వారీసు సినిమా చూశా.. త్వరలోనే గుడ్‌ న్యూస్: లోకేశ్ Director Lokesh Kanagaraj confirms talks are on for Vijay Thalapathy 67 Film | Sakshi
Sakshi News home page

Vijay Movie: గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌ మూవీ.. ఇకపై ఫుల్ అప్‌డేట్స్: లోకేశ్

Published Thu, Jan 12 2023 5:00 PM

Director Lokesh Kanagaraj confirms talks are on for Vijay Thalapathy 67 Film - Sakshi

తమిళ స్టార్ హీరో విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వారిసు. భారీ అంచనాల మధ్య ఈనెల 11న ఈ చిత్రం విడుదలైంది. అయితే విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించడానికి విజయ్‌ సిద్ధమైనట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు మాస్టర్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది విజయ్‌ 67వ చిత్రం కాగా.. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని 7 స్క్రీన్‌ స్టూడియోస్ పతాకంపై లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. 

ఇందులో విజయ్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధింన పూర్తి వివరాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ కూడా ఈ చిత్రంపై మౌనం వహిస్తున్నారు. కాగా బుధవారం విడుదలైన వారిసు చిత్రాన్ని దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ చెన్నైలోని థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..'వారిసు చిత్రం విడుదల కోసం ఎంతో అత్రుతగా ఎదురు చూశా.  ఇకపై విజయ్‌ 67వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ వరుసగా వస్తూనే ఉంటాయి. ఇది విజయ్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతుంది.' అని అన్నారు. 

గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ భారీ విజయం తర్వాత దళపతి విజయ్‌తో లోకేష్ కనగరాజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్  గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ ప్రాజెక్ట్‌తో తమిళ సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, అర్జున్ దాస్ సహా స్టార్ తారాగణం నటిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement