ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మృతి.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్! | Janhvi Kapoor pens note after celebrity hairstylist Marce Pedrozo death | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మృతి.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!

Mar 16 2026 7:12 PM | Updated on Mar 16 2026 7:15 PM

Janhvi Kapoor pens note after celebrity hairstylist Marce Pedrozo death

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌  ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైంది. అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో జాన్వీ  కపూర్ రాస్తూ..'సినిమా సెట్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లం.  వానిటీ వ్యాన్‌లో ప్రవేశించిన ప్రతిసారీ కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ ఉందని ఆటపట్టించేదాన్ని. నీతో  కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించేది. నీతో కలిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి.  ఇక నుంచి నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతాను.  గత రెండు సంవత్సరాలుగా నా సృజనాత్మక ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు నీ ముఖాన్ని చూడటం నా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి. లవ్ యూ.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా…' అంటూ పోస్ట్ చేసింది.

కాగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.

అసలు మార్స్ పెడ్రోజో ఎవరు?

మార్స్ పెడ్రోజో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది స్టార్స్‌తో కలిసి పనిచేశారు.  ఫిల్మ్ షూటింగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోని సృజనాత్మక నిపుణులతో కలిసి పనిచేశాడు, అతని  నైపుణ్యాలు, సెట్‌లో తన వర్క్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. అతని మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెడ్రోజోను గుర్తుచేసుకున్నారు. వరుణ్ ధావన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్  పరిశ్రమకు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement