫర్ రజనీకాంత్‌ను కత్తితో భయపెట్టాలని చూస్తాడు.. అందుకుకానీ శివరాజ్‌కుమార్.. అతడిని ఫ్యాన్‌కు కట్టేసి తిప్పుతాడు. ఈ సీన్ చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ఇకపోతే త్వరలో ఇతడు పెళ్లిపీటలెక్కబోతున్నాడట. జాఫర్ కొంతకాలంగా తన కో డ్యాన్సర్ షెరిన్తో ప్రేమలో ఉన్నాడు. తనతో కలిసి అప్పుడప్పుడు రీల్స్ కూడా చేస్తుంటాడు. జైలర్ షూటింగ్ సమయంలో జాఫర్ తన ప్రియురాలిని రజనీకి పరిచయం చేశాడట. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ రజనీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట. మరి తన పెళ్లి తేదీ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి! ఇకపోతే సైతాన్ వెబ్ సిరీస్‌లోనూ నటించిన జాఫర్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. చదవండి: క్రికెటర్‌తో కూతురి ప్రేమాయణం.. దగ్గరుండి పెళ్లి చేసిన ప్రముఖ నటుడు 400కు పైగా సినిమాలు, మోసం చేసిన కూతురు.. చితికి డబ్బుల్లేని దుస్థితి.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు! -
ప్రముఖ నటుడి ఇంట పెళ్లి సందడి.. క్రికెటర్‌తో కూతురి పెళ్లి
ప్రముఖ నటుడు తలైవాసల్ విజయ్ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. తమిళనాడు క్రికెటర్ అపరాజిత్‌తో విజయ్ కూతురు జయవీణ ఏడడుగులు నడిచింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం వీరి వివాహం జరిగింది. కొద్ది నెలల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా నేడు మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. పలువురు సెలబ్రిటీలు వీరి వివాహ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. సోషల్ మీడియాలోనూ అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లికూతురు జయవీణ విషయానికి వస్తే.. ఆమె కూడా క్రీడాకారిణి. స్విమ్మింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంది. పెళ్లికొడుకు బాబా అపరాజిత్ క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. 2012లో జూనియర్ వరల్డ్ కప్‌లో పాల్గొన్న అతడు 2013లో దులీప్ ట్రోఫీలో రెండు సెంచరీలు కొట్టాడు. ప్రస్తుతం అతడు చెపాక్ సూపర్ గిల్లీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి లవ్ స్టోరీకి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అధికారికంగా ఈ పెళ్లి జరిపించారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నటుడు విజయ్ విషయానికి వస్తే.. ఈయన తలైవాసి చిత్రంతో 1992లో వెండితెరపై అరంగేట్రం చేశాడు. తొలి సినిమాతోనే పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అలా ఆయన పేరు తలైవాసి విజయ్‌గా స్థిపరడిపోయింది. 30 ఏళ్ల కెరీర్లో 260కు పైగా చిత్రాలు చేశారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఎందరో నటులకు తన గొంతు అరువిచ్చాడు. చదవండి: 400కు పైగా సినిమాలు, మోసం చేసిన కూతురు.. చితికి డబ్బుల్లేని దుస్థితి.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు! -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. హార్ట్ ఎటాక్‌తో బుల్లితెర నటుడు మృతి!
ఇటీవల గుండెపోటు మరణాలు తరచుగా సంభివిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. హార్ట్ ఎటాక్‌తో సంభవిస్తున్న మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా హిందీ, తమిళ బుల్లితెర నటుడు పవన్ హార్ట్ ఎటాక్‌తో మరణించారు. అతని వయస్సు ప్రస్తుతం 25 ఏళ్లే. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (ఇది చదవండి: యోగి ఆదిత్యనాథ్‌ను కలవనున్న రజనీకాంత్.. ఎందుకంటే?) పవన్ సొంత ఊరు కర్ణాటక మాండ్యా జిల్లాలోని హరిహరపుర గ్రామానికి చెందినవారు కాగా.. సరస్వతి, నాగరాజు ఆయన తల్లిదండ్రులు. యాక్టింగ్ నిమిత్తం కొంతకాలంగా పవన్ ముంబయిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. పవన్ హిందీ, తమిళ భాషల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా హిందీ, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతి పట్ల మాండ్యా ఎమ్మెల్యే హెచ్‌టీ మంజు, మాజీ ఎమ్మెల్యే కేబీ చంద్రశేఖర్ విచారం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: 1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే) నటుడి భార్య కన్నుమూత ఇటీవలే కన్నడ ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన.. థాయ్‌ల్యాండ్ వెకేషన్లో ఉండగా గుండెపోటు రావడంతో హఠాత్తుగా కన్నుమూసింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021లో గుండె పోటుతోనే మృతి చెందారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. చిన్న వయసులోనే గుండెపోటు రావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. -
'జైలర్' పాటకు స్టెప్పులేసిన లెజెండ్.. డిఫరెంట్ గెటప్!
లెజెండ్ శరవణన్.. చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించాడు. గతేడాది 'లెజెండ్' మూవీతో ఎంటర్టైన్ చేసిన ఇతడు.. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా రజనీ 'జైలర్' పాటకు స్టెప్పులేస్తూ కనిపించాడు. అయితే డిఫరెంట్ గెటప్‌తో ఉండేసరికి నెటిజన్స్ తొలుత గుర్తుపట్టలేదు. కానీ ఆ తర్వాత మాత్రం వీడియోని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు. గతేడాది విడుదలైన ఈ మూవీ టాక్ ఏంటనేది పక్కనబెడితే ట్రోల్స్ మాత్రం విపరీతంగా వచ్చాయి. 'లెజెండ్' తర్వాత బయటపెద్దగా కనిపించని శరవణన్.. మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా డిఫరెంట్ గెటప్‌లో ప్రత్యక్షమయ్యాడు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు చిన్నారులకు గిఫ్ట్స్ ఇచ్చిన ఇతడు.. ఆ తర్వాత 'జైలర్'లోని హుకుమ్ పాటకు స్టెప్పులేసి అలరించాడు. అందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ లోనే పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అయింది. పలువురు నెటిజన్స్ ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. அடுத்த படத்தின் அப்டேட்டை குழந்தைகளுடன் பகிர்ந்த தருணம்#Legend #Legendsaravanan @yoursthelegend pic.twitter.com/LocspXpDuX — Legend Saravanan (@yoursthelegend) August 15, 2023 (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) -
డైరెక్టర్‌గా మారిన ప్రముఖ నటుడు
యువ నటుడు ఎస్ఆర్ గుణ దర్శకుడిగా మారబోతున్నాడు. 'కయిరు', 'వాండు' తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు... 'కయిరు' చిత్రానికిగానూ 2019లో కొలకత్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో, మెర్సికోలో జరిగిన సెవెన్ కలర్స్ బ్యాచిలర్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులను అందుకున్నాడు. కాగా తాజాగా సేయన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న తీర్పు అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) డైరెక్టర్ కావడంపై స్పందించిన గుణ.. 'జాతి వివక్షతపై పోరాడిన వివిధ దేశాల చెందిన పోరాటయోధులను ఆయా దేశాలు తీవ్రవాదులుగా ముద్రవేసి దేశం నుంచి బహిష్కరించాయి. దీంతో ఇతర దేశాలను ఆశ్రయించిన ఆ పోరాట దారులు అక్కడ నుంచే న్యాయం కోసం రాజకీయ పోరాటం చేస్తారు. అక్కడ న్యాయం దొరకదు. దీంతో ఒక వ్యక్తి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి జాతి వివక్షతపై ఎలా పోరాటం చేశారు అనే స్టోరీతో తీస్తున్న సినిమా 'తీర్పు' అని ఎస్ఆర్ గుణ తెలిపారు. కెనడాకు చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్‌ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తీర్పు షూటింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!) -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న జైలర్.. రెండు రోజుల్లోనే వందకోట్ల మార్క్!
సూపర్ స్టార్ రజినీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం.. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రోజే రూ.52 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండు రోజు సైతం అదే ఊపులో దూసుకెళ్తోంది. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) జైలర్ రెండు రోజుల్లోనే రూ.100 కోట్లను దాటేసిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తలైవాకు దక్షిణాదిలో భారీగా అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా రజినీకాంత్ సినిమాలకు విదేశాల్లోనూ క్రేజ్ అదేస్థాయిలో ఉంది. దీంతో ఈజీగా రూ.100 కోట్ల మార్కును అధిగమించింది జైలర్. వీకెండ్స్‌లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించారు. (ఇది చదవండి: స్టార్ హీరో కుమార్తె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు! ) -
ఈ ఫొటోలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో కనిపెట్టారా?
చాలామంది హీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది. ఈ కుర్రాడికి మాత్రం స్టార్ హీరోయిన్లు పడిపోతారు. కలిసి సినిమాలు చేయడం లేటు.. ఆ బ్యూటీతో ఎఫైర్ పెట్టుకున్నాడనే రూమర్స్ వస్తాయి. అవి నిజమనేలా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాయి. ఆ హీరో చిన్నప్పటి ఫొటో ఇప్పుడు ఒకటి వైరల్ అయింది. మరి అతడెవరో కనిపెట్టారా? పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి తండ్రి యాక్టర్ కమ్ డైరెక్టర్. దీంతో చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాపు 17 ఏళ్ల పాటు పలు సినిమాల్లో నటించాడు. అవును మీరు ఊహించింది కరెక్ట్. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఎవరో కాదు హీరో శింబు. తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకు మనోడు బాగానే తెలుసు. 'మన్మథ', 'వల్లభ' చిత్రాలతో అప్పట్లోనే తెలుగులో పాపులారిటీ సంపాదించాడు. కాకపోతే ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోలేకపోయాడు. (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) 2002లో హీరోగా సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన శింబు.. 2004లో 'మన్మథ', 2006లో 'వల్లభ' లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్తో హిట్స్ కొట్టాడు. 2010లో 'ఏ మాయ చేశావె' తమిళ రీమేక్‌తో ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే శింబు హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ తమిళంలో అంతంత మాత్రంగానే ఆడేవి. ఇక్కడ అసలు రిలీజయ్యేవి కావు. దీంతో తెలుగు ఆడియెన్స్‌కి శింబు మెల్లగా దూరమైపోయాడు. ఈ మధ్య కాలంలో మళ్లీ 'మానాడు', 'పాతు తలా' చిత్రాలతో విజయాలు అందుకుని.. సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. సినిమాల గురించి పక్కనబెడితే కెరీర్ ప్రారంభంలో నయనతారతో రిలేషన్ మెంటైన్ చేశాడు. శింబు-నయన్ ముద్దులు పెట్టుకున్న ఫొటోలు అప్పట్లో హాట్ టాపిక్. ఆ తర్వాత త్రిష, హన్సిక, నిధి అగర్వాల్.. ఇలా చాలామంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు తెగ రూమర్స్ వచ్చాయి. ఓ దశలో నిధి అగర్వాల్‌ని శింబు పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ అది ఇప్పటికే రూమర్ గానే మిగిలిపోయింది. అలాంటి శింబు చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్స్ ఈ విషయాల్ని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
ఈ పాప గుర్తుందా? ఆ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో
మీరు ఏ సినిమా తీసుకున్నా హీరోహీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. తమకు లభించన అవకాశాల్ని ఉపయోగించుకుని క్యూట్ యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఈ పాప కూడా సేమ్ అలానే. మనకు బాగా తెలిసిన ఓ సినిమాలో హీరోయిన్‌కి చెల్లిగా నటించింది. ఇప్పుడేమో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గాబ్రియోలా నటాలియా ఛార్లటెన్. కాకపోతే గాబ్రియోలా అనే పేరుతో ఫేమస్ అయింది. ప్రస్తుతం సీరియల్స్‌లో హీరోయిన్గా నటిస్తున్న ఈమె.. తొమ్మిదేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించింది. ఓ ఛానెల్ లో ప్రసారమైన డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. అలానే ఓ సబ్బుకి సంబంధించిన యాడ్ లోనూ నటించింది. దీని తర్వాత 'జోడీ నెంబర్ వన్' అనే డ్యాన్స్ షోలో విజేతగా నిలిచింది. (ఇదీ చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?) ఇలా బుల్లితెరపై ఆకట్టుకున్న ఈమెకు ధనుష్-శ్రుతిహాసన్ నటించిన 'త్రీ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం దక్కించుకుంది. ఇందులో హీరోయిన్ చెల్లిలి పాత్రలో కనిపించింది. కొన్ని సీన్లలో కనిపించి ఆకట్టుకుంది. చెన్నైయిల్ ఒరు నాళ్, అప్ప చిత్రాల్లోనూ నటించింది. బిగ్ బాస్ తమిళ్ నాలుగో సీజన్ లోనూ పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం మాత్రం 'ఈర్మన రోజావే 2' సీరియల్ లో కావ్య పార్తిబన్ అనే గృహిణి పాత్ర చేస్తోంది. అయితే 'త్రీ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా క్యూట్ గా కనిపించిన గాబ్రియోలా.. సీరియల్స్ లో చీరకట్టుతో పద్ధతిగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. మోడ్రన్ డ్రస్సులు ధరిస్తున్నప్పటికీ గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. అవి చూస్తున్న కుర్రాళ్లు.. ఎవరీ బ్యూటీ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే) -
ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్ హీరో, పెళ్లికి ముహూర్తం ఫిక్స్!
కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇటీవలే 'దాదా' చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ యువ హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేయసి మోనికతో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఆగస్టు 20న వీరి వివాహం జరగనుంది. ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ శుభకార్యం ఘనంగా జరగనుంది. చెన్నైలోనే పెళ్లి మండపాన్ని ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. కెవిన్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం తెలిసిన అభిమానులు.. సదరు హీరోకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన ప్రేయసితో కలిసి దిగిన ఫోటోలు ఎప్పుడెప్పుడు షేర్ చేస్తాడా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా.. 'కనా కానమ్ కలలాంగల్' సీరియల్‌తో కెవిన్ జర్నీ మొదలైంది. ఈ సీరియల్లో కెవిన్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. శ్రావణన్ మీనాక్షి, తాయుమానవన్ వంటి సీరియల్స్‌తో బుల్లితెర హీరోగా మారాడు. 2017లో ఇతడు 'శత్రియాన్' చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ మరుసటి ఏడాది 'నాట్పున్న ఎన్ననాను తెరియుమా' చిత్రంతో హీరోగా మారాడు. ఈ ఏడాది వచ్చిన 'దాదా'తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంతో గణేశ్ కె బాబు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లోనూ అదరగొడుతోంది. సీరియల్స్, సినిమాలకు మధ్యలో తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు కెవిన్. ఆ సమయంలో షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లాస్లియాతో లవ్‌లో పడ్డాడు. ఈ విషయాన్ని లాస్లియా కూడా ధృవీకరించింది. ఏమైందో ఏమో కానీ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. Wedding bells for @Kavin_m_0431! Young Tamil star Kavin, whose latest film #Dada emerged a blockbuster earlier this year, is to tie the knot with his longtime girlfriend #Monica on August 20. The wedding is to take place with the blessings of both families.#Kavin pic.twitter.com/kKsLUQ8jME — Yuvraaj (@proyuvraaj) August 1, 2023 చదవండి: అలా మాట్లాడొద్దు, నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయా.. ఏడ్చేసిన శివజ్యోతి -
ఆ రెండింటి కోసమే పెళ్లి చేసుకోవాలనుకున్నా: 'కిక్' నటి
సీనియర్ నటి నళిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. 1980-90ల్లో క్రేజీ బ్యూటీగా మారింది. అలాంటి సమయంలోనే నటుడు, దర్శకుడు రామరాజన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) ప్రస్తుతం సినిమాలు, టీవీ సీరియల్స్‌లో అమ్మ పాత్రలు చేస్తున్న నళిని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలు.. కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, విడాకులు గురించి మాట్లాడింది. 'హీరోయిన్గా నేను బిజీగా ఉన్నప్పుడు ఏడాదికి 24 సినిమాల్లో నటించా. తినడం, నిద్రపోవడం కోసమే పెళ్లి చేసుకోవాలని భావించాను. అలాంటప్పుడు నటుడు రామరాజన్ని లవ్ చేశాను' 'కొన్నాళ్లకు మా ప్రేమ వ్యవహారం నా తల్లిదండ్రులకు చెప్పడంతో అప్పటినుంచి రామరాజన్‌తో నటించడానికి వాళ్లు ఒప్పుకోలేదు. రామరాజన్ మంచి నటుడు, తెలియకుండా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిజంగా ఆయన బంగారు లాంటి మనిషి. తర్వాత మా ఇద్దరికీ ఎందుకో సెట్ కాలేదు. దీంతో విడిపోయాం. పెళ్లి రద్దయినా ఇప్పటికీ ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నా. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు' అని నటి నళిని తన ఆవేదన బయటపెట్టింది. (ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!) -
నిజంగానే అతీంద్రియ శక్తులున్నాయా?.. అయితే ఈ సినిమా చూడాల్సిందే!
శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఈకో'. ఇందులో విద్య ప్రదీప్, పూజ జవేరి కథానాయికలుగా నటించారు. ఆశీష్ విద్యార్థి, కాళీ వెంకట్, శ్రీనాథ్, కుంకీ అశ్విన్, ఢిల్లీ గణేష్, ప్రవీణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీవిష్ణు విజన్స్ పతాకంపై డాక్టర్ రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ గణేష్ దర్శకత్వం వహించారు. గోపీనాథ్ చాయాగ్రహణం, నరేన్ బాల కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ప్రేమ, హారర్ర్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది. (ఇది చదవండి: BRO Trailer: కనీవినీ ఎరుగని రెమ్యునరేషన్.. డైలాగులే మైనస్!) అసలు కథేంటంటే.. మంచి సంస్థలో ఉద్యోగం చేసే ఒక యువకుడిని ఆ కంపెనీ చైర్మన్ కూతురు గాఢంగా ప్రేమిస్తుంది. అతను కూడా ఆమె ప్రేమను ఇష్టపడతాడు. అలాంటి సమయంలో ఆ యువకుడు తల్లి ఆమె సొంత ఊరికి కొడుకును తీసుకెళుతుంది. అక్కడ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ యువకుడు తల్లి కోరిక మేరకు మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. మొదట్లో భార్యపై అయిష్టత వ్యక్తం చేసిన ఆ తర్వాత స్నేహితుల సలహా మేరకు ఆమెతో కాపురం చేస్తాడు. అలా భార్యాభర్తల సంసార జీవితం అన్యోన్యంగా సాగుతున్న సమయంలో ఆ ఇంట్లో కొన్ని అతీంద్రియ శక్తులు అతని భార్యని భయబ్రాంతులకు గురిచేస్తాయి. చివరికి ఆమె ప్రాణాలు తీసుకునే పరిస్థితి నెలకొంటుంది. కొన్ని రోజుల తర్వాత తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటాడు. అయితే అతీంద్ర శక్తులు అతన్ని కలవరపరుస్తుంటాయి. దీంతో అతను పరిశోధకుడు ఆర్మలాజిస్ట్ను కలుస్తాడు. ఆయన పరిశోధనలో ఏం గ్రహించాడు అసలు ఈ సంఘటనలన్నింటికీ కారణం ఏమిటి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. (ఇది చదవండి: మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్) -
బైకర్‌ను కారుతో గుద్ది పారిపోయిన నటుడు, సీసీటీవీ వీడియో వైరల్
-
బైకర్‌ను కారుతో గుద్ది పారిపోయిన నటుడు, సీసీటీవీ వీడియో వైరల్
యూట్యూబ్‌లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు టీటీఎఫ్ వాసన్. యూట్యూబ్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఏకంగా సినిమా ఛాన్సే పట్టేశాడు, అది కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, కమెడియన్‌గానో అనుకునేరు.. నేరుగా హీరోగా మారిపోయాడు. వాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మండల్ వీరన్. ఇటీవలే అతడి బర్త్‌డే సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ఇదిలా ఉంటే వాసన్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఆ మధ్య బైక్‌పై అతివేగంగా వెళ్తూ పోలీసులతో చీవాట్లు తిన్న ఇతడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. కారులో వేగంగా వెళ్తున్న అతడు పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనతో భయపడ్డ వాసన్ వెంటనే సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. తన కారును అక్కడే వదిలేసి ఆటో ఎక్కి అక్కడి నుంచి జారుకున్నాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత నిర్లక్ష్యంగా కారు నడుపుతున్న నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: నిర్మాతగా మారిన రాఘవేంద్రరావు మాజీ కోడలు -
నాడు విజయ్ పేరుతో వైరల్.. నేడు మళ్లీ ఇలా ట్రెండింగ్‌లో
తమిళ నటి షాలు షమ్ము అంటే తెలుగువారు ఎవరైన టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ కోలీవుడ్‌లో పాపులర్ నటి. అక్కడి సోషల్ మీడియాలో తనపేరు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. గతంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణ చేయడంతో అప్పట్లో ఆమె పేరు తెలుగునాట కూడా వైరల్ అయింది. శివకార్తికేయన్ హీరోగా మిస్టర్ లోకల్ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. తర్వాత తనకు పలు సినిమా అవకాశాలు వచ్చినా అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో షాలు షమ్ముకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ఆమె షోషల్మీడియాకే పరిమితమై తన వర్కౌట్ వీడియోలతో పాటు సల్సా డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేసేది. అంతే కాకుండా చాలా ఆకర్షణీయమైన తన ఫోటోలను కూడా షేర్ చేసేది. అలా ఆమె పేరు అందరిలో ఉండేలా జాగ్రత్తపడేది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ) తర్వాత తనకు తమిళ్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. తాజాగా తను కోటి రూపాయల లగ్జరీ కారును తక్కువ ధరకు కొనుగోలు చేసిందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. షాలూ షమ్ము తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రూ.1 కోటి విలువ చేసే జాగ్వార్ కారును సెకండ్ హ్యాండ్లో రూ. 50 లక్షలకు కొన్నట్లు తెలిపింది. ఆ కారు కొనడం తన చిరకాల కోరికని తెలిపింది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ) ఓ వైపు సినిమా అవకాశాలు లేనప్పుడు ఇంత డబ్బు ఎలా వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమాలేనా? మరేదైనా చేస్తున్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆమె తిరిగి ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. కానీ నటి షాలు షమ్ము స్కిన్ కేర్ క్లినిక్ కూడా నడుపుతున్నట్లు గతంలో తెలిపింది. ఆ కంపెనీ నుంచి వచ్చిన మొత్తంతోనే ఆమె ఈ కారును కొనుగోలు చేసి ఉంటుందని పలువురు అంటున్నారు. విజయ్ దేవరకొండతో సినిమా.. గతంలో ఇలాంటి కామెంట్ చేసింది గతంలో తను చేసిన ఆరోపణలు ఇవే.. తెలుగు పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడు తనకు విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశాలు ఇప్పిస్తామని ఆఫర్ చేశాడు, అయితే ఆ సినిమాలో ఆఫర్ రావాలంటే.. తన కోరిక తీర్చాల్సి ఉంటుందని కండీషన్ పెట్టినట్లు అప్పట్లో కామెంట్ చేసింది. ఆ కారణంతో విజయ్‌తో వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఆ దర్శకుడెవరో మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు తమిళ్, తెలుగు పరిశ్రమలో సంచలనంగా మారిపోయింది. View this post on Instagram A post shared by ❣️ ஷாலு ஷம்மு ❣️ (@shalushamu) -
వైఎస్ జగన్ పాత్రలో జీవా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర’ (2019) సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ప్రస్తుతం ‘యాత్ర 2’కి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో జీవాను జగన్ మోహన్ రెడ్డి పాత్రకు సంప్రదించారు మహీ. ఈ చిత్రంలో నటించడానికి జీవా సుముఖత వ్యక్తపరిచారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. జగన్ పాదయాత్ర నుంచి ప్రారంభమై సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ సినిమా ముగుస్తుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 3న మొదలవుతుంది. 2024 ఫిబ్రవరిలో ‘యాత్ర 2’ సినిమా విడుదల కానుంది. కాగా మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు: నటి
తమిళ సీరియల్స్‌తో కన్నా వివాదాలతోనే బాగా ఫేమసయ్యాడు నటుడు అర్ణవ్. సహనటి దివ్య శ్రీధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో తనతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన దివ్య తాజాగా మరోసారి అర్ణవ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అర్ణవ్ తనను తాను గేగా పరిచయం చేసుకుని ఓ పైలట్ నుంచి డబ్బులు గుంచి మోసం చేయడమే కాకుండా అతడి చావుకు కారణమయ్యాడని ఆరోపించింది. 10 ఏళ్ల క్రితమే ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడంది. ఈ మేరకు ఆడియో క్లిప్స్‌ను, అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్షాట్లను ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ ఆడియో క్లిప్పింగ్స్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. అర్ణవ్ 10 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నాళ్లపాటు సంతోషంగా ఉన్నామని చెప్పింది. తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడని, 8 ఏళ్లు అతడి వేధింపులు భరించానని చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లి విషయం దాచిన నటి కాగా దివ్యకు 2013లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. మనస్పర్థల కారణంగా అతడికి విడాకులిచ్చింది. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారగా 2022 జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలిసింది. మరోవైపు చెల్లమ్మ సీరియల్ నటి అన్షితతో అర్ణవ్ ఎఫైర్ నడుపుతున్న విషయం దివ్యకు తెలిసింది. ఒకరిపై మరొకరు నిందారోపణలు దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు తెలియకుండా వేరే వ్యక్తితో కలిసి దివ్య గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్ణవ్. అటు దివ్య కూడా తన భర్తకు వేరే నటితో సంబంధం ఉందని తెలిసి, షూటింగ్ స్పాట్‌కు వెళ్లి నిలదీస్తే కొట్టిందని, భర్త కూడా తనపై దాడి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. చదవండి: వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు చూశారా? గ్లామర్‌కు నో చెప్పను, కానీ వల్గారిటీ మాత్రం.. -
ప్రియుడితో టచ్‌లో ఉన్న నటుడి భార్య.. అందుకే విడాకులు!
ప్రేమ-పెళ్లి-విడాకులు.. ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణ విషయం. కొన్ని ప్రేమలు బ్రేకప్‌తోనే ఆగిపోతే, మరికొన్ని మాత్రం పెళ్లయ్యాక విడాకులతో ముగిసిపోతాయి. తమిళ సినీ జంట సంయుక్త-విష్ణుకాంత్లు రెండో కోవలోకి చెందుతారు. 'సిప్పినీల్ ముత్తు' సీరియల్లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు పెద్దల అంగీకారంతో మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. బ్యూటిఫుల్ కపుల్ అని అంతా పొగిడారో లేదో అంతలోనే విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. పెళ్లైన రెండు నెలలకే విడాకులు తమ పెళ్లి ఫోటోలను సైతం సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. ఆ సమయంలో విష్ణుకాంత్.. 'మౌనంగా ఉంటే ఎఫైర్స్ నిజమైన ప్రేమను కూడా ఫేక్ ప్రేమగా మార్చేస్తాయి' అని పోస్ట్ చేశాడు. అటు సంయుక్తా కూడా.. 'ఇది కొత్త జీవితానికి ఆరంభం, ఇక మీదట మరింత ధృడంగా ముందుకు వెళ్తా'నని పోస్ట్ చేసింది. పెళ్లైన రెండు నెలలకే విడిపోయిన ఈ జంట తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. మాజీ భార్య సంయుక్త ఆడియో క్లిప్‌ను నెట్టింట రిలీజ్ చేశాడు విష్ణు. సంయుక్త తన మాజీ ప్రియుడు విజయ్‌తో ఇంకా టచ్‌లో ఉందని తెలియజేస్తూ ఈ క్లిప్ వదిలాడు. విష్ణుకాంత్తో పెళ్లికి సిద్ధమయ్యాక కూడా మాజీ ప్రేమికుడిని మర్చిపోలేనందువల్లే వీరు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. విష్ణు ఆమె అందాన్ని కోరుకున్నాడు ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ తమిళనాట బుల్లితెర ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ఇది చూసిన కొందరు సంయుక్తను విమర్శిస్తుండగా ఆమె అభిమానులు మాత్రం మేము నీవెంటే ఉన్నామంటూ ధైర్యాన్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని.. 'విష్ణు చెప్పేది తప్పా?ఒప్పా? అనేది పక్కన పెడితే పాత ఆడియో రికార్డింగ్‌ను ఇప్పుడు నెట్లో పెట్టడం అనేది చాలా తప్పు. ఇక్కడ విష్ణునే సంయుక్త అందాన్ని చూసి పడిపోయి ఆమెతో శారీరకంగా కలిసి ఉండాలనుకున్నాడు. కానీ పెళ్లనేది ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వారి పెళ్లి వర్కవుట్ కాలేదు. సామ్ ప్రేమ వ్యవహారం విష్ణుకు తెలుసు తను నిజంగా సామ్‌ను ప్రేమిస్తే ఇలా అందరి ముందు ఆమెను అవమానపర్చడు. సామ్, రవి ఇద్దరూ 'నిరమతే నిలవే' అనే వెబ్ సిరీస్‌లో కలిసి నటించారు. ఎన్నో ఇంటర్వ్యూల్లో వారు తమ గురించి బాహాటంగానే చెప్పారు. కాబట్టి పెళ్లికి ముందే ఆమె గతం గురించి అతడికి కచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్లు నటిస్తున్నాడు. సామ్ ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను' అని కామెంట్ చేశాడు. దీన్ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన సంయుక్త.. లవ్ ఎమోజీతో పాటు కృతజ్ఞతగా నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది. చదవండి: పవిత్రా లోకేశ్ ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా? -
ప్రేయసిని పెళ్లాడిన నటుడు, నెట్టింట ఫోటోలు వైరల్
పాపులర్ యూట్యూబర్, తమిళ నటుడు ఎరుమసాని విజయ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. తన ప్రేయసి, మోడల్ నక్షత్రతో ఏడడుగులు నడిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫ్యాషన్ డిజైనర్‌గానూ రాణిస్తున్న నక్షత్రతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు విజయ్. వీరిద్దరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తాజాగా గ్రాండ్‌గా వివాహం జరగ్గా పలువురు సెలబ్రిటీలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంగేజ్మెంట్ దగ్గరి నుంచి పెళ్లి వరకు ప్రతి ఈవెంట్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు నటుడు. కాగా విజయ్‌కు ఎరుమై సాని అని సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో అతడు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ విశేష అభిమానులను సంపాదించుకున్నాడు. హిప్ హాప్ ఆది డైరెక్ట్ చేసిన 'మీసై మురుకు' చిత్రంతో నటుడిగా వెండితెరపై రంగప్రవేశం చేశాడు. తర్వాత నాన్ సిరితాల్ సినిమాలో నటించాడు. అనంతరం డీ బ్లాక్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇందులో అరుళ్ నిధి, అవంతిక మిశ్ర హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో అరుళ్ నిధి ఫ్రెండ్ పాత్రలోనూ మెరిశాడు విజయ్. View this post on Instagram A post shared by Eruma saani Vijay (@vijayviruz) View this post on Instagram A post shared by Eruma saani Vijay (@vijayviruz) చదవండి: ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. అమాయకుల్లా నటిస్తున్నారే: తేజ -
నటిని పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఆమెను మోసం చేశావంటూ ట్రోల్స్
ఆన్‌స్క్రీన్ మీద జోడీగా కనిపించినవాళ్లు నిజజీవితంలో కూడా జంటగా ఉండాలనేమీ లేదు. కొన్నిసార్లు వారు ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు, మరికొన్నిసార్లు పరిచయమే లేనట్లుగా కూడా ప్రవర్తించవచ్చు. కానీ తెరపై నటులను జంటగా చూసి ముచ్చటపడిన అభిమానులు రియల్ లైఫ్‌లో కూడా వారు ఒక్కటైతే బాగుండని కోరుకుంటారు. ఈ క్రమంలోనే సీరియల్స్‌లో జంటగా నటించేవారికి తరచూ పెళ్లి ప్రశ్నలు కూడా ఎదురవుతుంటాయి. తెరపై భాగస్వామిగా కనిపించినవారిని పెళ్లి చేసుకోకపోతే కొందరు అభిమానులు హర్ట్ అవుతారు కూడా! తమిళ నటుడు రాజా వేట్రి ప్రభు విషయంలో ఇదే నిజమైంది. అతడికి నటి దీపిక వెంకటాచలంతో నిశ్చితార్థం జరిగింది. ఈ శుభవార్తను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటినుంచి మొదలైంది అసలు సమస్య.. తేజను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నావంటూ కొందరు నెటిజన్లు రాజాపై మండిపడుతున్నారు. ఈ తేజ మరెవరో కాదు.. 'కన కానమ్ కాలంగళ్' సీరియల్లో అతడికి జంటగా నటించింది. ఇదే సీరియల్లో దీపిక కూడా నటించింది. కానీ ఈ సీరియల్లో రాజా- తేజల జోడీకి మంచి పేరొచ్చింది. ఈ రీల్ కపుల్‌ను రియల్ కపుల్‌గా చూడాలనుకున్న అభిమానుల ఆశలు ఆవిరి కావడంతో నటుడిపై ఫైర్ అవుతున్నారు. శుభమా అని పెళ్లి చేసుకుంటే ఈ విమర్శల గోలేమిటి అనుకుందో ఏమో కానీ తేజ వెంటనే దీనిపై స్పందిస్తూ.. వారి పెళ్లికి, సీరియల్‌కు అసలు సంబంధమే లేదని స్పష్టం చేసింది. సీరియల్ వేరు, నిజ జీవితం వేరని, దయచేసి ఎవరూ రాజా, దీపికలను విమర్శించవద్దని కోరింది. వారి పెళ్లి తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొంది. ఇకపోతే రాజా- దీపికల పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. శుభాకార్యాలకు నలుపు రంగు దుస్తులను దూరం పెట్టే పద్ధతికి వీడ్కోలు చెప్తూ రిసెప్షన్లో బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది నటి. View this post on Instagram A post shared by Deepika Venkatachalam (@deepika_v__) View this post on Instagram A post shared by Deepika Venkatachalam (@deepika_v__) చదవండి: తెలుగులో నటించడానికి రెడీ: దుషారా విజయన్ -
ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్
ప్రముఖ నటుడు, కమెడియన్ మనోబాల అనారోగ్యంతో మే 3న కన్నుమూసిన విషయం తెలిసిందే! తమిళంలో అనేక చిత్రాలు చేసిన ఆయన తెలుగులో పున్నమి నాగు, మహానటి, దేవదాసు, వాల్తేరు వీరయ్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. తాజాగా ఆయన చివరి రోజుల్లో ఎలా ఉన్నారో తెలియజేస్తూ ఓ వీడియోను మనోబాల యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు అతడి కుటుంబసభ్యులు. ఇందులో మనోబాలకు కనీసం కదలడానికి కాళ్లు, చేతులు సహకరించడం లేదు. నోరు పెగల్చడానికి కూడా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఆయనతో మాట్లాడించేందుకు అందరూ కలిసి ఎంత ప్రయత్నించినా మనోబాల మాట పెదవి దాటి బయటకు రాలేకపోయింది. మనోబాల తన కొడుకు హరీశ్ పాడిన పాట చివరిసారిగా విని సంతోషించారు. మనోబాల కదల్లేని స్థితిలో వీల్‌చైర్‌కే పరిమితం కావడంతో ఆయన అసిస్టెంట్ అతడికి తినిపిస్తూ నీళ్లు తాగించాడు. అలా ఓపక్క కొడుకు పాట పాడుతుంటే మరోపక్క ఆయనకు భోజనం తినిపించారు. సినిమాల్లో ఎంతో యాక్టివ్‌గా కనిపించే మనోబాలను ఇలా వీల్‌చైర్‌కే పరిమితమవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా మనోబాలాకు 'మనోబాలాస్ వేస్ట్ పేపర్' పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. తెర వెనుక జరిగే సరదా సంఘటనలను, సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలను, రివ్యూస్‌ను.. ఇలా రకరకాల వీడియో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేసేవారు. ఆయన కామెడీకి కడుపుబ్బా నవ్వినవారు ఇప్పుడు ఈ చివరి వీడియో చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. చదవండి: ఆ హీరో ఇండస్ట్రీకి పనికి రాడు: డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు -
Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!
కుట్టి పద్మిని దక్షిణాది ఇండస్ట్రీలో సీనియర్ నటీమణుల్లో ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా కనిపించింది. తన మూడవ ఏటనే 1959లో తొలిసారిగా తమిళంలో బాల నటిగా నటన జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్‌తో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ బిజినెస్‌లో బిజీ ఆయిపోయారు. ఇటీవల ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. (ఇది చదవండి: రూమ్‌లో అడ్జస్ట్ అవుతారా అని అడిగారు: సీనియర్ నటి) పద్మిని మాట్లాడుతూ.. 'కమల్ హాసన్.. శ్రీవిద్య, రేఖ, జయసుధ, వాణీ గణపతితో సహా మరో ఇద్దరు నటీమణులతో కలిపి ఒకేసారి ఆరుగురితో ప్రేమ వ్యవహారం నడిపించారు. కానీ చివరికి వాణీ గణపతిని కమల్ హాసన్ పెళ్లాడారు. వీరి పెళ్లి వార్త శ్రీదేవి, శ్రీవిద్యలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే శ్రీవిద్య కమల్‌హాసన్‌ను ఎంతో ఇష్టపడింది. ఆయనకు పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అతనికి పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. నేను కమల్‌తో తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన వాణితో ప్రేమలో పడ్డారు. ఎయిర్‌పోర్టులో ఆమెకు బహుమతి కూడా కొన్నాడు. ఆ తర్వాత మద్రాస్‌కు చెందిన నటి రేఖతో ప్రేమాయణం కొనసాగించారు. ఈ విషయాన్ని నేను నేరుగా వెళ్లి శ్రీవిద్యకు చెప్పా. కానీ ఆమె నమ్మలేదు. కమల్‌కు 'సకలకళా వల్లభుడు' అన్న బిరుదు రావడానికి ఇదే కారణం.' ఆమె పేర్కొంది. (ఇది చదవండి: విడాకుల ఫోటోషూట్.. ఇదేం ట్రెండ్ రా బాబు!) అయితే కమల్ వాణిని పెళ్లి చేసుకున్న తర్వాత.. శ్రీవిద్య చాలా రోజులు ఈ వాస్తవాన్ని భరించలేక తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు పద్మిని తెలిపింది. కానీ కొన్నేళ్ల తర్వాత జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజులకే విడాకాలు తీసుకుంది. సినిమాల నుంచి తప్పుకున్న శ్రీవిద్య తిరువనంతపురంలో స్థిరపడింది. తన ఆస్తి మొత్తాన్ని ఓ ట్రస్ట్‌కు రాసిచ్చింది. ఆ తర్వాత ఆమెకు క్యాన్సర్ రావడంతో 2006లో మరణించింది. తెలుగులో చివరగా విజయ్ ఐపీఎస్ అనే సినిమాలో శ్రీవిద్య నటించారు.ఈ సినిమాలో హీరోగా సుమంత్ నటించారు. -
ఆ దర్శకుడితో నటించడానికి భయమేసింది: యంగ్ హీరో
దర్శకుడు భారతీరాజాతో కలిసి నటించడానికి భయపడ్డానని యువ నటుడు అరుళ్ నిధి చెప్పారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం తిరువిన్ కురుల్. దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి ఆద్మిక నాయకిగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా హరీశ్ప్రభు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా.. ఇందులో నటుడు అరుళ్‌నిధి మూగ పాత్రలో నటించడం విశేషం. అంతేకాకుండా చెవులు కూడా సరిగా పని చేయవు. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని ఆయన తెలుపుతూ ఇది తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు భారతీరాజా తన తండ్రిగా నటించారన్నారు. ఆయన్ని తొలిసారి షూటింగ్‌లోనే చూశానని తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించినా, ఆయనది పిల్లాడి మనస్తత్వం అని అన్నారు. భారతీరాజాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఇది ఎక్కువగా ఆస్పత్రిలో జరిగే సన్నివేశాలతో కూడిన కథా చిత్రమని చెప్పారు. చిత్రంలో ఈగో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. విలన్లు, పోరాటాలు అంటూ చిత్రం కుటుంబ నేపథ్యంలో భావోద్రేకాలతో సాగుతుందని తెలిపారు. తాను ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కథే కారణం అన్నారు. బృందావనం తరువాత తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం ఇదేనని నటుడ అరుళ్‌నిధి పేర్కొన్నారు. -
విలాసవంతమైన ఫ్లాట్ కొన్న సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. తన సినిమాలతో టాలీవుడ్‌లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా సూర్య ముంబయిలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.70 కోట్లు వెచ్చించి విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాసముండే గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే చెన్నై నుంచి ముంబయికి షిఫ్ట్ అవ్వాలని సూర్య- జ్యోతిక దంపతులు భావిస్తున్నారట. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. సూర్య 2006లో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అపార్ట్మెంట్ ప్రత్యేకతలు సూర్య కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతమైన ఫ్లాట్‌లో భారీ గార్డెన్ స్పేస్, అలాగే పార్కింగ్ స్పాట్లు కూడా ఉన్నాయి. ఆ ఫ్లాట్ ధర రూ.68 కోట్లు కాగా.. మిగిలిన రూ.2 కోట్లు అపార్ట్మెంట్ బుకింగ్, ఇతర ఖర్చుల కోసం కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. కాగా.. సూర్య ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకటించిన 'సూర్య 42' విడుదలకు సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సిరుత్తై శివ తెరకెక్కించారు.ఈ చిత్రం దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. అంతేకాకుండా సూర్య మూవీ 'సూరరై పొట్రు' హిందీ రీమేక్‌లో ప్రధాన పాత్రలో నటించాడు. -
నాటునాటుకు ఆస్కార్.. లాబీయింగ్‌తోనే అవార్డులు: నటుడు
తమిళ సినిమా: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతోపాటు ప్రపంచ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును సాధించి భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. ఆ చిత్రంలోని నాటునాటు పాట ఈ అవార్డును గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా గర్వపడుతోంది. అయితే ఈ అవార్డు విషయంలో కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారివి కాబట్టి అది సహజమే. కాగా తమిళ దర్శకుడు, నటుడు అమీర్ ఆస్కార్ అవార్డుల విషయంలో తనదైన శైలిలో స్పందించారు. ఇంకా చెప్పాలంటే ఆస్కార్ అవార్డునే విమర్శించారు. ఈయన శుక్రవారం సాయంత్రం ఒక సినిమా వేడుకలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన అమీర్ ఒక భారతీయ సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం సంతోషం అన్నారు. అయితే ఆస్కార్ అవార్డు అనేది ఆ దేశంలో అందించే జాతీయ అవార్డు అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఉత్తమ నటుడు అయిన శివాజీ గణేషన్‌కు చివరి వరకు ఎందుకు జాతీయ అవార్డు రాలేదన్నారు. దేవర్ మగన్ చిత్రంలోని ఆయన నటనకు గాను ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారని, అయితే దానిపై స్పందించిన శివాజీ గణేషన్ ఈ అవార్డు వచ్చింది కాదని, ఆ జ్యూరీ సభ్యులను మనవారు పట్టుబట్టి ఇప్పించిన అవార్డు అని పేర్కొన్నారన్నారు. పక్షపాతంలేని ఉత్తమ నటుల అవార్డుల ప్రదానం 30 ఏళ్ల క్రితమే ముగిసిందన్నారు. ఇప్పుడు అందిస్తున్న అవార్డులన్నీ లాబీయింగే కారణం అనే విమర్శలు ఉన్నాయన్నారు. 2007లో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన శివాజీ చిత్రంలోని నటనకు గాను ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేసిందన్నారు. అలాగని రజనీకాంత్ ఉత్తమ నటుడు అని చెప్పగలమా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ఎంటర్ టెయినర్ మాత్రమేనని పేర్కొన్నారు. నిజానికి రజనీకాంత్ ఉత్తమ నటన గురించి చెప్పాలంటే ముల్లుమ్ మలరుమ్, ఆరిలిరుందు అరుబదు వరై వంటి చిత్రాలని చెప్పాలన్నారు. ఆ చిత్రాలకు ఎందుకు అవార్డును ఇవ్వలేదని ప్రశ్నించారు. -
నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు
తమిళ నటుడు పొన్నంబలం ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా గుర్తింపు పొందాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించిన ఆయన సౌత్ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. 80,90లో ప్రతికథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన అనంతరం సినిమాలకు దూరమయ్యాడు. చదవండి: చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరాడు. సర్జరీ అనంతరం కోలుకున్న పొన్నంబలం ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సొంతవాళ్లే తనని చంపాలని చూశారంటూ షాకింగ్ విషయం బయటపెట్టారు. ‘నేను అతిగా తాగడం వల్లే నా కిడ్నీలు పాడయ్యాయని అందరు అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నా తమ్ముడే నాకు స్లో పాయిజన్ ఇచ్చి నన్ను చంపాలని చూశాడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: హైదరాబాద్ చేరుకున్న తారక్.. ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ హంగామా చూశారా? ‘మా నాన్నకు నలుగురు భార్యలు. మూడో భార్య కొడుకు నా మేనేజర్‌గా పని చేసేవాడు. నా ఎదుగుదలను తట్టుకోలేక నా ఆహారంలో, డ్రింక్స్‌లో స్లో పాయిజన్ కలిపాడు. ఆ విషయాన్ని వైద్యులు గుర్తించారు. అది తెలియక నేను వాడిని చాలా నమ్మాను. నేను వాడి బాగు కోరుకుని ఉద్యోగం ఇస్తే. నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను చంపాలని చూశాడు. అంతేకాదు నా మీద చేతబడి కూడా చేయించాడు. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది’ అంటూ అని చెప్పుకొచ్చాడు. -
చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు
80,90లలో విలన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి సౌత్‌లో మంచి గుర్తింపు పొందిన నటుడు పొన్నంబలం. తమిళ నటుడైన ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రతికథానాయకుడిగా మెప్పించాడు. తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి సౌత్‌లో ఇండస్ట్రీలో విలన్‌గా రాణించాడు. చదవండి: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు ప్రస్తుతం ఆడపదడపా చిత్రాలు చేస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో కనీసం వైద్యం కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీంతో పొన్నంబలం ఆర్థిక సాయం కోసం మెగాస్టార్ చిరంజీవికి మెసేజ్ చేయడంతో ఆయన స్పందించి చేయూత ఇచ్చారని తాజా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. కిడ్నీ సర్జరీ అనంతరం కోలుకున్న ఆయన ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తనకు చిరంజీవి అన్నయ్య వైద్యం చేయించారని తెలిపాడు. చదవండి: వైరస్ వచ్చి నేను తప్ప మగజాతి అంతా పోవాలి: వర్మ సంచలన వ్యాఖ్యలు ‘రెండు సంవత్సరాల క్రితం నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఎవరైనా సాయం చేస్తారాని అని వేచి చూస్తున్నాను. అప్పుడే నాకు చిరంజీవి గుర్తుకు రావడంతో.. నా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకుని మెగాస్టార్ అన్నయ్యకు నా అనారోగ్యం గురించి మెసేజ్ చేశాను. వెంటనే ఆన్నయ్య ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నారు. రాలేను అని చెప్పడంతో సరే అని చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు అని చెప్పారు’ అని తెలిపాడు. మెగాస్టార్ చెప్పినట్లుగానే అక్కడి వెళ్లానని, ఎంట్రీ ఫీజు కూడా లేకుండా నా వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు ఆయనే భరించారు. నా వైద్యానికి మొత్తం రూ. 40 లక్షలు ఖర్చు అయ్యిందని, ఆ మెుత్తం డబ్బును చిరంజీవి ఇచ్చారు. అడగ్గానే లక్ష రూపాయలో లేదా 2 లక్షలో చిరంజీవి సాయం చేస్తారు అనుకున్నా. గానీ 40 లక్షలు ఇస్తారని అనుకోలేదు అంటూ పోన్నంబలం భావోద్వేగానికి గురైయ్యాడు. నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే - నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు - అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు🙏 pic.twitter.com/HHdBcSiwPm — 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) March 15, 2023 -
అడగ్గానే రిప్లై.. వివాదంలో ప్రముఖ నటుడు.!
కన్నుమ్ కన్నుమ్, విమల్ పులివాల్ వంటి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన మరిముత్తుకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఆతను పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. జీవా, పరియేరుమ్ పెరుమాళ్, కొంబన్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. ముఖ్యంగా తిరుచెల్వం దర్శకత్వం వహించిన కౌంటర్-స్విమ్మింగ్ సీరియల్లో అతని పాత్ర మంచి గుర్తింపు వచ్చింది. అలా నటనలో దూసుకెళ్తున్న మరిముత్తు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. అంతే కాకుండా ప్రముఖ దర్శకులైన వసంత్, ఎస్.జె.సూర్య, మణిరత్నం, సీమాన్ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. సోషల్ మీడియాలో ఓ మహిళ నేను మీకు కాల్ చేయొచ్చా అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. అరకొర దుస్తులు ధరించిన ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నటుడు మరిముత్తు వెంటనే ట్విటర్ ఖాతాలో రిప్లై ఇచ్చారు. అందులో ఏకంగా తన మొబైల్ నంబర్ కూడా పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ షాక్ తిన్నారు. ఆ తర్వాత నంబర్ ట్రూ కాలర్‌లో చెక్ చేశారు. ఆయనదే కావడంతో ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మరిముత్తు తనయుడు అఖిలన్ వివరణ ఇచ్చాడు. ఆ పోస్ట్ చేసింది మా నాన్న కాదని చెప్పారు. ఎవరో కావాలనే అలా చేశారని అన్నారు. మా నాన్న నంబర్ చాలామందికి తెలుసని.. అందుకే ఎవరో దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తన వివరణ తర్వాత ఆ నకిలీ రికార్డును తొలగించారు. On behalf of @ActorMarimuthu (his official account) - The account that has commented with his phone number doesn’t belong to him and his phone number is out in the public for quite sometime and it has been misused here. I kindly request @Schumy_Official to remove this post 🙏🏾 — Akilan Marimuthu (@akilangm) February 26, 2023 -
హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా..
ప్రముఖ నటుడు రోబో శంకర్ హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్ చిత్రాలతో ఆయన టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తనదైన నటన, కామెడీ డైలాగ్స్‌తో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించాడు. తమిళంలో మారి చిత్రంతో ఆయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ చానల్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్య్వూ చేసింది. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి ఈ సందర్భంగా రోబో శంకర్ ఇంటిని హోంటూర్గా చేసి తమ యూట్యూబ్‌లో ఛానల్లో షేర్ చేసింది. దీంతో రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ హోంటూర్‌లో రోబో శంకర్ ఇంట అరుదైన చిలకలు కనిపించాయి. దీంతో ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు రోబో శంకర్‌కు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. కాగా ఆయన కొంతకాలంగా అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే అరుదైన జాతి చిలుకలను పెంచుకుంటున్నాడు. చదవండి: బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్ కౌశల్ సంచలన కామెంట్స్, పోస్ట్ వైరల్ హోంటూర్ వీడియోలో వాటిని చూసిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకు ఫిర్యాదు చేయగా రోబో శంకర్ ఇంట వారు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆ చిలుకలను అటవీ శాఖ స్వాధినం చేసుకుని అతడి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఈ చిలుకలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. దీంతో అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్‌పై అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోబో శంకర్ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. రోబో సినిమాతో రోబో శంకర్ గుర్తింపు పొందాడు. -
భాషా తమిళ రీమేక్.. అయితే హీరోగా రజినీకాంత్ కాదట..!
చిత్రసీమలో హిట్ చిత్రాలను రీమేక్ చేయడం అనేది చాలా కాలం నుంచి జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా వచ్చిన కొన్ని చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. గతంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన బిల్లా చిత్రాన్ని అదే పేరుతో దర్శకుడు విష్ణువర్ధన్ చేశారు. రజనీకాంత్ పాత్రలో అజిత్ నటించి హిట్ కొట్టారు. తాజాగా మళ్లీ అలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రజినీకాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం బాషా. ఒక సాధారణ యువకుడు పరిస్థితుల ప్రభావంతో ఎలా అండర్ వరల్డ్ డాన్‌గా మారాడో..? తిరిగి మళ్లీ ఎలా మంచిగా మారి జన స్రవంతిలోకి కలిసిపోయాడు? అన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం టాలీవుడ్‌లోనూ రజనీకాంత్‌కు స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకుడు విష్ణువర్ధన్ కొన్ని మార్పులు చేసి రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులోనూ అజిత్‌ను కథానాయకుడిగా ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. కాగా తునివు చిత్రం తర్వాత అజిత్ తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్ శివన్ వైదొలిగారు. అందుకు కారణం కథలో అజిత్ చెప్పిన మార్పులకు ఈయన అంగీకరించ పోవడమేనని సమాచారం. ఇప్పుడు తాజాగా అజిత్ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తదుపరి విష్ణువర్ధన్ దర్శకత్వంలో భాషా చిత్రానికి రీమేక్‌లో నటించడానికి అజిత్ మరోసారి సాహసం చేస్తారా? అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ప్రముఖ దర్శకుడు, కమెడియన్ కన్నుమూత
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్, కమెడియన్ టీపీ గజేంద్రన్(68) కన్నుమూశారు. గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుని శనివారం ఇంటికి వచ్చారు. కానీ ఆ మరునాడే తుదిశ్వాస విడవడంతో విషాదం నెలకొంది. కాగా టీపీ గజేంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్‌కు క్లోజ్ ఫ్రెండ్. 1985లో చిదంబర రహస్యం సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు టీపీ గజేంద్రన్. 1988లో వీడు మనైవి మక్కల్ మూవీతో దర్శకుడిగా మారారు. బడ్జెట్ పద్మనాభం, చీనా తానా, మిడిల్ క్లాస్ మాధవన్, బండ పరమశివం వంటి సహా తమిళంలో పలు కామెడీ చిత్రాలను తెరకెక్కించారు. దాదాపు వంద సినిమాల్లో నటించిన ఆయన చివరగా యోగిబాబు పన్ని కుట్టి చిత్రంలో కనిపించారు. చదవండి: హీరోయిన్ ఇంట పెళ్లి సందడి.. ఫోటో షేర్ చేసిన హలో బ్యూటీ -
నటుడు ఆత్మహత్య, మరణానికి ముందు రెండో భార్య చిత్రహింసలు!
తమిళ నటుడు, డ్యాన్సర్ రమేశ్ తన పుట్టినరోజు(జనవరి 27)నే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! కొద్దిరోజుల క్రితం ఆయన 10వ అంతస్థు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అతడి చావుకు రెండో భార్య కారణమంటూ మొదటి భార్య సంచలన ఆరోపణలు చేసింది. చనిపోవడానికి ముందు రమేశ్‌ను చిత్రహింసలు పెట్టిందని ఆరోపించింది. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియోను సైతం రిలీజ్ చేసింది. ఇందులో రమేశ్‌ను అతడి రెండో భార్య దారుణంగా హింసించినట్లు కనిపిస్తోంది. చేతిలో ఓ పొడవాటి కట్టె పట్టుకుని అతడిని చితకబాదినట్లు తెలుస్తోంది. ఓపక్క తనను కొట్టవద్దని రమేశ్ టేబుల్ ఫ్యాన్‌ను అడ్డుగా పెట్టుకుని ప్రాధేయపడుతుండగా అతడి రెండో భార్య, కూతురు మాత్రం చచ్చిపోమని శాపనార్థాలు పెడుతుండటం గమనార్హం. నా వల్ల కాదు, చచ్చిపోయేలా ఉన్నానంటూ రమేశ్ బాధతో విలవిల్లాడుతుంటే ఉరితాడు తీసుకురమ్మంటావా? అని కూతురు అడగడం మరింత షాకింగ్‌గా ఉంది. వీడియో చివర్లో రెండో భార్య సోఫాలో పెద్ద కట్టెతో కూర్చుని ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా రమేశ్ టిక్‌టాక్ డ్యాన్స్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. దీంతో అతడికి డ్యాన్స్ జోడి డ్యాన్స్ అనే రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షోలోతో మరింత గుర్తింపు రావడంతో అతడికి సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. ఇటీవలే తునివులో నటించిన రమేశ్ రజనీకాంత్ జైలర్‌లోనూ నటించినట్లు తెలుస్తోంది. చదవండి: పెళ్లిపీటలెక్కిన దర్శకుడు, ఫోటో వైరల్ చాలా త్వరగా వెళ్లిపోయావ్.. మిస్‌యూ: నమ్రత ఎమోషనల్ పోస్ట్ -
గర్భవతి పూజా.. స్విమ్మింగ్ పూల్‌లో ముద్దులాట..
బిగ్‌బాస్ కంటెస్టెంట్ పూజా రామచంద్రన్, తునివు విలన్ జాన్ కొకెన్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే! గతేడాది నవంబర్‌లో తాను గర్భవతినన్న విషయాన్ని అభిమానులతో పంచుకుందీ నటి పూజా. 'అనేక భావోద్వేగాల మిళితమైన మా ప్రయాణం మరో కీలక దశకు చేరుకుంది. త్వరలో మా కుటుంబంలోకి మరొక వ్యక్తి రాబోతున్నారోచ్' అంటూ ట్వీట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ తర్వాత భర్తతో కలిసి థాయ్‌లాండ్‌కు వెకేషన్‌కు వెళ్లింది. కడుపులో ఉన్న బిడ్డ కోసం యోగా కూడా చేస్తూ ఆ వీడియోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తాజాగా ఈ జంట మరోసారి విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. తునివు సక్సెస్‌తో ఆనందంలో ఉన్న జాన్.. తన భార్యను వెంటపెట్టుకుని టూర్‌కు చెక్కేశాడు. అక్కడ భార్యాభర్తలిద్దరూ స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాటలు ఆడారు. జాన్ చంకలో ఎక్కిన పూజా అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ ఫోటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) చదవండి: ప్రముఖ నిర్మాతకు హార్ట్ సర్జరీ రెండు గ్రాముల గోల్డ్ కాయిన్స్ పంచిన కీర్తి సురేశ్ -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వారసుడు.. ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇటీవల చెన్నైలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్ల చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. అలాగే ఓవర్సీస్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటగా.. ఆస్ట్రేలియాలో 500 కె డాలర్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో విజయ్ డ్యాన్స్, పాటలు, కామెడీ, యాక్షన్‌తో కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తోంది. #Varisu has crossed the A$500K mark in Australia 🇦🇺 pic.twitter.com/AaNXF48oHh — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 #Varisu crosses the Million mark in USA 🇺🇸 pic.twitter.com/XPEWGkbt2K — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 #Varisu has joined the ₹ 150 Crs Gross Club at the WW Box office.. pic.twitter.com/1i95Nk9f4Z — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 -
'బిచ్చగాడు' హీరోకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు దాదాపు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై భారీగా పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్–2 (బిచ్చగాడు-2) తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతుండడం ప్రత్యేకత. అయితే తాజాగా విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ వాటర్ బోట్లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బిచ్చగాడు టాలీవుడ్‌లోనూ ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో అమ్మ కోసం 48 రోజుల పాటు రహస్య జీవితాన్ని గడిపే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు, హీరోగా పిచైక్కారన్- 2 చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, వై.జి.మహేంద్రన్, అజయ్ ఘోష్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఈ ఏడాది తమిళరసన్, అగ్ని సిరగుగల్, ఖాకీ, కొలై, రథం, మజై పిడిక్కత మనితన్ లాంటి తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నారు. -
నటుడితో లవ్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
సినీ జంటలు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు.. నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఆరేళ్లకు పైగా ప్రేమించుకుని గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. నానుమ్ రౌడీదాన్ సినిమా షూటింగ్ వీరి ప్రేమకు ఆజ్యం పోసింది.ఇంకా నటి స్నేహ నటుడు ప్రసన్నది కూడా ప్రేమ వివాహమే. అచ్చముండు అచ్చముండు చిత్రం షూటింగ్ సమయంలో వీరి ప్రేమకు బీజం పడింది. తాజాగా మలయాళ బ్యూటీ, పొన్నియిన్ సెల్వన్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ప్రేమలో పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మాస్టర్, ఖైదీ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు అర్జున్‌దాస్‌తో లవ్‌లో ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసిన భామ దానికి లవ్ సింబల్‌ను జోడించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. మరి వీరి మధ్య ప్రేమ ఎలా కుదిరిందబ్బా? అని నెటిజన్లు ఓపక్క ఆశ్చర్యపోతూనే మరోపక్క శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తమది ప్రేమ కాదంటోంది ఐశ్వర్య. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేసింది. 'నా పోస్ట్ ఇంతలా పేలుతుందని ఊహించలేదు. మేమిద్దరం సరదాగా కలిశాం, ఓ ఫోటో దిగాం. దాన్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశా.. అంతే! మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే, అంతకుమించి మా మధ్య ఏం లేదు. నిన్నటినుంచి ఒకటే పనిగా మెసేజ్ చేస్తున్న అర్జున్ దాస్ ఫ్యాన్స్ అందరికీ క్లారిటీ ఇస్తున్నా.. అర్జున్ మీవాడు..' అని రాసుకొచ్చింది. ఒక్క పోస్ట్‌తో అర్జున్‌తో డేటింగ్ రూమర్స్‌కు చెక్ పెట్టింది ఐశ్వర్య. చదవండి: కొత్త బంగారు లోకం హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా? క్యాన్సర్‌తో చచ్చిపోయినా ఓకే కానీ ట్రీట్మెంట్ తీసుకోను: సంజయ్ దత్ -
వారీసు సినిమా చూశా.. త్వరలోనే గుడ్ న్యూస్: లోకేశ్
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వారిసు. భారీ అంచనాల మధ్య ఈనెల 11న ఈ చిత్రం విడుదలైంది. అయితే విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించడానికి విజయ్ సిద్ధమైనట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు మాస్టర్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది విజయ్ 67వ చిత్రం కాగా.. ఇందులో త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధింన పూర్తి వివరాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూడా ఈ చిత్రంపై మౌనం వహిస్తున్నారు. కాగా బుధవారం విడుదలైన వారిసు చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ చెన్నైలోని థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..'వారిసు చిత్రం విడుదల కోసం ఎంతో అత్రుతగా ఎదురు చూశా. ఇకపై విజయ్ 67వ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. ఇది విజయ్ అభిమానుల్లో జోష్ నింపుతుంది.' అని అన్నారు. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ భారీ విజయం తర్వాత దళపతి విజయ్‌తో లోకేష్ కనగరాజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ ప్రాజెక్ట్‌తో తమిళ సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, అర్జున్ దాస్ సహా స్టార్ తారాగణం నటిస్తున్నారు. -
సంక్రాంతికి బుల్లితెరపై సూర్య తండ్రి శివకుమార్ తిరుక్కురళ్ 100
తమిళసినిమా: సీనియర్ నటుడు, హీరో సూర్య తండ్రి శివకుమార్ గొప్ప నటుడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఉత్తమ నటుడుగా కంటే మంచి చిత్ర కళాకారుడు అనిపించుకోవడమే గర్వంగా భావిస్తారు. శివకుమార్ మంచి చిత్రకారుడు అన్న విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాలకు పైగా కథానాయకుడిగా సాంఘిక, చారిత్రక, పౌరాణిక కథా చిత్రాలు చేసి శభాష్ అనిపించుకున్న శివకుమార్ నటనకు స్వస్తి చెప్పి దశాబ్దంన్నరకు పైనే అయ్యింది. అయితే ఆయన ప్రశాంతి దశలో మాత్రం లేరు. కంబ రామాయణం, మహాభారతం వంటి పురాణం గ్రంథాలను అవపోసన చేసి వేదికలపై గంటల తరబడి ప్రవచనాలు చెబుతూ ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తున్నారు. తాజాగా తిరుక్కురళ్ 100 పేరుతో ముఖ్య అంశాలకు తన జీవిత అనుభవాలను జోడించి ఓ గ్రంథాన్ని రచించారు. దానిని ఇటీవల ఈరోడ్‌లో వేలాదిమంది ప్రేక్షకుల సమక్షంలో ఏకధాటిగా ఉపన్యసించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇంతకుముందు పరిధి పరిమేలముగర్ నుంచి సాల్మన్ పాపయ్య వరకు పలువురు ప్రముఖ రచయితలు తిరుక్కురళ్‌కు పరిభాషను రచించారు. అయితే తిరుక్కురళ్‌లోని ముఖ్య అంశాలకు తన అనుభవాలను జోడించి రచించింది నటుడు శివకుమారేనని అభినందనలు అందుకుంటున్నారు. కాగా ఈయన రాసి, ఉపన్యసించిన తిరుక్కురళ్ 100 కార్యక్రమాన్ని పుదియ తలైమురై టీవీ ఛానల్ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రచారం చేయనుంది. అదే విధంగా పుదుయుగం ఛానల్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ప్రచారం చేయనుందని నటుడు శివకుమార్ శనివారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. -
'గ్రౌండ్లో ఎంతమంది ఉన్నా.. చూసేది ఆ ఒక్కడినే'.. వారసుడు ట్రైలర్
తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కించిన చిత్రం 'వారిసు'. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తుండగా.. తమన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ కథా చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్య నటుడు శివ నారాయణమూర్తి కన్నుమూశారు. కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కోలీవుడ్ విషాదం నెలకొంది. ఆయన మృతికి తమిళ నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా ప్రస్తుతం శివ నారాయణమూర్తి భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం తమిళనాడులోని పట్టుకోట్టై జిల్లాలోని ఆయన నివాసంలో ఉంచారు. ఈరోజు (డిసెంబర్ 8) సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. శివ నారాయణమూర్తికి భార్య పుష్పవల్లి, ఇద్దరు కుమారులు లోకేష్, రామ్‌కుమార్, ఒక కుమార్తె శ్రీదేవి ఉన్నారు. తమిళ ఇండస్ట్రీలోకి మురళి హీరోగా నటించిన ‘పూంతోట్టం’ మూవీతో ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో శివ నారాయణమూర్తి 200లకుపైగా చిత్రాల్లో నటించారు. చదవండి: స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్ -
మధ్యలో ఆగిపోయిన స్టార్ హీరో సినిమా.. కారణం అదే..!
కోలీవుడ్‌లో తమిళ స్టార్ హీరో సినిమా ఆగిపోయింది. ప్రముఖ దర్శకుడు బాల, స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అచలుడు(తమిళంలో వనంగాన్)'. అయితే పరస్పర అంగీకారంతోనే సూర్య తప్పుకుంటున్నట్లు డైరెక్టర్ బాల వెల్లడించారు. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేసినందున సూర్యకు సరిపోదని దర్శకుడు అన్నారు. కథపై ఉన్న నమ్మకంతోనే సూర్య ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని.. అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు దర్శకుడు. త్వరలోనే మరో కొత్త హీరోతో ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ బాల తెలిపారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు 40శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నంద, శివపుత్రుడు చిత్రాలు పలు ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రంలో సూర్య మత్స్యకారునిగా కనిపించనుండగా.. కృతి శెట్టి తమిళంలో ఈ సినిమాతో అరంగేట్రం చేయనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తుండగా.. సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డ్రామాను దాదాపు పది భాషల్లో విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
10 రోజులు.. 5 కోట్లు.. యూట్యూబ్ మొత్తం షేక్..!
కోలీవుడ్ స్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. టాలీవుడ్లో ఈ చిత్రాన్ని 'వారసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'రంజితమే' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్‌ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది. (చదవండి: 'వారీసు' బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ అవుట్) ఈ మాస్ సాంగ్ విడుదలై పది రోజులవుతోన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. రోజురోజుకు ఈ పాటకు ఆదరణ మరింత పెరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఈ సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఇప్పటిదాకా 5 కోట్ల వీక్షణలు, 18 లక్షల లైక్స్ సొంతం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. జయసుధ, ఖుష్భూ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. The sensational #Ranjithame hits 50M views 🔥 📽️ https://t.co/Q56reRe9tc 🎵 https://t.co/gYr0tkVJkD#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani @TSeries #RanjithameSong #Varisu #VarisuPongal pic.twitter.com/l8ElaoR20h — Sri Venkateswara Creations (@SVC_official) November 16, 2022 -
మాజీ భర్తకు కాజల్ సర్ప్రైజ్.. విడాకులు తీసుకున్న పదేళ్లకు..!
తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్. అతను నటి కాజల్ పశుపతిని వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని విభేదాల కారణంగా ఈ జంట 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ తాజాగా అకస్మాత్తుగా మాజీ భార్య కాజల్ అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చింది. విడాకులు తీసుకుని పదేళ్లకు ఆమె శాండీ ఇంటికి వెళ్లడంతో షాక్‌కు కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. అయితే ఇటీవలే శాండీ ఇంటికి వెళ్లిన కాజల్ పసుపతి అతని భార్య సిల్వియా, ఇద్దరు పిల్లలు లాలా, షాన్ మైఖేల్‌తో మాట్లాడారు. అంతే కాకుండా శాండీ కుటుంబంతో ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. విడాకుల తర్వాత కూడా ఈ జంట కలవడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా మంచి స్నేహం కొనసాగించడంపై కాజల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసిన కాజల్.. 'శాండీ, సిల్వియా మీరు, మీ పిల్లలు సంతోషంగా ఉండాలి" అంటూ తన ఫేస్బుక్లో రాసుకొచ్చింది. గతంలో శాండీ, సిల్వియా వివాహంపై కాజల్ విమర్శలు చేసింది. కానీ ఆ తర్వాత శాండీకి శుభాకాంక్షలు తెలిపింది. తమ విడాకులపై శాండీని నిందించవద్దని.. అలాగే అతని రెండో భార్యను లక్ష్యంగా చేసుకోవద్దని ఆమె తన అభిమానులను అభ్యర్థించింది. కాగా.. 2019లో కాజల్ ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించింది. View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) -
హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్.. ట్వీట్ వైరల్
తమిళ స్టార్ హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని హీరో తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. టాలీవుడ్‌లోనూ కార్తికి భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురి కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. (చదవండి: ఓటీటీలో కార్తీ బ్లాక్ బస్టర్ మూవీ 'సర్దార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) ఆయన ట్విటర్లో రాస్తూ..' హలో గాయ్స్. నా ఫేస్ బుక్ పేజీ హ్యాక్ చేయబడింది. దీనిపై మేం ఫేస్ బుక్ బృందంతో పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఇటీవలే కార్తీ హీరోగా నటించిన చిత్రం సర్దార్ సూపర్ హిట్‌గా నిలిచింది. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కార్తీ కెరీర్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లతో బెస్ట్ మూవీగా నిలిచింది. Hello guys, my Facebook page has been hacked. We are trying to restore it with Fb team. — Karthi (@Karthi_Offl) November 14, 2022 -
హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. అలా తరచూ వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలిచే చిన్మయి తాజాగా ఓ నటుడిపై ఫైర్ అయ్యింది. పబ్లిక్‌లో ఓ హీరోయిన్ను పాయింట్ అవుట్ చేస్తూ చేసిన అతడి వ్యాఖ్యలను తప్పుబట్టింది. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్, నటి దర్శగుప్తా లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ఓ మై ఘోస్ట్. ఇందులో తమిళ నటుడు సతీష్ ఓ కీ రోల్ పోషించాడు. చదవండి: రష్మికపై ఇంత నెగిటివిటీకి కారణం ఇదే! ఆ ఒక్క మాటకే విమర్శల దాడి ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సన్నీలియోన్ సాంప్రదాయంగా చీరకట్టులో రాగా దర్శగుప్తా మోడ్రన్ లెహెంగాలో వచ్చింది. ఇదే అంశంపై ఈవెంట్లో నటుడు సతీశ్ మాట్లాడుతూ నటి దర్శగుప్తాను ఉద్దేశిస్తూ పబ్లిక్‌గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ... ‘ఎక్కబో ముంబై నుంచి తమిళనాడుకు వచ్చిన సన్నీలియోన్ పద్ధతిగా చీరకట్టుకుని వచ్చారు. చూడటానికి ఆమె చాలా అందంగా ఉన్నారు. కానీ అటూ చూడండి మన దగ్గరి అమ్మాయి మాత్రం మోడ్రన్ డ్రెస్ వేసుకుని వచ్చింది’ అంటూ దర్శగుప్తాను చూపిస్తూ అన్నాడు. చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా? అంతేకాదు తానేమి ఆమెను విమర్శించడం లేదని, జస్ట్ పాయింట్ అవుట్ చేశానంతేనని అనడంతో అక్కడి వచ్చిన వారంత పగలపడి నవ్వారు. ఇక అతడి వ్యాఖ్యలపై చిన్మయి స్పందించింది. మహిళల డ్రస్సింగ్‌పై బహిరంగంగా కామెంట్స్ చేయడాన్ని ఆమె తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ ఆమె ఘాటుగా స్పందించింది. ‘ఒక స్త్రీని లక్ష్యంగా చేసుకుని, ఆమె వేసుకున్న డ్రెస్‌పై విమర్శలు చేయడమేంటి? ఆ మాటలకు జనాలు పగలబడి నవ్వడం ఏంటి? మహిళల డ్రస్‌పై విమర్శలు చేసే ఇలాంటి మగాళ్ల ప్రవర్తన ఇంకెప్పుడు మారుతుందో? ఇదేం అంత సరద విషయం కాదు’ అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాత్రమే నటుడు కామెంట్స్‌పై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. అలా బహిరంగంగా ఓ నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. I mean - To actually *point* at a woman and ask for mass heckling of a crowd by a man on a woman who doesn’t dress according to culture. When will this behaviour from men stop? Its not funny. pic.twitter.com/HIoC0LM8cM — Chinmayi Sripaada (@Chinmayi) November 9, 2022 -
బుల్లితెర నటుడి భార్య మృతి, డైట్ మార్పులే కారణమా?
తమిళ నటుడు భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని (43) కన్నుమూశారు. గత కొన్నివారాలుగా కోమాలో ఉన్న ఆమె సోమవారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి డైట్ మార్పులే కారణమని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్ స్టార్ట్ చేశారు. సడన్‌గా ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో ఆమె రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయాయట. మూడు నెలల క్రితం పరిస్థితి సీరియస్ కావడంతో ఆమెను చెన్నైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లగా తాజాగా మరణించారు. కాగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా పేరు తెచ్చుకున్న కల్యాణ్ కుమార్ తనయుడే భరత్ కల్యాణ్. మొదట్లో సినిమాలు చేసిన ఆయన తర్వాత బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. అపూర్వ రంగల్, వంశం, జమిలా వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు భరత్ కల్యాణ్. చదవండి: ప్రముఖ బుల్లితెర నటి మృతి ఇనయను ఆడుకున్న హౌస్మేట్స్, శ్రీహాన్ లాస్ట్ పంచ్ అదిరింది -
నటి దివ్య కేసులో కొత్త ట్విస్ట్, ఆమె కంటే ముందు ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ, పెళ్లి
బుల్లితెర నటులు దివ్య, అర్నవ్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తనని మోసం చేశాడంటూ అర్నవ్‌పై దివ్య ఇటీవల ఆరోపణలు చేయగా.. తన భార్యకు మతిస్థిమితం సరిగా లేదంటూ అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా దివ్య కంటే ముందు అర్నవ్ తనని పెళ్లి చేసుకున్నాడంటూ ప్రియదర్శిని అనే ట్రాన్స్‌జెండర్ సంచలన ఆరోపణలు చేసింది. చదవండి: భర్త జయంతి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నటి మేఘన ఈ మేరకు ఆమె ఓ ఆడియో రికార్డ్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలయాళంలో ఉన్న ఈ ఆడియోలో ప్రియాంక ఏం చెప్పుకొచ్చిందంటే.. ‘నాకు, అర్నవ్‌తో టీ నగర్లో పరిచయం ఏర్పడింది. మా పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరం ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల పాటు ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మా వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగింది. అయితే ఉన్నట్టుండి అర్నవ్లో సడెన్‌గా మార్పు వచ్చింది. తరచూ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అయితే అతడికి మరో మహిళతో పరిచయం వల్లే నన్ను వేధించడం స్టార్ట్ చేశాడు. నన్ను తీవ్రంగా హింసించాడు. ఎనిమిదేళ్లు అతడి వేధింపులు భరించాను. అర్నవ్ ఓ సైకో’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్ బాబు ఇక అతడి వేధింపులు తట్టుకోలేక తాను అర్నవ్ నుంచి విడిపోయానంటూ ప్రియదర్శిని తెలిపింది. ఇదిలా ఉంటే కేలాడి కన్మణి అనే సీరియల్ షూటింగ్లో సమయంలో నటి దివ్య, అర్నవ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2022 జూన్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భంగా దాల్చింది. ఇప్పుడు అర్నవ్ తనని వదిలేసి మరో నటితో క్లోజ్‌గా ఉంటున్నాడంటూ దివ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
గృహహింస కేసు.. విచారణకు గడువు కోరిన నటుడు
తమిళసినిమా: బుల్లితెర నటుడు అర్ణవ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావడానికి గడువు కోరాడు. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర జంట అర్ణవ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తన భర్త తనని కొట్టి, చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ స్థానిక పోరర్ మహిళా పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో గృహహింస, హత్య బెదిరింపులు విభాగాల్లో కేసు నవెదు చేసి, విచారణ చేపట్టారు. అందులో భాగంగా నటుడు అర్ణవ్‌ను విచారణకు రావాల్సిందిగా పలుమార్లు సమన్లు పంపినా అతను హాజరు కాలేదు. చివరిగా శుక్రవారం హాజరు కావాలని లేని పక్షంలో అరెస్టు చేయాల్సి ఉంటుందని సమన్లు జారీ చేశారు. అయితే అర్ణవ్ పరారీలో ఉన్నట్లు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కంటికి గాయం కారణంగా తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని, అందువలన విచారణకు హాజరు కావడానికి గడువు కావాలని, ఈ నెల 18వ తేదీన హాజరవుతానని తన న్యాయవాది ద్వారా ఓ లేఖను పోలీసులకు పంపారు. దీంతో అతనిపై చర్యలు తీసుకునే విషయమై పోలీసులు అధికారులు చర్చలు జరుపు తున్నారు. -
దివ్య భర్తపై ముద్దుల వర్షం.. నటి అన్షిత ఆడియో కాల్ లీక్
కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్- దివ్యల వివాదం మరింత ముదురుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తను గర్భం దాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ దివ్య శ్రీధర్.. అర్ణవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. 'చెల్లమ్మ' సీరియల్ నటి అన్షిత.. దివ్యపై ఫైర్ అయిన ఆడియో కాల్ నెట్టింట లీక్ అయింది. ఇందులో దివ్యను రెచ్చగొట్టేలా ఆమె అర్ణవ్‌కు ప్రపోజ్ చేస్తూ ముద్దులు పెట్టింది. ఆ ఆడియో కాల్లో అన్షిత మాట్లాడుతూ.. నాకేం చేయాలనిపిస్తే అదే చేస్తా. మీ జీవితాల్లోకి నేను రావాలనుకుంటున్నావా? అని అడిగింది. అందుకు దివ్య.. నువ్వొక ఆడదానివేనా? ఇంకో ఆడదాని జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? అని ప్రశ్నించగా.. నిన్ను కొట్టి చంపాలన్నంత కోపం ఉందని బదులిచ్చింది అన్షిత. నీవల్ల నా భర్త జీవితం ఇబ్బందుల్లో పడుతుందని తెలిసినప్పుడు ఒక స్నేహితురాలిగానైనా అతడి లైఫ్ నుంచి పక్కకు తప్పుకోవచ్చు కదా అని కోరింది దివ్య. అలా ఇద్దరూ వాదులాడుకుంటున్న సమయంలో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న అర్ణవ్‌కు అన్షిత ఏకంగా ప్రపోజ్ చేసింది. అర్ణవ్, ఐ లవ్ యూ సో మచ్.. అంటూ అతడికి ఫోన్లోనే ముద్దుల వర్షం కురిపించింది. నీ ముందే నీ భర్తకు ముద్దు పెట్టా, ఇప్పుడేం చేస్తావ్? అని రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ ఆడియోకాల్ వైరల్‌గా మారింది. కాగా దివ్యకు 2012లోనే ఓ వ్యక్తితో పెళ్లై పాప కూడా ఉంది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆమె సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అతడి కోసం మతం కూడా మార్చుకుంది. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. ఆ సమయంలో ఆమెకు గతంలో పెళ్లై పాప కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మరోవైపు అర్ణవ్ వేరే నటితో సంబంధం పెట్టుకున్నాడని దివ్య ఆరోపిస్తోంది. ఈ విషయంపై దివ్య అటు పోలీసులకు ఇటు కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసింది. చదవండి: జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం, హీరో అరెస్ట్ బిగ్‌బాస్ షో నుంచి అతన్ని తీసేయండి -
సీరియల్ నటుడి ఆత్మహత్య
ప్రముఖ తమిళ నటుడు లోకేశ్ రాజేంద్రన్(34) ఆత్మహత్య చేసుకున్నారు. అక్టోబర్ 2న చెన్నైలోని ఓ బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే స్థానికులు అతడిని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా తమిళ సీరియల్ మర్మదేశంలో బాలనటుడిగా అలరించిన లోకేశ్ రాజేంద్రన్ 150కిపైగా సీరియల్స్, 15 సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా ఆయన కుటుంబ కలహాలతో సతమతమవుతున్నట్లు లోకేశ్ తండ్రి మీడియాకు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే లోకేశ్‌కు అతడి భార్య నుంచి విడాకుల నోటీసులు వచ్చాయని, ఈ కారణంగానే అతడు డిప్రెషన్లోకి వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు. తన కొడుకును చివరిసారిగా శుక్రవారం చూశానని తెలిపారు. తనకి కొంత డబ్బు కావాలని అడిగితే ఇచ్చానని, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు లోకేశ్ తండ్రి. కాగా లోకేశ్‌కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. చదవండి: ఆదిపురుష్‌పై అయ్యవారి ఆగ్రహం ఖరీదైన కారు కొన్న షణ్ముఖ్ జశ్వంత్ -
'గాడ్'తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న తమిళ స్టార్!
"కొంజుం వెయిల్ కొంజుం మలయ్ కాధలుక్కు ఇల్లై, గాంతం" చిత్రాలతో తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ "తేజ్" త్వరలో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తేజ్ ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ రోల్ చేస్తున్న "గాడ్" తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. తేజ్ ప్రస్తుతం కన్నడలో "రామాచారి -2"లో నటిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల కానుంది. "గ్లోరి ఆఫ్ డెమన్" అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న "గాడ్" చిత్రంలో ప్రఖ్యాత కన్నడ నటుడు డాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. తేజ్ నటిస్తున్న కన్నడ చిత్రం "రామాచారి -2" చిత్రం కూడా తెలుగులో విడుదల చేయనున్నారు. చదవండి: సీతారామం సక్సెస్ మీట్‌కు సుమంత్ గైర్హాజరు, ఎందుకో చెప్పిన హీరో ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ -
కుప్పంలో తమిళ యాక్టర్ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
సాక్షి, చిత్తూరు జిల్లా: ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి సిఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించాం. ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించట్లేదు. విద్య, వైద్యంకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా అనేక పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించగలరు అని సీఎం గుర్తించారు. ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చదవండి: (దళారీలకు టీటీడీ చెక్.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం) కుప్పంలో పోటీపై పెద్దిరెడ్డి క్లారిటీ '2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు 175 సాధిస్తుంది. కుప్పంలో పోటీపై ఎల్లో మీడియా.. తమిళ యాక్టర్‌తో మంతనాలు అని వార్తలు రాసింది. 2024లో కుప్పం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ మాత్రమే. గతంలో పలమనేరులో మేము గెలిపించిన వ్యక్తి.. వేరే పార్టీకి పోయి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వెంకటే గౌడను మరింత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. సీఎం వైఎస్ జగన్‌కు మనమంతా ఎప్పుడు అండగా నిలవాలి అని ప్రజల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’) -
హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు
తమిళ సీనియర్ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విజయకాంత్ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆయన కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది. చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని కూడా పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్వీట్ చేశాడు. ‘నా ప్రియ మిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకుని మునుపటిలా కెప్టెన్‌గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ రజనీ పేర్కొన్నాడు. என் அருமை நண்பர் விஜயகாந்த் அவர்கள் விரைவில் குணமடைந்து பழையபடி கேப்டனாக கர்ஜிக்க வேண்டும் என்று எல்லாம் வல்ல இறைவனை வேண்டுகிறேன். — Rajinikanth (@rajinikanth) June 21, 2022 -
మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లిన నటుడు
సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత టి.రాజేందర్ ఇటీవల అనూహ్యంగా గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని స్థానిక పోరూరులోని రామచంద్ర ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించే క్రమంలో వైద్యులు టి.రాజేందర్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో బ్లాక్ ఏర్పడిందనే విషయాన్ని గుర్తించారు. అత్యవసర చికిత్సతో ఆయన కోలుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల పరామర్శించి వచ్చారు. ఇప్పటికీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాజేందర్‌ను ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మంగళవారం సాయంత్రం అమెరికాకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు భార్య ఉష, కుమారులు నటుడు శింబు, కురళరసన్, కూతురు ఇళఖ్య ఉన్నారు. చదవండి: నజ్రియాతో కలిసి నాని భార్య స్టెప్పులు.. వీడియో వైరల్ ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ -
హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు
చెన్నై సినిమా: కోలీవుడ్ హీరో విమల్ చీటింగ్ చేశారంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మన్నన్ వగైయారా. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి తనను మోసం చేశారని విమల్‌పై నిర్మాత గోపి గత వారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్ కూడా కంప్లైట్ ఇచ్చారు. తాజాగా మరో నిర్మాత గణేశన్ కూతురు హేమ మంగళవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో నటుడు విమల్ పై రూ. 1.74 కోట్లు మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. అందులో తిరుప్పూర్‌కు చెందిన తమ కుటుంబం మాంసం విక్రయం వృత్తి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఎదిగిందని పేర్కొన్నారు. కాగా సినిమా అంటే వ్యామోహం కలిగిన తన తండ్రి గణేశన్.. విమల్ హీరోగా మన్నర్ వగైయారా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారన్నారు. అలా ప్రారంభమైన చిత్ర షూటింగ్ హీరో హీరోయిన్ల మధ్య విభేదాల కారణంగా నిలిచిపోవడంతో ప్రొడక్షన్ ఖర్చు పెరిగిందన్నారు. దీంతో తన తండ్రి చిత్ర నిర్మాణం నిలిపేసి ఊరికి తిరిగొచ్చేశారని, ఆ తరువాత విమల్ తమ తండ్రిని కలిసి చిత్రాన్ని తానే నిర్మిస్తానని, మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ రాశారన్నారు. అయినా తమ డబ్బు చెల్లించకపోవడంతో తాము చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దీంతో విమల్ తమను కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని, పిటిషన్‌ను వాపస్ తీసుకోమని కోరారన్నారు. చిత్రం విడుదలైనా తమకు నగదు చెల్లించకపోగా చిత్ర తెలుగు అనువాద హక్కులను అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుని తమ రూ.1.74 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: చరణ్ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1631343214.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోల కోసమే వందల కోట్లు ఖర్చు, అందుకే కోలీవుడ్ నశించిపోతోంది!
తెలుగు సినిమానే అగ్రస్థానంలో ఉందని సీనియర్ దర్శకుడు భారతీరాజా పేర్కొన్నారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై పి.శశికుమార్ నిర్మించిన చిత్రం ఆధార్. కరుణాస్ కథా నాయకుడిగా నటించాడు. ఈ చిత్రానికి రాంనాథ్ పళణికుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. శ్రీకాంత్ దేవా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ.. చిత్ర ట్రైలర్లో కరుణాస్ పసిబిడ్డతో రోడ్డులో నడుస్తున్న దృశ్యం చూడగానే తన కళ్లు చెమర్చాయన్నారు. సినిమా ద్వారా మనకు వచ్చే పేరు, ప్రఖ్యాతలు వేరే ఎక్కడా లభించవన్నారు. నటుడు, నిర్మాత అరుణ్ పాండ్యన్ మాట్లాడుతూ సినిమా రూ.410 కోట్లతో రూపొందిస్తే అందులో రూ.10 కోట్లే కథకు ఖర్చుపెట్టి మిగిలింది నటులు తమ కోసమే ఖర్చు పెట్టిస్తున్నారని, అలా తమిళసినిమా నశించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం తమిళ సినిమాల కంటే తెలుగు సినిమాలు బ్రహ్మాండంగా రూపొందుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయన్నారు. తమిళం, మలయాళం చిత్రాల కంటే తెలుగు సినిమానే అగ్రస్థానంలో ఉందని భారతీరాజా పేర్కొన్నారు. చదవండి: షారుక్ కోసం ముంబైలో పంజాబ్ సెట్! హైదరాబాద్‌లో ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్, ఎప్పుడంటే? -
విపరీతమైన ఒళ్లు నొప్పులు, జ్వరం: విష్ణు విశాల్
తమిళ నటుడు విష్ణు విశాల్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడు ఆదివారం నాడు ట్విటర్లో వెల్లడించాడు. '2022.. 'పాజిటివ్' రిజల్ట్‌తో ప్రారంభించాను. అవును, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గడిచిన వారం రోజుల్లో నన్ను కలిసినవాళ్లందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. విపరీతమైన ఒళ్లు నొప్పులున్నాయి, ముక్కు పనిచేయడం లేదు. గొంతుమంటగా ఉంది. అలాగే జ్వరం కూడా వచ్చింది. వీలైనంత త్వరగా దీని నుంచి బయటపడతానని అనుకుంటున్నాను' అని ట్వీట్ చేశాడు. 2022 Starting wid a +IVE result..🤕 Guys ... Yes im covid +ive... Anyone who came in contact with me in the last 1 week please take care.. Horrific body pains and nose block,itchy throat n also mild fever.. Looking forward to bounce back soon🙏 — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) January 9, 2022 కాగా అతడు జనవరి 7న మాస్ మహారాజ రవితేజతో దిగిన ఫొటో షేర్ చేశాడు. దీంతో విష్ణు రెండు రోజుల క్రితం రవితేను కలిశాడా? అంటూ అభిమానులు ఆరా తీయగా దీనిపై స్పందించిన విష్ణు అది పాత ఫొటో అని, భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే అతడు చివరగా 'అరణ్య' సినిమాలో కనిపించాడు. విష్ణు నటించిన ఎఫ్ఐఆర్, మోహన్‌దాస్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. With The #MassMaharaja @RaviTeja_offl sir.. Starting the year with a fantastic collaboration.. A super positive actor and great human being... Someone who believed in me right from our first meeting.. Official details soon:) But right now time to stay safe and stay strong🙏 pic.twitter.com/ELMnTKFyrc — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) January 7, 2022 -
ఆర్య కొత్త చిత్రం ప్రారంభం
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆర్య.ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 33వ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ది షో పీపుల్, థింగ్స్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ఇది. నాయిగళ్ జాగ్రత్తై, మిరుదన్, టిక్ టిక్ టిక్, రెడీ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, త్యాగరాజన్, కావ్య శెట్టి, హరీష్ ఉత్తమన్, గోకుల్, భరత్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, యువ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. చదవండి: ‘లైగర్’ పాటలో విజయ్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు: చార్మీ -
తమిళ నటుడు శ్రీకాంత్ మృతి.. ప్రముఖుల నివాళి
తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. వయసు పైబడడంతో వచ్చిన అనారోగ్య కారణాలతో మరణించిన ఆయనకి ఎంతోమంది కోలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా నివాళి తెలిపారు. ఆయనతో పాటు భైరవి, సాధురంగం వంటి చిత్రాలలో కలిసి పనిచేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రియమైన స్నేహితుడి మరణం చాలా బాధించిందని చెప్పాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. దిగ్గజ నటుడు కమల్ హాసన్ సైతం ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. కథానాయకుడు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన శ్రీకాంత్‌ని బరువైన హృదయంతో సాగనంపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ తన చివరి ఇంటర్వ్యూలో.. రజనీకాంత్‌ని కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతడి ఆశ నెరవేరలేదు. ఆయన బామా విజయం, పూవ తలైయా, ఎతిర్ నీచల్ వంటిక్లాసిక్ మూవీస్ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. శివాజీ గణేషన్, ఆర్.ముత్తురామన్, శివకుమార్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చదవండి: రజనీకాంత్ ‘అన్నాత్తే’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ என்னுடைய அருமை நண்பர் திரு ஸ்ரீகாந்த் அவர்கள் மறைவு எனக்கு மிகவும் வருத்தமளிக்கிறது. அவருடைய ஆத்மா சாந்தியடையட்டும். — Rajinikanth (@rajinikanth) October 12, 2021 கதாநாயகன், வில்லன், குணச்சித்திரப் பாத்திரங்கள் என ஆல்ரவுண்ட் நடிப்புக் கலைஞராகத் திகழ்ந்த ஸ்ரீகாந்த், தீவிரமான இலக்கிய வாசகராகவும் ஜெயகாந்தனின் ஆப்த சிநேகிதராகவும் இருந்தார். இன்று தன் இயக்கங்களை நிறுத்திக்கொண்டார். இதய கனத்தோடு வழியனுப்பிவைப்போம். — Kamal Haasan (@ikamalhaasan) October 13, 2021 #RIPSrikanth sir, another veteran actor has left us. You will be fondly remembered by our Tamil people pic.twitter.com/Ynp7kaLjtT — Actor Karthi (@Karthi_Offl) October 13, 2021 -
సీక్రెట్‌గా రెండో పెళ్లి, రిసెప్షన్ ఫొటో వదిలిన నటుడు
దర్శకుడు శివ సోదరుడు, పాపులర్ నటుడు బాలా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఎలిజబెత్ ఉదయన్ అనే వైద్యురాలిని సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓనం పండుగనాటి నుంచే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్లకు ఫుల్స్టాప్ పెడ్తూ తన భార్యను అభిమానులకు పరిచయం చేశాడీ నటుడు. రిసెప్షన్లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బాలా 2010లో ప్లేబ్యాక్ సింగర్ అమృత సురేశ్‌ను పెళ్లాడాడు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2019లో విడిపోయారు. వీరికి అవంతిక అనే కూతురు కూడా ఉంది. ఇక బాలా సినిమాల విషయానికి వస్తే అతడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Actor Munna Simon (@munnasimon) View this post on Instagram A post shared by Actor Munna Simon (@munnasimon) -
335 మందితో డేటింగ్.. మరో 30 మంది కోసం వెయిటింగ్
సాక్షి, వెబ్‌డెస్క్: డేటింగ్ అనగానే మనం ఏదోదే ఊహించుకుంటాం.. పైగా పాశ్చత్య సంస్కృతి కావడంతో చాలా మంది దాన్ని తప్పుగా చూస్తారు. అయితే అన్ని డేట్లు ఒకేలా ఉండవు. ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు తమిళ నటుడు, ప్రొఫెషనల్ డ్యాన్సర్, ఫోటోగ్రాఫర్ సుందర్ రాము. గత కొన్నేళ్లుగా ఆయన 335 మంది మహిళలతో డేటింగ్ చేశారు. ఆయన లక్ష్యం 365 మందితో డేటింగ్ చేయడం. దానికి ఇంక 30 మంది దూరంలో ఉన్నారు. అసలు ఇంత మందితో డేటింగ్ చేయడం ఏంటి.. ఈ టార్గెట్ ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే.. సుందర్ రాము గురించి పూర్తిగా తెలియాలి. ఆయన వివరాలు.. తమిళనాడు, చెన్నైకి చెందిన సుందర్ రాము సినిమాల్లోకి రావడానికి ముందు నాటకాల్లో నటించారు. ఆ తర్వాత ఆయన తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. పైగా ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. అప్పటి వరకు సాధారణ జీవితం గడిపిన సుందర్ రాముని 2012లో జరిగిన నిర్భయ ఘటన బాగా కలచి వేసింది. చాలా రోజులు ఆ బాధలోనే ఉండి పోయారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనకు తరచుగా వినిపించే ప్రశ్న.. ‘‘మీ దేశంలో ఎందుకు మహిళలను అంత దారుణంగా హింసిస్తారు’’ అని. ఇవన్ని ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలో ఆయనభారతదేశ మహిళలకు వారి హక్కుల గురించి తెలియజేయాలనుకున్నారు. అందుకు ఆయన ఎన్నుకున్న మార్గమే ఈ 365 డేటింగ్. దీని గురించి సుందర్ రాము మాట్లాడుతూ.. ‘‘నేను స్త్రీలను బాగా చూసుకునే, గౌరవించే కుటుంబంలో పెరిగాను. లింగ వివక్ష లేని పాఠశాలలో చదువుకున్నాను. అబ్బాయిలు, అమ్మాయిలను వేరుగా చూడలేదు. కానీ, స్కూల్ నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాక, సమాజంలో వేళ్లూనుకున్న లింగవివక్షను గమనించాను. అలాంటి సంస్కృతిని చూసి షాక్‌కు గురయ్యాను. 2012 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన నన్ను కుదిపివేసింది. చాలా రాత్రులు నిద్రపోలేకపోయాను'' అని తెలిపారు. ‘‘ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం కోసం నేను చేసిన ఆలోచన 365 డేట్స్ ప్రణాళిక. దీని గురించి 2014, డిసెంబర్ 31న ఫేస్బుక్లో ప్రకటించాను. ప్రారంభంలోనే నాకు తెలిసిన 10 మంది నుంచి కాల్ వచ్చింది. మే ఒకరి గురించి ఒకరం తెలుసుకున్న తర్వాత డేట్‌కి వెళ్లేవాళ్లం. 2015లో తమిళనాడులో వరదల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. మరుసటి ఏడాది తిరిగి ప్రారంభించాను. ఇప్పటి వరకు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా పలువురు మహిళలతో డేట్‌కి వెళ్లాను. వీరిలో మా నానమ్మతో పాటు చెత్త ఎత్తే మహిళలు, పళ్లు అమ్ముకునే మహిళ, 90 ఏళ్ల ఐరిష్ సన్యాసిని, నటి, మోడల్స్, యోగా టీచర్, యాక్టివిస్టులు, రాజకీయాల్లో ఉన్నవారు ఇలా ఎంతోమంది ఉన్నారు. అయితే మా నానమ్మతో వెళ్లిన డేట్ మాత్రం చాలా ప్రత్యేకం’’ అన్నారు సుందర్ రాము. ‘‘ఇక నేను విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాను. నేను వెళ్లే డేట్స్ అన్ని శృంగారభరితమైనవి కావు. నా లక్ష్యం కేవలం ప్రేమ మాత్రమే. నేను ప్రతిరోజు ప్రేమను అన్వేషిస్తాను. డేట్ అనగానే ఏదో ఊహించుకోవడం కాదు. అలానే మహిళ అనగానే కేవలం ఆమె ఒంపుసొంపులు మాత్రమే కాదు. అంతకుమించి ఆలోచించగలగాలి. వారి స్థానంలోకి వెళ్లి.. ఆడవారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుంటే.. అప్పుడు వారి గురించి మనకు ఎక్కువ అర్థం అవుతుంది. వారి మీద మరింత గౌరవం పెరుగుతుంది. నా 365 డేట్ ఉద్దేశం కూడా ఇదే’’ అన్నారు సుందర్ రాము. -
నేటి విద్యార్థులే రేపటి స్టార్స్: నటుడు
నేటి విద్యార్థులే రేపటి స్టార్స్ అని నటుడు ఆరిఅర్జున్ పేర్కొన్నారు. ఈయన చెన్నైలోని ప్రసాద్ ఫిలిం అండ్ టీవీ అకాడమీ విద్యార్థులకు నటనలో శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్ ఫిలిం టీవీ అకాడమీ ఈ ఏడాది నటన శిక్షణ తరగతులను ప్రారంభించిందన్నారు. ఈ ఏడాది విద్యార్థులే రేపు వెలిగిపోయే స్టార్స్ అని పేర్కొన్నారు. 'తాను ఇనిదు ఇనిదు' చిత్రంతో విద్యార్థులకు గతంలో శిక్షణను ఇవ్వడం ప్రారంభించానన్నారు. ఈ అకాడమీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణాకారుడి బాధ్యతలు నిర్వహించడం మరువలేని అనుభవంగా గుర్తుండిపోతుందని ఆరిఅర్జున్ పేర్కొన్నారు. -
కమెడియన్ కొడుకు సబ్ కలెక్టర్ అయిన వేళ!
Chinni Jayanth Son: చిన్ని జయంత్.. ఈ కమెడియన్ గురించి మనకు పెద్దగా తెలియదు కానీ తమిళంలో మాత్రం బాగా ఫేమస్. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్, అజిత్, విజయ్.. ఇలా కోలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోలందరి సినిమాల్లోనూ నటించాడితడు. తాజాగా ఆయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. కారణం.. అతడి కొడుకు ఏకంగా సబ్ కలెక్టర్ కొలువు సంపాదించాడు. చిన్ని జయంత్ కుమారుడు శృతన్ జై నారాయణన్ 2020లో ఐఏఎస్ పూర్తి చేశాడు. ఆలిండియా లెవల్లో 75వ ర్యాంకు సంపాదించిన అతడు తాజాగా ట్యుటికోరన్ జిల్లాకు సబ్ కలెక్టర్‌గా నియామకమయ్యాడు. ఈ సందర్భంగా శృతన్ మాట్లాడుతూ.. విద్య, జీవనోపాధి, మహిళా సాధికారత పెరుగుదలకు తనవంతు కృషి చేస్తానని చెప్తున్నాడు. తండ్రికి తగ్గ కొడుకు, తండ్రి గర్వపడేలా చేశాడు అంటూ నెటిజన్లు శృతన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే చిన్ని జయంత్ ప్రస్తుతం విజయ్ సేతుపతి 'యాదుమ్ ఊరేఘెవరుమ్ కెలిర్' సినిమాలో నటిస్తున్నాడు. -
వ్యాయామం చేస్తూ కిందపడ్డ నటుడు, కాలికి గాయాలు
Karthik Hospitalised: సీనియర్ నటుడు కార్తీక్ బుధవారం ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా కార్తీక్ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి బలంగా దెబ్బ తగలడంతో వెంటనే స్థానిక అడయార్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇంతకుముందు ప్రమాదంలో తగిలిన కాలుకే దెబ్బ తగలడంతో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదానికి గురైన నటుడి కొడుకు
చిక్కబళ్లాపురం: సినీ నటుడు జగ్గేశ్ కొడుకు యతిరాజ్ (29) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బాగేపల్లి వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా గురువారం ఉదయం 11: 45 సమయంలో జాతీయ రహదారిపై అగలగుర్కి వద్ద సర్వీసు రోడ్డు నుంచి వచ్చిన బైకిస్టును తప్పించబోయి ఆయన బిఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా యతిరాజ్‌కు గాయాలు తగిలాయి. ఎస్పీ మిథున్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ యతిరాజ్‌కు చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి బెంగళూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బైకిస్టు సురక్షితంగా బయటపడ్డాడు. చదవండి: అందరికంటే ఎక్కువగా ఏడిపించే వ్యక్తి నువ్వే, అందుకే: నటి -
కరోనాతో కన్నుమూసిన నటుడు
కరోనా బారిన పడిన నటుడు శామన్‌మిత్రు (43)బుధవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది బంగారు పతకాన్ని పొందిన శామన్‌మిత్రు మొదట్లో ఛాయా గ్రాహకుడిగా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలకు పనిచేశారు. తర్వాత దర్శకుడిగా మారి తొరట్టి అనే చిత్రాన్ని నిర్మించి కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకుంది. ఆయన నెల క్రితం కరోనా బారిన పడి క్రోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో చేరారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కన్నుమూశారు. శామన్ మిత్రుకు భార్య శకుంతల, కుమార్తె మోక్ష ఉన్నారు. శామన్ మిత్రు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: రూ.26 కోట్ల మోసం! సంగీత దర్శకుడిపై కేసు కొట్టివేత తన తొలి సంపాదన ఎంతో బయట పెట్టిన విద్యాబాలన్.. -
నటుడు దాముకు అరుదైన గౌరవం
తమిళ నటుడు దాముకు రాష్ట్రీయ శిక్ష గౌరవ్ పురస్కార్ 2021 అవార్డు వరించింది. చదువుకునే రోజుల్లోనే మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న దాము అనబడే డాక్టర్ ఏవీ.దామోదరన్ దివంగత దర్శక శిఖరం కె.బాలచందర్ శిష్యుడు అన్నది గమనార్హం. చిత్రాల్లో వివిధ రకాల పాత్రలో నటించి నటుడిగా గుర్తింపు పొందిన దాములో విద్యాసేవకుడు ఉన్నారన్నది చాలామందికి తెలియదు. ఆయన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం శిష్యుడు కూడా. గత 2011లో కోవైలో జరిగిన ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభను ఆయన ఎంతగానో ప్రశంసించారని నటుడు దాము తెలిపారు. ఆ సమయంలో నీ ప్రతిభ విద్యాసేవకు ఉపయోగించాలని అబ్దుల్ కలాం సూచించారన్నారు. మరణించి తను దశాబ్ద కాలంగా తాను విద్యా సేవకు కృషి చేశానని చెప్పారు. అందుకు 2011లో అంతర్జాతీయ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అసోసియేషన్ ను ప్రారంభించినట్లు చెప్పారు. 2011 నుంచి 2016 వరకు ఐదేళ్లపాటు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పర్యవేక్షణలో విద్యాసేవలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే తాను విద్యాబోధకుడిని కాదని సేవకుడిని మాత్ర మేనని చెప్పారు. దాము విద్యాసేవకుగాను జాతీయ విద్యాభివృద్ధి, పరిశోధన సంస్థ కేంద్రం ఆయన్ని రాష్ట్రీయ శిక్ష గౌరవ్ పురస్కార్ 2021 అవార్డుతో సత్కరించింది. గురువారం సాయంత్రం జేకే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దాముకు చెన్నైలో అభినందన సభను ఏర్పాటుచేసి ఘనంగా సత్కరించింది. -
ప్రముఖ హాస్యనటుడికి గుండెపోటు, పరిస్థితి విషమం
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం రేపింది. అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది కాగా చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్ గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
తమిళ నటుడు, నిర్మాత ఆత్మహత్య
చెన్నై: తమిళ నటుడు, నిర్మాత కుమారజన్(35) ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. కుమారజన్.. నమక్కల్‌లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఇతడు 'సాంతిప్పొమ్ సింతిప్పొమ్' అనే చిత్రాన్ని నిర్మించడమే కాక అందులో హీరోగా నటించాడు. కానీ ఇది అతడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో తను కోరుకున్న గుర్తింపు రాకపోవడంతో కొంతకాలంగా నిరాశలో ఉన్నాడు. తాను ఊహించినట్లుగా కెరీర్ సంతృప్తికరంగా ముందుకు సాగకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ రకంగా చూస్తే ఇది ఇండియాలోనే తొలి చిత్రం! కొత్త కారులో చక్కర్లు కొట్టిన ప్రభాస్ సోదరి -
తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం
చెన్నై : తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా కమెడియన్ తేపట్టి గణేశన్(కార్తీ) మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన సోమవారం..మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిల్లా-2, ఉస్తాద్ హోటల్, నీరపరై, కన్నే కలైమనే వంటి చిత్రాల్లో నటించిన గణేశన్‌కు గత కొంతకాలంగా అవకాశాలు రాలేదు. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. అయితే కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో తన పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని గణేషన్...సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే పేదరికం, సినిమాలు అవకాశాలు లేక గత కొంతకాలం నుంచి గణేషన్..డిప్రెషన్లో ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో ఆరోగ్యం దెబ్బతిని మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, గుండెపోటు కారణంగా తుదిశ్వాస వదిలాడు. గణేశన్ మృతిపై పలువురు తమిళ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా చిన్నవయసులోనే గణేశన్ మృతిచెందడం తమిళ ఇండస్ట్రీకి తీరనిలోటు అని దర్శకుడు శ్రీను రామస్వామి ట్వీట్ చేశారు. ఈ వార్త వినగానే చాలా షాకయ్యానని, తన సినిమాల్లో నటించిన ఉత్తమ నటుల్లో గణేషన్ కూడా ఒకరని రామస్వామి అన్నారు. ఇక గణేషన్ చివరిసారిగా 2019లో రామసామి దర్శకత్వంలో తెరకెక్కిన కన్నే కలైమనే చిత్రంలో నటించారు. చదవండి : ఆస్పత్రిలో సీనియర్ నటుడు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కన్నుమూత -
యువ నటుడు ఆత్మహత్య
చెన్నై: యువ నటుడు, మోడల్ శ్రీవాస్తవ్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న అతడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, షూటింగ్ ఉందని చెప్పి పెరంబూర్‌లోని ఇంటి నుంచి, తన తండ్రి ఆఫీస్ హౌజ్‌కు చేరుకున్న శ్రీవాస్తవ్ అక్కడే ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.(చదవండి: అల్లు అర్జున్ కార్వాన్కు ప్రమాదం) కాగా శ్రీవాస్తవ్ మరణం పట్ల సహచర నటీనటులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్టా’ సినిమాలో హీరో ధనుష్‌తో శ్రీవాస్తవ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అదే విధంగా .. ‘వల్లామై తరాయో’ అనే వెబ్‌సిరీస్‌లో సైతం నటించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓ చినదాన అనే టైటిల్‌తో ఓ తెలుగు చానెల్లో ప్రసారం అవుతోంది. -
'ఖైదీ' నటుడి అకాల మరణం
చెన్నై: తమిళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అరుణ్ అలెగ్జాండర్ కన్నుమూశారు. సోమవారం నాడు ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. 48 ఏళ్ల వయసులోనే ఆయన మృత్యువాత పడటం చిత్రసీమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. "ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోతావని ఊహించలేదు. దుఃఖం ఆగట్లేదు. నీ లోటును ఎవరూ పూడ్చలేరు. నా గుండెలో ఎప్పటికీ నువ్వు పదిలంగా ఉంటావు" అంటూ దర్శకుడు కనగరాజ్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. కాగా అరుణ్ అలెగ్జాండర్ 'కోలమావు కోకిల', 'బిగిల్', 'ఖైదీ', 'మాస్టర్' వంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా నటించిన 'మాస్టర్' సినిమాలో స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించగా ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది. (చదవండి: విషాదం: ప్రముఖ నటుడు దుర్మరణం) (చదవండి: జీఎస్టీ టీజర్ బాగుంది) Actor #ArunAlexander who was seen with Thalapathy in Bigil is no more! He had acted in Master too. #RIP pic.twitter.com/GDCmGBp7dA — Actor Vijay Fans (@Actor_Vijay) December 28, 2020 -
మరో విషాదం : కమెడియన్ కన్నుమూత
సాక్షి, చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ హాస్య నటుడు తవాసి (60) కన్నుమూశారు. మధురై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం (నవంబర్ 23) సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. అన్నవాహిక క్యాన్సర్‌తో బాధపడుతున్న తవాసి ఎమోషనల్ వీడియో ఇటీవల వైరల్ అయింది. దీంతో ఆయన కోలుకోవాలంటూ స్పందించిన పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అయినా ఆరోగ్యం పూర్తిగా విషమించి మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తవాసి మృతికి కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు కాగా తవాసి అనారోగ్యం, ఆర్థికపరిస్థితిపై ఆయన కుమారుడు తన తండ్రి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆర్థిక సాయం చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోలీవుడ్ నటులు విజయ సేతుపతి, సూరి, శివకార్తికేయన్, సౌందరరాజా, శింబు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తావసి వైద్యానికి ఆర్థిక సాయం అందించారు. సుందర్‌పాండియన్, వరుతాపాదా వాలిబార్ సంగం, రజిని మురుగన్ తదితర చిత్రాల్లో సహాయక పాత్రల్లో తనదైన నటనతో అలరించారు. తవాసి. ఆయన నటించిన చివరి చిత్రం రజనీకాంత్ హీరోగా రూపొందింన అన్నాట్టే విడుదల కావాల్సి ఉంది. -
ఉరేసుకుని నటుడి ఆత్మహత్య
చెన్నై: తమిళ యువ నటుడు తెన్నారసు ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని మైలాపూర్‌లో మంగళవారం తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. భార్యతో ఘర్షణకు దిగిన అనంతరం తీవ్ర మనస్తాపానికి లోనై అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మూడేళ్ల క్రితం తెన్నారసు తను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉంది. (చదవండి: ప్రామిస్.. మరింత కష్టపడతా!) తాగుడుకు అలవాటు పడ్డ నటుడు భార్యతో తరచూ గొడకు దిగుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. ఇదిలా వుండగా తెన్నారసు హీరో శివకార్తికేయన్ నటించిన 'మెరీనా' చిత్రంలో నటించారు. ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించగా అది అతనికి మంచి పేరును తెచ్చిపెట్టింది. తెన్నారసు పలు సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్రలోనే ఎక్కువగా కనిపించారు. (చదవండి: నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా! ) -
ప్రముఖ నటుడికి కోర్టు నోటీసులు
తమిళ సినిమా: నటుడు ఆర్యకు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏమిటి ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని ఆర్యకు కోర్టు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా? నటీనటులు వివాదాలు చిక్కుకుపోయినా వారు నటించిన చిత్రాలు వివాదాంశం కావచ్చు కదా! అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఆర్య నటించిన అవన్ ఇవన్ చిత్రం ఆయన్ని ఇప్పుడు కోర్టుకు లాగుతోంది. బాల దర్శకత్వంలో విశాల్, ఆర్య కలిసి నటించిన చిత్రం అవన్ ఇవన్. ఈ చిత్రంలో సింగంపట్టి జమీన్‌ను అవమానపరిచే సన్నివేశాలు చోటుచేసుకున్నాయంటూ నెల్లై జిల్లా, అంబాసముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. ఆర్య ఈ నెల 28న హాజరు కావాల్సిందిగా అంబాసముద్రం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. -
కరోనా : సీనియర్ జర్నలిస్టు, నటుడు మృతి
సాక్షి, చెన్నై: కరోనా వైరస్ కారణంగా తమిళ సినీ పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు ఫ్లోరెంట్ సి పెరారీ( 67) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల ఒక షూటింగ్ సందర్భంగా కరోనా బారిన పడ్డ ఆయన చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస తీసుకున్నారు. దీంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్భాంతికి గురైంది. పెరారీ ఆకస్మిక మరణంపై దర్శకుడు సీను రామసామితోపాటు, పలువురు సినీ దర్శకులు, ప్రముఖులు, ఇతర నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. పెరారీ తొలిసారిగా 2003లో విడుదలైన విజయ్ హీరోగా తెరకెక్కిన పుడియా గీతైలో నటించారు. 50కి పైగా సినిమాల్లో నటించిన ఆయన కయాల్ (2014) ఎన్‌కిట్టా మోతాతే (2017) పాత్రలతో ఎంతో పేరు పేరు తెచ్చుకున్నారు. సాత్రియన్ (2017), ధనుష్ సూపర్ హిట్ మూవీ 'వేలై ఇల్లా పట్టదారి' (విఐపి-2) చిత్రాలలో పాటు, రాజా మంతిరి, తోదారి, ముప్పరిమనం, తారామణి, పోధువాగ ఎమ్మనాసు తంగం ఆయన నటించిన ఇతర చిత్రాలు. రామసామి దర్శకత్వంలో నటించిన చిత్రం ఇడామ్ పోరుల్ యెవల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది. టెలివిజన్‌లో 20 సంవత్సరాల అనుభవం ఉన్న, పెరారీ కలైంగర్ టీవీకి జీఎంగాను, విన్ టీవీ (సీఈవో), విజయ్ టీవీల వంటి ఛానెళ్లలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు. I can't believe this Film Actor Kalaignar TV Ex GM good hearted soulful Mr.Florent Perera you are in the midst of us RIP Father 🙏 🙏 🙏 My deepest condolence to his family & Friends.#CoronavirusPandemic @DrBrianPereira #Alexanderpereira pic.twitter.com/90LywUVIXG — Seenu Ramasamy (@seenuramasamy) September 14, 2020 Florent C.Pereira - He was always a good mentor to me, right from my childhood! A Very Kind & Positive person is with God now! Miss you UNCLE 🤗 May you cheer those in Heaven too 😇❤️🙏🏻#RipflorentPereira pic.twitter.com/8lt6XsoyW0 — Editor Ruben (@AntonyLRuben) September 15, 2020 My beloved friend and ex CEO of WIN TV, mr.florent Pereira demised yesterday night.. May his soul rest in Peace...🙏🙏🙏🙏🙏 pic.twitter.com/GgT5q8gbli — r g kannan (@aarjeekaykannan) September 15, 2020 -
నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా!
సాక్షి, చెన్నై: నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని నటి మీరామిథున్ పేర్కొన్నారు. నటి మీరామిథున్ దృష్టి తాజాగా మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నటి మీరామిథున్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో తాను నిత్యానంద ఏర్పాటుచేసిన కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లాట్స్ ఆఫ్ లవ్ అని మీరా మిథున్ పేర్కొంది. (చదవండి: సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!) -
ఆస్పత్రిలో విలన్: సాయం చేసిన హీరో
ప్రముఖ తమిళ నటుడు, విలన్ పొన్నంబళమ్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిపాలయ్యారు. కిడ్నీ సంబంధ సమస్యలతో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన స్టార్ హీరో, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ అతనికి ఆర్థిక చేయూత అందించనున్నారు. ఫోన్లో అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని డబ్బు సాయం చేస్తానని మాటిచ్చారు. అలాగే అతని పిల్లలను చదివించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. పొన్నంబళమ్ ఆరోగ్య పరిస్థితి గురించి కమల్ హాసన్ టీమ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. (కమల్‌తో డేటింగ్.. పూజా క్లారిటీ) మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అతను ఆక్సిజన్ మాస్క్‌తోనే ఊపిరి పీల్చుకుంటున్నారు. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా అతను "స్టంట్‌మ్యాన్" చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కమల్ హాసన్‌తో కలిసి 'అపూర్వ సాగోధరార్గల్', 'మైకేల్ మదన కామరాజన్' వంటి చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో అతను రజినీకాంత్ 'ముత్తు', 'అరుణాచలం', అజిత్ 'అమర్కలమ్', విక్రమ్ 'సామి' వంటి చిత్రాల్లో కనిపించారు. ఆయన చివరిసారిగా 2019లో రిలీజైన 'కోమలి' సినిమాలో నటించారు. పొన్నంబళమ్ తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్లోనూ పాల్గొన్నారు. (భారతీయుడు ఆగలేదు) -
విజయ్‌కు ఐటీ అధికారుల షాక్..
చెన్నై : ఓ సినీ నిర్మాణ సంస్థ పన్ను ఎగవేత కేసుకు సంబంధించి తమిళ హీరో విజయ్ను ఆదాయ పన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సినిమా షూటింగ్లో ఐదు గంటల పాటు ప్రశ్నించిన అనంతరం ఇంట్లోనూ విజయ్ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏజీఎస్ సినిమాస్ కార్యాలయాలు, ఆస్తులతో పాటు సినీ ఫైనాన్షియల్ అన్బు చెలియన్ మధురై కార్యాలయాలపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయ్ హీరోగా రూపొందిన బిజిల్ సినిమాను గత ఏడాది ఏజీఎస్ సినిమాస్ నిర్మించింది. కాగా గత ఏడాది అక్టోబర్‌లో విజయ్ మూవీ మెర్సెల్ జీఎస్టీ, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పలు సంభాషణలతో తెరకెక్కడంతో ఈ మూవీపై బీజేపీ తమిళనాడు రాష్ట్ర విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. జీఎస్టీ, డిజిటల్ ఇండియా ప్రచారంపై అవాస్తవాలను ప్రచారం చేసేలా మూవీలో ఉన్న కొన్ని డైలాగ్‌లను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. -
మీటూ : నటుడిపై లైంగిక వేధింపుల కేసు
సాక్షి, వాయనాడ్: మలయాళ నటుడు, దళిత కార్యకర్త వినాయగన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సామాజిక కార్యకర్త మృదులాదేవి శశిధరన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాయనాడ్ జిల్లాలోని కాల్పెట్టా పోలీస్ స్టేషన్ అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ వేధింపులకు సంబంధించిన ఆడియో రికార్డును ఆమె పోలీసులకు అందించారు. వినాయగన్‌పై మీటూ ఆరోపణలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నటుడు వినాయకన్ తనను వేధించాడంటూ కేరకు చెందిన సోషల్ యాక్టవిస్ట్ మృదులాదేవి మొదట ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. గతంలో మహిళా నటిని వేధింపులకు గురి చేసిన సంఘటనలో తీవ్రంగా స్పందించి, ఉద్యమానికి మద్దతు తెలిపిన వినాయగన్, తన వరకూ వచ్చేసరికి మాత్రం ఇందుకు భిన్నంగా, మృగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రవర్తించారని ఆమె మండిపడ్డారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే ఆయనంటే గౌరవం పోయిందన్నారు. ఒక కార్యక్రమం నిమిత్తం వినాయగన్ను ఆహ్వానించేందుకు కాల్ చేసినపుడు ఫోన్లో తనతో అమర్యాదకరంగా చాలా అసభ్యంగా, మాట్లాడారని ఆమె రాసుకొచ్చారు. తన లైంగిక వాంఛ తీర్చాల్సిందిగా కోరడంతో పాటు, తన తల్లి కూడా తన కోరిక తీర్చాలన్నాడని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోన్ రికార్డింగ్ కూడా తన దగ్గర వుందని మృదులాదేవి చెప్పారు. అయితే అబద్ధం చెబుతోందని కొంతమంది నెటిజనులు సోషల్ మీడియాలో వాదనకు దిగడంతో ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కుల, మతపరమైన వివక్ష, దాడులకు తాను వ్యతిరేకమని చెప్పుకున్న మృదులా దేవి మహిళా నటికి మద్దతుగా నిలవడంతో వినాయగన్ వ్యక్తిత్వం తనకు ప్రేరణ నిచ్చిందని పేర్కొన్నారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం, ఆయనపై జరుగుతున్న కులపరమైన దాడిని తాను వ్యతిరేకించానని చెప్పారు. కాగా విశాల్, శ్రేయా జంటగా నటించిన పొగరు సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన నటుడే వినాయగన్. -
నవ్వులు వెలవెలపోయాయి
తమిళ నాటక రచయిత, హాస్యనటుడు, డైలాగ్ రైటర్ ‘క్రేజీ’ మోహన్ సోమవారం తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో చెన్నైలో ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 1952 అక్టోబర్ 16న జన్మించిన ‘క్రేజీ’ మోహన్ అసలు పేరు మోహన్ రంగాచారి. కాలేజీ రోజుల్లో నుంచే నాటకాలు రాసి, అందులో నటిస్తుండేవారు. అలా రాసిన ‘గ్రేట్ బ్యాంక్ రోబరీ’ స్కిట్‌కు ఉత్తమ రచయితగా, ఉత్తమనటుడు అవార్డ్‌ను కమల్‌హాసన్ చేతులమీదుగా అందుకున్నారు. ఆయన రాసిన మొదటి నాటకం ‘క్రేజీ థీవ్స్ ఇన్ పాలవాక్కమ్’. ఈ నాటకం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మోహన్ రంగాచారిని, ‘క్రేజీ’ మోహన్‌గా మార్చింది. ఈ నాటకం ఆధారంగా ఓ టీవీ సీరియల్ కూడా స్టార్ట్ చేశారు. తమ్ముడు మధు బాలాజీ డ్రామా ట్రూప్‌కు ఎక్కువగా నాటకాలు రాసేవారు మోహన్. వేరే ప్రొడక్షన్స్ వాళ్లకు చాలా నాటకాలు రాసిన తర్వాత 1979లో సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి, దానికి ‘క్రేజీ క్రియేషన్స్’ అని నామకరణం చేశారు. 30కి పైగా నాటకాలు, 6,500 స్టేజిషోలు చేశారు. మోహన్ నాటకాల్లో వాళ్ల అన్నయ్య మధు బాలాజీ హీరోగా నటించేవారు. ‘క్రేజీ’ మోహన్ రచించిన ‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ సెలూన్’ నాటకం ఆధారంగా కె. బాలచందర్ ‘పోయికల్ కుదిరై’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో డైలాగ్ రైటర్‌గా సినిమాల్లోకి ప్రవేశించారు మోహన్. ఆ తర్వాత తమిళంలో సూపర్ హిట్ కామెడీ సినిమాలకు తనవంతు మాటల సాయం చేశారాయన. ‘క్రేజీ’ మోహన్ ఎక్కువగా కమల్ హాసన్‌తో పనిచేశారు. ‘సతీ లీలావతి, కాదలా కాదలా (నవ్వండి లవ్వండి), మైఖేల్ మదన కామరాజు, విచిత్రసోదరులు, ఇంద్రన్ చంద్రన్ (ఇంద్రుడు–చంద్రుడు), భారతీయుడు, భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం, వసూల్ రాజా ఎంబీబీఎస్’ వంటి సినిమాలకు కలసి పనిచేశారు. ‘అరుణాచలం, రక్షకుడు’ సినిమా చేశారు. నటుడిగా కమల్‌హాసన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ మెరిశారు మోహన్. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ‘క్రేజీ’మోహన్‌ను ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించింది. ఆయన మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘స్నేహానికి అంతం అనేదే ఉండదు. మనిషి బతికి ఉంటేనే స్నేహం ఉంటుందా? మోహన్ కామెడీ ఆయన సినిమాల ద్వారా ఆయన అభిమానులలో నిలిచే ఉంటుంది. మోహన్లోనాకు బాగా నచ్చే క్వాలిటీ ఆయన చిన్నపిల్లాడిలాంటి మనస్తత్వం. అందరికీ ఉండేది కాదది. ‘క్రేజీ’ అనే టైటిల్ అతనికి సూట్ కాదు. అతనో ‘కామెడీ జీనియస్’’ అని పేర్కొన్నారు కమల్ హాసన్. కమల్ హాసన్, మోహన్ -
యువతితో నటుడు పరార్
తమిళనాడు, పెరంబూరు: సినీ నటుడు శివ పక్కింటి యువతితో పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వివరాలు.. పయపుళై అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నటుడు శివ. తిరువణ్ణామలై జిల్లాలోని చెంజి గ్రామానికి చెందిన ఇతను స్థానిక రామావరంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివశిస్తున్నాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. శివకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పక్కింటి యువతితో పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. భార్యకు విడాకులిచ్చినట్లు అబద్దం చెప్పి ఆ యువతితో ప్రేమ పెంచుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు వారించినా వినిపించుకోలేదు. అంతే కాదు నటుడు శివతో కలిసి పరారైంది. పోలీస్‌స్టేషన్‌లో చేరిన జంట.. దీనిపై యువతి తల్లిదండ్రులు రాయలనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ గౌతమన్ దర్యాప్తు చేపట్టారు. కాగా వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లడంతో పారిపోయిన జంట శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. విచారణలో శివ తన భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలిసింది. అంతే కాదు శివ ఆ యువతితో కలిసి కన్యాకుమారి, మదురై తిరిగొచ్చినట్లు తెలిసింది. తన భార్యకు విడాకులు ఇచ్చి ఈ యువతిని పెళ్లి చేసుకుంటానని పోలీసులకు చెప్పాడు. ఆ యువతిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. -
సినీ నటుడు విశాల్ విడుదల
చెన్నై: సినీ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను పోలీసులు విడుదల చేశారు. అలాగే టీనగర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయానికి ఎవరూ వెళ్లరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. నిర్మాతల మండలి కార్యాలయం చుట్టుపక్కల 144 సెక్షన్ అమలు చేశారు. టీనగర్లో ఉన్న నిర్మాతల మండలి కార్యాలయం తలుపులను బలవంతంగా తెరిచేందుకు విశాల్ ప్రయత్నించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు విశాల్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెల్సిందే. అనంతరం దగ్గరలో ఉన్న తైనాంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పైరసీని అడ్డుకోవడంలో విశాల్ విఫలమయ్యారని, నిధులను దుర్వినియోగపరచడం, నిర్మాతల సమస్యల్ని పరిషర్కించడంలో కూడా విఫలమయ్యారని ఆరోపిస్తూ కొంత మంది నిర్మాతలు విశాల్‌ను రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్నారు. (హీరో విశాల్ అరెస్ట్..) ఈ విషయమై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. చినికి చినికి వివాదం ముదిరి పెద్దదిగా మారింది. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం విశాల్ విలేకరులతో మాట్లాడారు. తమ కార్యాలయానికి ఎవరో తాళాలు వేస్తే అడ్డుకోని పోలీసులు వాటిని తొలగించేందుకు వెళితే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. నిర్మాతల మండలి ఐక్యతలో చీలికలు తెచ్చేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇళయరాజా సంగీత విభావరి ద్వారా నిర్మాతల మండలికి నిధుల సేకరణను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళయరాజా కార్యక్రమం నిర్వహించే తీరుతామని స్పష్టం చేశారు. -
తెరపైకి చంద్రబాబు బయోపిక్
సినిమా: ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. తెలుగులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్‌లు చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని త్వరలో వెండితెరపైకి రానున్నాయి. అయితే అదేవిధంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత జీవిత చరిత్రలు చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. ఆ తరంలో నటుడిగా రాణించిన మరో తమిళ నటుడు చంద్రబాబు. ఈయన కథానాయకుడిగా, హాస్యనటుడిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో మరువలేని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన 1950 నుంచి 1970 వరకూ తమిళసినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. అలాంటి నటుడి బయోపిక్ జేపీ. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు పేరుతో సినిమాగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే పేరుతో సీనియర్ దర్శకుడు కే.రాజేశ్వర్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇంతకు ముందు అమరన్, ఇదయతారై, కోవిల్పట్టి వీరలక్ష్మి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన కే.రాజేశ్వర్ పలు హిందీ చిత్రాలకు కథలను అందించారు. ఈయన తాజాగా జేపీ. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చంద్రబాబు పాత్రలో నటించడానికి ఒక ప్రముఖ నటుడితో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ చిత్రంలో ఎంజీఆర్, శివాజీగణేశన్, జెమినీగణేశన్, సావిత్రి, కన్నదాసన్, ఎంఎస్.విశ్వనాథన్ వంటి నాటి ప్రఖ్యాత నటీనటులతో పాటు, అప్పటి రాజకీయనాయకుడు కామరాజ్ వంటి వారి పాత్రలు కూడా చోటుచేసుకుంటాయని తెలిపారు. దీన్ని ఇండో రష్యా సంయుక్త సంస్థ అయిన రురో ఇంటర్నేషనల్ పతాకంపై రష్యాతంగప్పన్, కే.రాజేశ్వర్, ఆర్వీ.స్వామినాథన్‌లతో పాటు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తరఫున నటి కుట్టిపద్మిని నిర్వహణ బాధ్యతలను నిర్వహించనున్నారు. -
నటుడి భార్య ఆత్మహత్య
సాక్షి, పెరంబూరు : పిల్లలు పుట్టలేదని మనస్తాపం చెంది నటుడి భార్య ఆత్మహత్య చేసుకుంది. మధురవాయిల్‌లో సిద్ధార్థ్ గోపీనాథ్ అనే కోలీవుడ్ సహాయ నటుడు నివసిస్తున్నాడు. అతను ఆది హీరోగా నటించిన యాగవరాయనుమ్, నాకాక్క తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా నటించాడు. సిద్ధార్థ్ భార్య స్మిరిజా. వీరికి వివాహమై మూడేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు కలగలేదు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదిలాఉండగా సోమవారం రాత్రి సిద్ధార్థ్ భార్యతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేసి ఇంటికి వచ్చారు. అనంతరం దంపతులు గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో స్మిరిజా కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. సిద్ధార్థ్ హాలులోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచిన సిద్ధార్థ్ 8.30 గంటలు అవుతున్నా భార్య గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపుతట్టి పిలిచాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే మధురవాయిల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా స్మిరిజా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మిరిజా మృతదేహానికి పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు. -
అలనాటి నటుడు నీలు ఇక లేరు
తమిళ సినిమా(చెన్నై): అలనాటి నటుడు నీలు (82) గురువారం సాయంత్రం మృతిచెందారు. రంగ స్థల నటుడైన ఆర్.నీలకంఠన్ నాటకాలలో నీలుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో నటించారు. ఈయన 7వేలకు పైగా నాటకాల్లోను, 160 సినిమాల్లోను నటించారు. దివంగత చోరామస్వామి తమ్ముడు అంబితో కలిసి వివేకా ఫైన్ ఆర్ట్స్ నాటక కంపెనీని ప్రారంభించి నాటకాలు వేస్తూ వచ్చారు. ఈయన నటించిన వాటిలో మహ్మద్ బీన్ తుక్లక్, ఇంద సుదందిర దాహం వంటివి ప్రముఖమైనవి. క్రేజీ మోహన్ నాటకాల్లో కూడా నీలు నటించారు. ఆయిరం పేయ్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నీలు పలు చిత్రాల్లో హాస్య భూమికలో నటించి మెప్పించారు. ఈయన నటించిన వాటిలో గౌరవం, అవ్వై షణ్ముగి, కాదలా కాదలా వంటి పలు చిత్రాలు ఈయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన వృద్ధాప్య కారణాలతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య శాంతా, కుమారులు అర్జున్, భరత్ ఉన్నారు. కుమారులు విదేశాల్లో ఉండడం వలన అంత్యక్రియలను శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. నీలు మృతికి నడిగర్ సంఘం సంతాపం తెలియజేసింది. -
ప్రేమికుల రోజునే నటుడికి విడాకులు
సాక్షి, చెన్నై: ప్రేమికుల రోజునే నటుడు బాలాజీకి కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాదల్ చొల్లవందేన్, మెయ్ అళగి, పట్టాలం చిత్రాల్లో నటించిన బాలాజీ రెండేళ్ల క్రితం ప్రీతిని పెళ్లి చేసుకున్నారు. అయితే కొంత కాలానికే వారి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ప్రేమికుల రోజైన బుధవారం విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. ఈ విషయాన్ని నటుడు బాలాజీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
'మావాళ్లే నన్నలా పెంచారు'
చెన్నై: తానెప్పుడూ స్టార్ డమ్ కోరుకోనని ప్రముఖ సినీ హీరో శింబు అన్నారు. గత 20 ఏళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలో వెలుగొందుతున్న ఆయన పేరు ప్రతిష్టలు పెద్దగా పట్టించుకోనని చెప్పారు. 'నాకు తొలిసారి కెమెరాముందుకు ఎప్పుడు వెళ్లాననే విషయం కూడా గుర్తు లేదు. నట వారసత్వం ఉన్న కుటుంబం నుంచే నేను వచ్చాను. చాలా యుక్తవయసులో ఉండగానే నేను నటనలో అడుగుపెట్టాను. నాకు అర్ధం చేసుకునే వయసు లేనప్పుడే స్టార్ డమ్ వచ్చింది. మా అమ్మవాళ్లే నన్నలా పెంచారు. అందుకే పేరు ప్రఖ్యాతలు, స్టార్ డమ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. మమ్మల్ని అంతా పనికిరానివాళ్లుగా భావిస్తారు. రేపు నాతో సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోయినా.. నాకు తెలుసు.. నా చిత్రాన్ని నేనే తీసుకోగలనని' అని శింబు చెప్పారు. శింబు నటించిన కామెడీ చిత్రం 'ఇదు నమ్మ ఆలు' ఆలస్యంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. -
విజయ్ అభిమానుల మద్దతు డీఎంకేకా ?
