
జిల్లా, వేలైక్కారన్, మెర్సల్ తదితర చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన జాయ్ క్రిజిల్డా (Joy Crizildaa) ప్రముఖ చెఫ్, నటుడు మాధంపట్టి రంగరాజ్‌తో పరిచయం పెంచుకుంది. మాధంపట్టి రంగరాజ్‌కు అప్పటికే వివాహితుడు కాగా, జాయ్ క్రిజిల్డాను రెండో పెళ్లి చేసుకున్నాడు. జాయ్ క్రిస్టిల్డా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తాను గర్భవతి అని ప్రకటించింది. కానీ ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.
మోసం చేశాడన్న కాస్ట్యూమ్ డిజైనర్
మాధంపట్టి రంగరాజ్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ జాయ్ క్రిజిల్డా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన కడుపులో పెరిగే బిడ్డకు రంగరాజ్ బాధ్యత వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత వారం జాయ్‌ను దాదాపు 6 గంటలపాటు విచారించారు. త్వరలోనే మాధంపట్టి రంగరాజ్‌ను కూడా విచారించనున్నారు. ఈ స్థితిలో జాయ్ క్రిజిల్డా శనివారం తన సోషల్ మీడియా పేజీలో ఒక సంచలనాత్మక పోస్ట్ చేసింది.
సిగ్గులేని మనిషి
“ఒక వ్యక్తి ఎలాంటి అపరాధ భావన లేకుండా తిరుగుతాడు. అతను గర్వంగా తల పైకెత్తి నడుస్తాడు. నువ్వు మంచివాడివిగా నిన్ను నువ్వు నిరూపించుకుంటూనే ఉన్నావు. నీలాంటి సిగ్గులేని మనిషిని ఇంతవరకు చూడలేదు. నువ్వు పరిగెత్తినా, దాక్కున్నా, పుట్టబోయే బిడ్డ శాపం నీడలా నిన్ను అనుసరిస్తుంది. అది నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లదు’ అని రాసుకొచ్చింది. మరో పోస్ట్‌లో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్, నువ్వేం తండ్రివి అని తిట్టిపోసింది.