కెప‍్టెన్‌గా విజయ్‌కాంత్‌.. ఆ పేరు ఎలా వచ్చిందంటే? | Do You Know These Interesting Fact About How Actor Vijayakanth Get That Captain Name In Cinemas - Sakshi
Sakshi News home page

Actor Vijayakanth Facts: కెప‍్టెన్‌గా విజయ్‌కాంత్‌.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

Published Thu, Dec 28 2023 9:27 AM

Actor Vijayakanth Named As Captain In Cinemas - Sakshi

డీఎండీతే అధినేత, నటుడు విజయ్‌కాంత్‌ తమిళనాడులోని మధురైలో ఆగస్టు 25, 1952న జన్మించారు. కె.ఎన్.అలగస్వామి, ఆండాళ్ దంపతులకు ఆయన జన్మించారు. జనవరి 31, 1990 న ప్రేమలతను విజయకాంత్‌ను వివాహం చేసుకున్నారు.  వీరిద్దరికి విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.  ఇవాళ కరోనా బారిన పడిన ఆయన ఆస్పతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

కెప్టెన్ పేరు ఎందుకు వచ్చిందంటే..

"కెప్టెన్ ప్రభాకరన్" అనే చిత్రం ద్వారా విజయ్‌కాంత్‌కు కెప్టెన్' అని పేరు పెట్టారు. "కెప్టెన్ ప్రభాకరన్" 1992 సంవత్సరంలో విడుదల కాగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన విజయ్‌కాంత్‌.. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement