
లెజెండ్ శరవణన్.. చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించాడు. గతేడాది 'లెజెండ్' మూవీతో ఎంటర్‌టైన్ చేసిన ఇతడు.. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా రజనీ 'జైలర్' పాటకు స్టెప్పులేస్తూ కనిపించాడు. అయితే డిఫరెంట్ గెటప్‌తో ఉండేసరికి నెటిజన్స్ తొలుత గుర్తుపట్టలేదు. కానీ ఆ తర్వాత మాత్రం వీడియోని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు)
స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు. గతేడాది విడుదలైన ఈ మూవీ టాక్ ఏంటనేది పక్కనబెడితే ట్రోల్స్ మాత్రం విపరీతంగా వచ్చాయి.
'లెజెండ్' తర్వాత బయటపెద్దగా కనిపించని శరవణన్.. మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా డిఫరెంట్ గెటప్‌లో ప్రత్యక్షమయ్యాడు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు చిన్నారులకు గిఫ్ట్స్ ఇచ్చిన ఇతడు.. ఆ తర్వాత 'జైలర్'లోని హుకుమ్ పాటకు స్టెప్పులేసి అలరించాడు. అందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ లోనే పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అయింది. పలువురు నెటిజన్స్ ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
அடுத்த படத்தின் அப்டேட்டை குழந்தைகளுடன் பகிர்ந்த
— Legend Saravanan (@yoursthelegend) August 15, 2023
தருணம்#Legend #Legendsaravanan @yoursthelegend pic.twitter.com/LocspXpDuX
(ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!)