రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న ఈ వివాహా వేడుకలో అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత విజయ్- రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యారు. వీరిద్దరి వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పెళ్లి తర్వాత అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
పెళ్లి తర్వాత రష్మిక తాజాగా మరో పోస్ట్ చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. హల్దీ ప్లస్ హోలీ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో మేము ఎంతగా తడిసిపోయామో.. ఇప్పటికీ నా జుట్టు రంగు ఇంకా ఎర్రటి రంగులోనే ఉందన్నారు. ఇంతటి మధురమైన క్షణాల వేళ.. నా బ్రైడ్ టీమ్‌తో కలిసి ఆ రోజు అన్ని ఆటలను గెలిచానంటూ సంతోషం వ్యక్తం చేసింది. అయితే విజ్జూ కూడా ఆ రోజు టీమ్ బ్రైడ్ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. రష్మిక షేర్ చేసిన హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