చెన్నై : రానున్న శాసనసభ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా? నేనా? అన్నంతగా గెలుపు కోసం తలపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నటుడు విజయ్ అభిమానుల మద్దతు డీఎంకే పార్టీకా? అన్న ప్రశ్నకు అవుననే బదులు రావడం కోలీవుడ్‌లోనూ మరింత ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఇళయదళపతి అభిమానులు ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు పలు కారణాలు కళ్లెదుట కనబడుతున్నాయి. ఐదేళ్లలో విజయ్ చిత్రాలు పలు ఇబ్బందులకు గురయ్యాయి. దీనికి కారణం అన్నాడీఎంకే ప్రభుత్వమేననే నిర్ణయానికి విజయ్ అభిమానులు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. దీంతో వారు అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పులి చిత్ర విడుదల సమయంలో విజయ్ ఇంటిలో ఐటీ దాడులు జరగడంలో ప్రభుత్వ ప్రయేయం ఉందని విజయ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇత్యాధి కారణాలతో అభిమానులు అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు కురిపిస్తున్నట్లు సమాచారం. గత 2004 పార్లమెంట్ ఎన్నికల సమయంలో విజయ్ అభిమానసంఘం బీజేపీకి మద్దతు తెలిపింది. 2011 శాసనసభ ఎన్నికల్లో విజయ్,ఆయన తండ్రి ఎస్ఏ.చంద్రశేఖర్‌లు బహిరంగంగానే అన్నాడీఎంకేకు మద్దతు పలికారు. అలాంటిది ఈ ఐదేళ్ల కాలంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు,ఇబ్బందులు వారి అభిమానులకు అన్నాడీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత, అసంతృప్తిని కలిగించాయంటున్నారు. ఇలాంటి కారణాల వల్లే విజయ్ అభిమానులు డీఎంకే పార్టీకి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై విజయ్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఆనంద్ నుంచి సమాచారం వచ్చినట్లు జిల్లా అభిమాన సంఘం సభ్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయమై విజయ్ గానీ,ఆయన తండ్రి ఎస్ఏ.చంద్రశేఖర్ గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
ప్రముఖ హాస్యనటుడి కన్నుమూత
చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు, డిఎంకె సభ్యుడు కుమారిముత్తు (77) కన్నుమూశారు. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. తనదైన నటనతో సినీఅభిమానులను ఆకట్టుకున్న ఆయన దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. ప్రత్యేక మేనరిజంతో, తనదైన నవ్వుతో పలు సినిమాల్లో హాస్యాన్ని పండించారు. 'ఇదు నమ్మ ఆలు', 'సహదేవన్ మహదేవన్' 'ఒరు ఊర్ల ఒరు రాజకుమారి, 'మరుమగన్' సినిమాలు ఆయన కెరియర్లో ప్రధానమైనవిగా నిలిచాయి. మూడు దశాబ్దాల పాటు సినీరంగానికి సేవలందించిన కుమారిముత్తు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ సభ్యుడిగా తమిళనాట రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. -
షూటింగ్లో యవ హీరోకు గాయాలు
చెన్న: నటుడు శాంతనుకు షూటింగ్లో బలమైన గాయాలయ్యాయి. సీనియర్ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ కొడుకు,యువ నటుడు అయిన శాంతను ఇటీవలే టీవీ యాంకర్ కీర్తీని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు సిద్ధు+2 చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన శాంతను తాజాగా కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న నూతన చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి భార్య కీర్తితో సహా వెళ్లారు. ఆ చిత్ర ఫైట్ సన్నివేశాల్లో నటిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన నుదటి కుడి భాగంలో బలమైన గాయాలయ్యాయి. కాలు ఎముక బెణికింది. తీవ్రంగా బాధపడుతున్న శాంతనును చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. దీని గురించి శాంతను మాటాడుతూ తన ఆరోగ్యం గురించి పరామర్శించిన వారందరికి ధన్యవాదాలు అన్నారు. సినీ స్టంట్ కళాకారులు నిత్యం ఎదుర్కొనే సంఘటన ఇది అన్నారు. జీవనం కోసం ఇంత కఠినంగా శ్రమిస్తున్న వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. -
శింబు కోసం పోలీసుల వేట
చెన్నై : నటుడు శింబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన మహిళలను అగౌర పరచే విధంగా అసభ్య పదజాలాలతో కూడిన పాటను రాసి, పాడి దాన్ని వాట్స్ యాప్‌లో పోస్ట్ చేశారని మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. కోవైకి చెందిన అఖిల భారత మాదర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాధిక నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌లపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోవై పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆయన ఆదేశాల మేరకు కోవై రేస్ కోర్స్ పోలీసులు శింబు, అనిరుద్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి రెండు రోజుల క్రితమే చెన్నై వచ్చారు. అయితే శింబు అజ్ఞాతంలోకి వెళ్లడం. అనిరుద్ కెనడాలో ఉండడంతో వారి ఇళ్లకు సమన్లు అంటించారు. కాగా శింబును అరెస్ట్ చేసే తిరిగి రావాలని పోలీస్ కమిషనర్ గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో కోవై రేస్ కోర్స్ పోలీసులు చెన్నైలోనే మకాం వేసి శింబు ఆచూకీ తెలియక నగరంలోని వీధులన్నీ తిరుగుతూ తీవ్రంగా జల్లెడేసి గాలిస్తున్నారు. మరో పక్క మాదర్ సంఘానికి చెందిన వారు శింబు ఇంటిని చుట్టు ముట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఉరి తీయాలి: కాగా సీనియర్ నటుడు వైజీమహేంద్రన్ మహిళల్ని కించపరచే విధంగా అశ్లీల పదజాలాలతో కూడిన పాటను రాసిన వారెవరైనా వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం.ఇక పోతే మంగళవారం కెనడా నుంచి చెన్నైకి తిరిగి రానున్న అనిరుద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం. కాగా శింబు తనకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తునట్లు తెలిసంది. మొత్తం మీద ఒక్క పాట కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోందని చెప్పవచ్చు. -
శ్రీవారి సేవలో అజిత్
ప్రముఖ తమిళ నటుడు అజిత్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సమయంలో ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. -
కొడుకు కోసం నిర్మాతనయ్యాను
చెన్నై : తన కొడుకును హీరో చేయడం కోసం నిర్మాత గా మారానని సీనియర్ నటుడు ఢిల్లీగణేశ్ అన్నారు. రంగస్థలం నుంచి వచ్చిన ఈయన బహుభాషా నటుడు కూడా. ఢిల్లీగణేశ్ కొడుకు మహా తెరంగేట్రం చేస్తున్నారు. ఓం గణేశ్ క్రియేషన్స్ పతాకంపై ఢిల్లీగణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్నుల్ ఆయిరం అనే పేరును నిర్ణయించారు. దర్శకుడు ఏఎల్.విజయ్ శిష్యుడు కృష్ణకుమార్ తొలి సారిగా మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో మహాకు జంటగా మలయాళీ బ్యూటీ మరీనా మైఖెల్, శ్రుతీయుగళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఇన్నుళ్ ఆయిరం చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఢిల్లీగణేశ్ మాట్లాడుతూ తన కొడుకు మహాను కథానాయకుడిగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా కథలు విన్నానన్నారు. ఈ సమయంలో దర్శకుడు ఏఎల్.విజయ్ వద్ద ఆరు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన కృష్ణకుమార్ ఒక కథ చెప్పారన్నారు. అది నచ్చడంతో ఓకే చేశామని చెప్పారు. మరో వైపు ఇతర నిర్మాతలు కొందరు తన కొడుకును హీరోగా పరిచయం చేయడానికి ముందుకొచ్చారని, అయితే వారు దర్శకుల్ని కూడా ఎంపిక చేసుకుని రావడంతో వద్దనన్నానని అన్నారు. ఇందులో తానూ ఒక పాత్ర పోషించానని చెప్పారు. తన కుమారుడు బాగా నటించాడని తెలిపారు. ఈ సమావేశంలో హీరో హీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
విజయ్‌కు అత్తగా కనిపించనున్న శ్రీదేవి
-
వదంతులకు భయపడే....
నిప్పు లేనిదే పొగ రాదన్నది సామెత. అయితే మన హీరోయిన్లు మాత్రం నిప్పు లేకుండానే పొగ పెడుతున్నారని వాపోతుంటారు. వీరిలో రెండు రకాల హీరోయిన్లను చూస్తుంటాం. కొందరు వదంతులను ఎంజాయ్ చేస్తున్నాం అంటుంటారు. మరికొందరు ఆవేదన కలిగిస్తున్నాయంటుంటారు. మూడవ రకం కూడా ఉన్నారు. తమపై తామే వదంతులు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ మూడు రకాల నాయికల్లో నటి ప్రియా ఆనంద్ ఏ రకానికి చెందుతారో గానీ వదంతులు వణికిస్తున్నాయంటున్నారు. పస్తుతం కోలీవుడ్‌లో ఈ బ్యూటీ పేరు బాగానే ప్రచారంలో ఉంది. చేతి నిండా చిత్రాలు కూడా ఉన్నాయి. ఎదిర్ నీచ్చల్ చిత్రంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసిన ఈ భామ గాలి వీచేలా చేసింది. ఈ అమ్మడి గురించి పలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అవన్నీ అసత్యాలంటున్న ప్రియా ఆనంద్ తన వెర్షన్‌ను చెప్పుకొస్తూ ఇలాంటి అనవసరపు పుకార్లు పుట్టుకొస్తాయనే స్నేహితుల పుట్టిన రోజు పార్టీలకు కూడా దూరంగా ఉంటున్నానన్నారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో తాను ఆశించిన స్థాయి లభించిందన్నారు. అరిమా నంబి, ఒరు ఊరుల రెండు రాజ, వై రాజా వై, ఇరుంబు కుదిరై చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాలన్నింటిలోనూ వైవిధ్యభరిత పాత్రలను పోషిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నాయికలు నేపథ్య గాయనీమణులుగా మారుతున్న సీజన్ తనలోను గాయనికి కావలసిన అర్హతలున్నాయన్నారు. వాటిని సంప్రదాయబద్ధంగా నేర్చుకున్నానని చెబుతూ పాటలు పాడాలనే తన ఆసక్తిని చెప్పకనే చెప్పారు. ఇకపోతే తన గురించి పుకార్లు పరుగులు తీస్తున్నాయని అలాంటి వాటిని జాలీగానే తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే తానెవరితోను పోటీలకు వెళ్లనన్నారు. కారణం ఇలాంటి వదంతుల ప్రచారం అవుతాయనేనన్నారు. సినిమా కార్యక్రమాలకు సంబంధించిన పార్టీలకు కూడా వెళ్లనని అయినా తనపై వదంతులు ప్రచారం అవడం వింతగా ఉందని ప్రియా ఆనంద్ చెప్పుకుంటున్నారు. -
తమిళ నటుడి ఆత్మహత్య
తమిళ నటుడు బాల మురళీమోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి చెన్నైలో పురసవాక్కమ్లోని తన ఇంటిలో ఉరి వేసుకొని ఆయన ప్రాణాలు తీసుకున్నారు. ఆయన వయసు 54 ఏళ్ళు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ‘బాయ్స్’ చిత్రంతో సహా పలు తమిళ చిత్రాల తెలుగు అనువాదాల ద్వారా ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. ‘అల్లిత్తంద వానమ్’ లాంటి తమిళ చిత్రాలు, అనేక వాణిజ్య ప్రకటనల ద్వారా జనానికి ఆయన జనానికి దగ్గరయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఈ తీవ్రమైన చర్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఆత్మహత్యకు కారణాలు తెలుసుకొనేందుకు దర్యాప్తు సాగిస్తున్నారు. -
ఫుట్‌బాల్ నేర్చుకుంటున్న కార్తీ
తమిళ హీరో కార్తీ కాలు కదుపుతున్నాడు. డాన్సులు ఎప్పటినుంచో చేస్తున్న ఈ యువహీరో.. ఇప్పుడు ఫుట్‌బాల్ నేర్చుకుంటున్నాడు. రంజిత్ దర్శకత్వంలో కార్తీ కొత్తగా నటిస్తున్న 'మద్రాస్' చిత్రంలో అతడు ఫుట్‌బాల్ ఆడాల్సిన అవసరం లేకపోయినా, పాత్రకు మాత్రం అవసరమని, అందుకే నేర్చుకుంటున్నాడని రంజిత్ తెలిపారు. ఉత్తర మద్రాసు ప్రాంతంలో ఉండే వాళ్ల పాత్రను కార్తీ పోషిస్తున్నాడని, అక్కడివాళ్లు ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడుతుంటారని అన్నారు. సినిమాలో కొన్ని ఫుట్‌బాల్ సన్నివేశాలు కూడా ఉండటంతో దానికోసం పదిరోజుల పాటు పూర్తిస్థాయిలో ఫుట్‌బాల్ నేర్చుకున్నాడని చెప్పారు. తాను అతడిని నేర్చుకొమ్మని చెప్పకపోయినా.. కార్తీయే అంకితభావంతో నేర్చుకుంటున్నాడన్నారు. కార్తీ చాలా మంచి నటుడని, అతడిని తెల్లవారుజామున 3 గంటలకు షూటింగుకు పిలిచినా, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేశాడని, ఒక్క బ్రేక్ కూడా తీసుకోకుండా ఏకధాటితా 30 గంటలు షూటింగ్ చేసినా ఒక్క ఫిర్యాదు కూడా అతడినుంచి లేదని రంజిత్ అన్నారు. కార్తీ సరసన కేథరీన్ ట్రెసా నటిస్తున్న మద్రాస్ చిత్రం ఉత్తర మద్రాసు ప్రాంతవాసుల జీవనచిత్రం. -
కాంగ్రెస్‌కు ‘గ్లామర్’
సాక్షి, చె న్నై: తమిళ రాజకీయాల్లో సినీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎం డీకే, ఎస్ఎంకే అధినేతలు సినీ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఆయా పార్టీల్లోనూ నటీ నటులు ఉన్నారు. ఎన్నికల వేళ వీరిని ప్రచారాస్త్రాలుగా ఆయా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. తాజా లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా నటి ఖుష్భు , నటుడు వాగై చంద్ర శేఖర్ వంటి వారు, అన్నాడీఎంకేకు నటులు వింధ్య, కుయిల్, సెంథిల్, రామారాజ్, ఆనందరాజ్ వంటి వారు ప్రచారంలో దూసుకెళుతున్నారు. డీఎండీకేకు విజయకాంత్ పెద్ద గ్లామర్. అయితే, కాంగ్రెస్ సినీ గ్లామర్ కోసం తీవ్రంగానే కుస్తీలు పట్టింది. ఎట్టకేలకు అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి నేత, నటుడు కార్తీక్‌ను తమ వైపు తిప్పుకున్నారు. తమ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు కార్తీక్ ప్రత్యేక ఆకర్షణ అయ్యా రు. ఈ పరిస్థితుల్లో ముంతాజ్ సైతం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాట పట్టారు. ప్రచారంలో ముంతాజ్: ఖుషీ, అత్తారింటికి దారేదిలో ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకారు హృదయాల్లో చోటు దక్కించుకున్న ముంతాజ్, తమిళంలో అనేక చిత్రాల్లో హీరోయిన్‌గాను, ఐటమ్స్ సాంగ్స్‌లతో, వ్యాంప్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. నమిత రాక ముందు, తన కంటూ ప్రత్యేకంగా గ్లామర్ ప్రపంచాన్ని సృష్టించుకున్న ముంతాజ్ ప్రస్తుతం సినీ అవకాశాలు కరువై ఖాళీగానే ఉన్నారు. దీంతో ఆమెను తమ పార్టీ తరపున ప్రచారానికి ఉపయోగించుకునేందుకు కాం గ్రెస్ నిర్ణయించింది. ఖాళీగా ఉన్న ముంతాజ్ ప్రజల్లోకి వెళ్దామనుకుని ప్రచార బాట పట్టారు. వేలూరు, అరక్కోణం లోక్ సభ పరిధుల్లో శనివారం రాత్రి ఓపెన్ టాప్ వాహనంలో ముంతాజ్ చక్కర్లు కొట్టారు. ఆమె ను చూడ్డానికి కుర్రకారు ఎగబడ్డారు. దీంతో ఉక్కిరి బిక్కిరైన ముంతాజ్ కాస్తో, కుస్తో వచ్చిన తమిళాన్ని కూడా మరచినట్టున్నారు. ఆంగ్లలో తమిళ వ్యాఖ్యలను రాసుకుని, రెండు భాషల్ని కలిపి కొడుతూ... జనం గుమికూడిన చోట ప్రసంగించాల్సి వచ్చిందట!. అయితే, తమ ప్రచారాలకు ‘గ్లామర్’ చేకూరిందంటూ కాంగ్రెస్ నేతలు తెగ సంబరపడిపోవడం గమనార్హం. -
రాలిన తార